Monday, August 31, 2015

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!
ప్రతి రోజు ఉదయిస్తూ ప్రతి జీవికి మెలకువ కలిగిస్తూ
విశ్వానికే తేజమై మేధస్సులకే ఉత్తేజమై సాయంత్రపు సంధ్య వేళ అస్తమించేను ఓ... మేఘమా! ॥

జగతికే ఆది కేంద్రంలా ఉదయిస్తూ మేధస్సులకే ఆలోచన భావనను కలిగించేను
సూర్య కిరణాలతో వెలుగును ప్రసారిస్తూ మేధస్సులకే విజ్ఞానాన్ని అందించేను
తన వెలుగులోనే ప్రతి జీవి చలనం సాగిస్తూ జీవనాన్ని కార్యాలతో సాగించేను
చీకటి అయ్యేలోగా ఇంటిని చేరుతూ విశ్రాంతితో సేద తీరి జీవులు నిద్రించేను ఓ... మేఘమా! ॥

సూర్య దేశం ఓ విజ్ఞాన క్షేత్రమై ప్రతి జీవి సూర్య తేజస్సుతో విజ్ఞానంగా ఎదుగుతుంది
సూర్యుని కిరణాల తేజస్సు మేధస్సులో కలిగే ఉత్తేజమైన ఆలోచనలకు స్పూర్తినిస్తుంది
సూర్యుని శక్తితోనే మన సామర్థ్యం పట్టుదల ధృడమై వివిధ కార్యాలకు చేయూతనిస్తుంది
సూర్య ప్రపంచం ఓ విజ్ఞాన స్థావరమై విశ్వానికి పరిపూర్ణమైన సంపూర్ణ భావాన్ని కలిగిస్తుంది ఓ... మేఘమా! ॥ 

Tuesday, August 25, 2015

ఓ వర్ణ మోహపు సుందరీ..

ఓ వర్ణ మోహపు సుందరీ.. నీవు సువర్ణ దేశపు యువరాణివే   
విశ్వ దేశాల సుందరీ..  నీవు అఖండ జగతికే నవనీత తరంగిణివి ||

సువర్ణాలతో పొదిగిన నీ దేహం సుగంధ పరిమళాల సౌందర్యం
నవ వర్ణాలతో ఒదిగిన నీ రూపం సూర్యోదయ కాంతికే సుందరం  ||

నీ ఆకార రూపం మనస్సులో మంత్రమై ధ్యాసలో తంత్రమయ్యేను
నీ నాట్య కళా భావం మేధస్సులో మర్మమై శ్వాసలో స్థిరమయ్యేను  ||

నక్షత్రాల వెలుగులో నడిచి వెళ్ళే ఆకాశ దేశపు మేఘ మాలిని నీవే 
గంధర్వ లోకాన జల సుగంధాల పల్లకిలో ఊరేగే సుధారాణి నీవే    ||

ఊహా చిత్రాలలో ఒదిగిన అనంత దేశాల దివ్యమైన విశ్వ సుందరి నీవేలే
అజంతా ఎల్లోరా శిల్పాలలో అలరించినా అందాల ఆణి ముత్యానివి నీవేలే  ||

జగమున జత కలిసే జాబిలి రాత్రి జగన్మోహన సుందిరి నీవేలే
జగతిలో జలదరించే జన జీవన జాడలో జగదేక సుందరి నీవేలే   ||

నక్షత్రాల దీవిలో నవ మోహన వర్ణ ఛాయలో నిలచిన తారవు నీవేలే
విశ్వపు దీవుల వీధిలో వయ్యారి హంసల అతిలోక సుందరి నీవేలే   ||

అమృత తేనీయపు సెలయేరులో జలకాలాడే జలధారపు నెరజాణవు నీవేలే
శికరపు అంచుల సరస్సులలో సరసాలాడే సరోవర సంయుక్తవు నీవేలే    ||

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా
నా స్వర గాన సంగీతాన్ని వినిపించరా
నాలోని వేద గీతాన్ని నీవే ఆలకించరా
నీకై నా శ్వాస భావాన్ని అర్పించెదనురా ॥

నీ ధ్యాన శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసనై శృతిని కలిపెదనురా
నీ విశ్వ భావాలలో నవ నాడుల జీవ తత్వాలను గమనించెదనురా
నీ దేహ ఆకారాలలో విభూదినై మహా రూపాన్ని అవతరించెదనురా
నీ యోగ ధ్యాసలో విశ్వ భావాన్నై స్వప్త స్వరాలతో శృతించెదనురా

శంకరా శంఖంతో శంకించకురా నాపై కక్ష ఉన్నను నీ కక్ష్యలోనే జీవించెదనురా
విష నాగులతో భయ పెట్టినను నీ డమరుకాన్ని ఏనాటికి నేను విడవలేనురా
త్రిలోకాలలో త్రినేత్రుడవై త్రినేత్రంతో నన్ను భస్మం చేసినను నీ త్రిశూలాన్ని వదలనురా
ఎన్ని ప్రళయాలు సంభవించినను నీకై యుగాలుగా జీవిస్తూ గంగా జలమై నివసించెదనురా ॥

శంకరా నీకై శృతి మించెదనురా నటరాజ కళా నాట్యంతో నిన్నే మెప్పించెదనురా
విశ్వమంతా నీ నామ శృతినే వివిధ స్వర భావ జీవ తత్వాలతో స్మరించెదనురా
నీకై పుష్పమైనను పత్రమైనను జలమైనను సమర్పిస్తూ పాద సేవ చేసెదనురా
నీ మెడలో రుద్రాక్షమై కర్త కర్మ క్రియల బంధాన్ని నేనుగా అనుభవించెదనురా

విశ్వమందు నిన్ను ఎక్కడ వెతికినను అక్కడే నా శ్వాసలో నీవే జీవించెదవురా
జగతిలో నీవు ఎక్కడ ఉన్నను ప్రతి జీవి శ్వాసలో నీవే జీవమైనావని తెలిసెనురా
సృష్టిలో ఏ స్వరమైనను నీ ఓంకార శృతియే ఆది రాగమై విశ్వ భాషగా పలికెదమురా
భువిలో నీ విశిష్టత విశ్వాంతరమై కాలమంతా వ్యాపిస్తూ నలు దిక్కులు దాగెనురా ॥ 

Tuesday, August 4, 2015

విశ్వ సుందరి నీవు విశ్వమున ఎక్కడ ఉన్నావో

విశ్వ సుందరి నీవు విశ్వమున ఎక్కడ ఉన్నావో
విశ్వపు అంచులలలో నీవు ఎక్కడ దాగి ఉన్నావో

విశ్వ భావాలు నీకు తెలుసా విశ్వ లోకాలు నీకు తెలియునా ॥

విశ్వమందు నీవు ఎక్కడ ఉన్నా అచటనే నే ఉండగలను
విశ్వమందు నీవు ఎలా ఉన్నా అలాగే నే చూడగలను

విశ్వమంటే నీకు నేస్తమా విశ్వమంటే నీకు ప్రాణమా
విశ్వమంటే నాకు వేదమే విశ్వమంటే నాకు జీవమే

విశ్వ ధ్యాసలో నీవు ఉన్నా విశ్వ భాషలో నే దాగి ఉన్నా
విశ్వ శ్వాసతో నీవు ఉన్నా విశ్వ నాభిలో నేనై ఉన్నా

విశ్వ ధ్యానమే చేసినా విశ్వ యోగమే సాగునా
విశ్వ రూపమే చూసినా విశ్వ సుందరియే దర్శించునా  ॥

విశ్వమే నా నేత్రమై విశ్వ తేజమే నీ రూపమగునులే
విశ్వమే నా దైవమై విశ్వ లోకమే నీ స్థానమగునులే

విశ్వమందు నీవు లేకపోతే నాలో అఖండ అన్వేషణయే
విశ్వమందు నీవు శూన్యమైతే నాలో విశ్వం అంతరించునే

విశ్వమందు నీవు లేని సౌందర్యం పుస్పమే లేని ప్రకృతియే
విశ్వమందు నీవు లేని జీవితం నిధి లేని జీవన సన్నిదియే  

విశ్వమంతా నా జగతియే విశ్వమంతా నా తత్వమే
విశ్వమంతా నా అణువులే విశ్వమంతా నా జీవ భావాలే ॥