Friday, November 4, 2011

విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా

విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా
విశ్వమే ఆగేలా ఉందిరా ఓ కాలమా!
కాల భావన లేని విశ్వం మహా ప్రళయమే
మౌనంతో నిలిచే విశ్వం కాలానికే నిరంకుశం ||

సాగించరా విశ్వాన్ని నా భావాలతో యుగాలుగా
మేధస్సులో ఉన్నాయి యుగాల భావాలు ఎన్నో
అనంతమై విశ్వ కాలంతో సాగేలా ఉద్భవిస్తున్నాయి
ఆశ్చర్యమైనా అద్భుతంగా సాగేలా కలుగుతున్నాయి

ప్రతి జీవికి పునరుద్ధారణ శక్తి కలిగేలా మళ్ళీ సూర్యోదయం
మళ్ళీ మహోదయ విశ్వ భావాలతో సకల జీవరాసులు జీవిస్తాయి
అనంతర శక్తి భావాలు ఉద్భవిస్తూ విశ్వమే సాగిపోతుంది
కాల భావాలు విశ్వంతో ఏకమై యుగాలుగా సాగిపోతాయి

విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా
విశ్వమే ఆగేలా ఉందిరా ఓ కాలమా!
కాల భావన లేని విశ్వం మహా ప్రళయమే
మౌనంతో నిలిచే విశ్వం కాలానికే నిరంకుశం ||

జీవించు విశ్వానికి తోడుగా మహా మిత్రుడిగా
కాలాన్ని సాగించు జీవిగా మహా మేధావిగా
విశ్వమంతా నీ భావన విజ్ఞానమే సాగుతున్నది
విశ్వానికి నీ కాల భావాలే సాగిపోతున్నాయి

విశ్వానికి నీ భావనతో స్పర్శ కలుగుతున్నది
నీవు లేని విశ్వం మౌనమైనా మహా ప్రళయమే
నీలోని శాంతి తత్వం విశ్వానికి మహా చైతన్యం
నీలోని జీవం కాలానికే మహా గుణ శక్తి యోగం

విశ్వమే నీకు తెలుపుతున్నది జీవించరా మహా శక్తివై
కాలంతో జీవమై మహా దివ్య భావాలతో నన్ను సాగించరా
మహా కార్యాలతో సతమతమవుతూ కాలంతో ప్రయాణించలేక పోతున్నా
నీలోని శాంతి తత్వ గుణాలను నాకు అందిస్తూ నన్ను నీతో సాగించు

విశ్వాన్ని సాగించరా విశ్వ నేస్తమా
విశ్వమే ఆగేలా ఉందిరా ఓ కాలమా!
కాల భావన లేని విశ్వం మహా ప్రళయమే
మౌనంతో నిలిచే విశ్వం కాలానికే నిరంకుశం ||

ఏనాటిదో ఏనాటికో తెలియని భావనతో

ఏనాటిదో ఏనాటికో తెలియని భావనతో జన్మించావు
ఏనాటిదో ఏనాటికో తెలియని జీవితాన్ని సాగిస్తున్నావు
ఎంతవరకు జీవం ఉంటుందో ఎప్పటివరకు జీవితం సాగుతుందో
కాల భావనకు తెలిసినట్లుగా మేధస్సుకు తెలియకపోతున్నది ||

విశ్వంలో నీ రూపం ఉన్నట్లు మరో రూపం లేకనే జన్మించావా
జగతిలో నీ విజ్ఞానం ఉన్నట్లు మరో జీవికి లేకనే జన్మించావా
ఏ జీవికి లేని రూప విజ్ఞానం నీకే ఉందని విశ్వమంతా తెలిసిందా
విశ్వమంతా నీ విజ్ఞానమే తెలిసేలా మహా విజ్ఞానంతో జీవిస్తున్నావా ||

అన్వేషణతో సాగే నీ మేధస్సుకు విశ్వమే విజ్ఞానమై నీలో ఉన్నది
భావనతో సాగే నీలో ఆలోచనకు విశ్వమే జీవమై నీతో జీవిస్తున్నది
వేదమే విజ్ఞానంగా నీ జీవితానికి కాలమే దారి చూపుతున్నది
మౌనమే శ్రద్ధగా నీ మేధస్సుకు కాలమే పరమార్థాన్ని తెలుపుతున్నది ||

విచక్షణతో ఆలోచించే నీ మేధస్సులో భావన ఓ మూల కారణం
విశ్వార్థ విచక్షణను గ్రహించే నీ మేధస్సులో ఆలోచన పరమార్థం
మనస్సును మేధస్సుతో కేంద్రీకరించి ఆలోచనను విజ్ఞానపరుస్తున్నావు
భావాన్ని జీవంతో కేంద్రీకరించి ఆలోచనను అర్థంగా మారుస్తున్నావు ||

మరణం నీ వయసుకు తెలుస్తున్నది కాలం నీ జీవితాన్ని సాగిస్తున్నది
నీ మేధస్సు విధానం కాలమే నిర్ణయించినా విజ్ఞానాన్ని నీవే నిర్ణయించుకో
ఆలోచనలతో జీవితాన్ని గ్రహిస్తూ మరణించే వరకు విజ్ఞానంగా ప్రయాణించు
కాలంతో సాగిపోతూనే అందరితో సాగిపోతూ ఎందరితో తెలుస్తుంది మరణం ||

Tuesday, November 1, 2011

విశ్వమనే భావన నీలో ఉందా

విశ్వమనే భావన నీలో ఉందా
విశ్వమనే ఆలోచన నీలో ఉందా
విశ్వాన్ని చూడగా నీలో కలిగిందా ఓ కొత్త భావన
విశ్వాన్ని చూస్తూనే నీలో తోచిందా ఓ కొత్త ఆలోచన
మనస్సుతో చూస్తే చూడకనే తెలుస్తుందా సరికొత్త భావాలోచన ||

మనలోనే ఉన్నాయి భావాలెన్నో మనతోనే ఉంటాయి ఏనాటికైనా
మనస్సుతోనే ఉన్నాయి ఆలోచనలెన్నో ఆలోచిస్తే తెలుస్తాయి ఎన్నెన్నో
భావాలే ఆలోచనలుగా మేధస్సులో కలిగేలా మనస్సే అన్వేషిస్తుంది
ఆలోచనలే కార్యాలుగా సాగేలా మేధస్సే విజ్ఞానాన్ని తెలుపుతుంది
విజ్ఞాన కార్యాలే మన జీవిత మార్గపు పరమార్థం
సుజ్ఞాన బంధాలే మన జీవన గమ్యపు విషయార్థం

విశ్వమనే భావన నీలో ఉందా
విశ్వమనే ఆలోచన నీలో ఉందా
విశ్వాన్ని చూడగా నీలో కలిగిందా ఓ కొత్త భావన
విశ్వాన్ని చూస్తూనే నీలో తోచిందా ఓ కొత్త ఆలోచన
మనస్సుతో చూస్తే చూడకనే తెలుస్తుందా సరికొత్త భావాలోచన ||

కాలం తెలిపే విశ్వ వేదం ఏ భావాన్ని తెలుపునో
గత భావాల వేద విజ్ఞానం ఏ ఆలోచనను సూచించునో