Tuesday, May 31, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
ఇది నవ్వుతూ నడిచే రహదారి కాదయ్యా
ఇది అనుభవంతో నడక నేర్చే మహాదారయ్యా  || ఓ బాటసారి .....  ||

ఎందరో అడుగులు వేస్తూ ఉంటారు పడి పడి పోతూ లేస్తారు
ఎన్నో సార్లు పడి  పడి లేచినా సాగించే ప్రయాణమే ఈ దారి

జీవితమంతా ప్రయాణించినా అనుభవం చాలదయ్యా
జీవనమే మార్గమని తలచినా అడుగులు తప్పి పోవునయ్యా

ఏనాటికి తెలియని పరిమాణమే దారిలో తెలియని నవ సూత్రాలు
ఏనాటికి తెలియని పరిశోధనమే మార్గంలో తెలియని  విధానాలు   || ఓ బాటసారి .....  ||

భావంతో నడిచినా భాష్పంతో సాగించినా
జ్ఞానంతో నడిచినా విజ్ఞానంతో సాగించినా

మనిషికే తెలియని అన్వేషణ
మేధస్సుకే తెలియని ప్రతి ఘటన

ఏ సమయంలో నీవు మరణిస్తావో నీ గమ్యం ఎక్కడని తెలియదుగా
ఏ క్షణంలో నీవు జన్మించావో నీ స్థానమే ఏదని గమనించ లేదుగా   || ఓ బాటసారి .....  || 

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో
ఏదో సందేహం ఎంతో ఆరాటం ఏమో సందిగ్దం నాలో
తీరని అనుభవం వీడని అనుబంధం మనలో సాగే అనురాగం ఎందుకో ఈ వేళ || ఏదో సంతోషం ||

మనస్సులో ఆనందం హృదయంలో కలిగే సంతోషం
యదలో అనురాగం మేధస్సులో కలిగే అనుబంధం

మాటలతో సాగే ప్రయాణం మమతై కోరినది మమకారం
భావాలతో సాగే కాలం మధురమై వచ్చినది మకరందం

ఏనాటి భావాలో నేడు నీ కోసమే వస్తున్న మధురిమలు
ఏనాటి స్వప్నాలో నీ చెంతకే చేరుతున్న పదనిసలు    || ఏదో సంతోషం ||

జీవనమే హాయిగా నీతో సాగే జీవితమే మన ప్రేమ
జీవమే స్వేచ్ఛగా నీతో కలిసే మదియే మన జన్మ

పుష్పాలు వికసించే పరిమళాలు నాలోనే దాగున్నాయి
తేనీయం కవ్వించే సుమ గంధాలు నీతోనే వస్తున్నాయి

తెలియనిది ఏదైనా ఉంటే సందేహమే
తెలుసుకోవాలని ఎంతైనా ఉంటే ఆరాటమే
తెలుసుకున్నా తోచకపోతే సందిగ్ధమే

భావాలతో జీవిస్తే జీవితం ఎంతో సంతోషం
బంధాలతో జీవిస్తే జీవనమే ఎంతో ఉల్లాసం  || ఏదో సంతోషం ||

నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు

నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు
నీతోనే నేనున్నాను నాతోనే నీవున్నావు

నీవు నేను ఒకరికి ఒకరు కలిసే జీవిస్తాము
నీవు నేను ఒకరికి ఒకరై కలిసే ప్రయాణిస్తాము  || నీలోనే ||

ఏనాటికైనా అనుబంధంతోనే ముందుకు సాగాలి
ఎప్పటికైనా అనురాగంతోనే ముందడుగు వేయాలి

ఎవరికి ఎవరు తెలియకున్నా పరిచయంతోనే కలవాలి
ఎవరికి ఎవరు లేకున్నా సంబంధంతోనే కలిసి పోవాలి  

ఎవరితో ఎవరు జీవిస్తారో జగతికే తెలియాలి
ఎవరితో ఎవరు ఉంటారో లోకమే తెలపాలి  || నీలోనే ||

నీవు లేనిదే నాలో కలిగెనే మౌనం
నీవు లేకనే నాలో సాగెనే శోకం

నీవు లేని క్షణం మనస్సులో కలహం
నీవు లేని నిమిషం యదలో విషాదం

నీవే నాలో జీవించే మధుర స్వప్నం
నీవే నాలో స్మరించే సుగంధ పుష్పం    || నీలోనే ||

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి
ఏనాటి శిల్పానివో నీవు అపురూపమై నిలిచావు ఈ లోకానికి

సృష్టిలోని అందాలలో నీవే అతి మధురమైనావు ఈ విశ్వానికి
ఆకార రూపాలలో నీవు శృంగార సౌందర్యమైనావు ఈ ద్వీపానికి  || ఏనాటి ||

నీలోని భావాలు నీలోనే మౌనమై శిలగా మారిపోయినాయి
నీలోని పదాలు నీలోనే లీనమై శిల్పంలో దాగి ఉన్నాయి

ఏనాటి సుందర సౌందర్యవతివో నీ చూపులే తెలుపుతున్నాయి
ఏనాటి సుగంధ సరసానివో నీ వయ్యారములే చూపుతున్నాయి

ఎవరికి నీవు బంధానివో అనుబంధమే కలిసిపోవాలి
ఎవరికి నీవు చిత్రానివో అభినయ వర్ణమే మెరిసిపోవాలి  || ఏనాటి ||

ఎంతటి గుణ సుందరివో సువర్ణ సౌందర్యమే దాగినది
ఎంతటి రాగ తరంగిణివో సప్తస్వర సంగీతమే ఒదిగినది

ఎంతటి దివ్య మోహానివో ముఖ బింభమే ఆకాశాన్ని చూస్తున్నది
ఎంతటి వర్ణ తేజస్వినివో సూర్య ప్రకాషమే నిన్ను కాంక్షిస్తున్నది  

ఎక్కడ నీవు ఉదయించావో అమరావతిలో శిలై ఉన్నావు
ఎక్కడ నీవు అస్తమించావో ఇక్కడే నీవు కొలువై ఉన్నావు   || ఏనాటి || 

Monday, May 30, 2016

నీ నీడలో గురువునై ఉన్నాను నీకు తోడుగా

నీ నీడలో గురువునై ఉన్నాను నీకు తోడుగా
నీ శ్వాసలో శిలనై ఉన్నాను నీకు మిత్రుడిగా || నీ నీడలో ||

నీతోనే ఉంటాను నీ విజ్ఞానమునకై
నీలోనే ఉంటాను నీ భావములకై

నీ ఆలోచనలలో దాగిన హిత జ్ఞానమును నేనే
నీ జ్ఞానములో దాగిన అర్థ పరమార్థాన్ని నేనే

నీలోని భావ స్వభావాలతో ఉంటాను సద్భావంతో
నీలోని విశ్వ తత్వాలతో ఉంటాను సమయోచితంతో  || నీ నీడలో ||

ఆత్మగా వచ్చాను నీ కోసం ఈ లోకానికి
దైవమై ఉంటాను నీ కోసం ఈ జగతికి

నీవు చేసే సాధనలో సామర్థ్యాన్ని నేనే
నీవు సాగే అన్వేషణలో దిక్సూచిని నేనే

నీ మేధస్సుకు భోధించే భోది వృక్షాన్ని నేనే
నీ ఆలోచనకు కలిగించే విజ్ఞానాన్ని నేనే   || నీ నీడలో ||

ఊపిరి ఆగి పోయిందా ఊహ నిలిచి పోయిందా ప్రభూ!

ఊపిరి ఆగి పోయిందా ఊహ నిలిచి పోయిందా ప్రభూ!
శ్వాస ఆగి పోయిందా ధ్యాస నిలిచి పోయిందా ప్రభూ!

నీ నామ ధ్యేయములోనే వినిపిస్తున్నది ఓంకార శబ్దము ప్రభూ!
నీ ధ్యాన భావములోనే తెలుస్తున్నది ఓం నమః శివాయ ప్రభూ!   || ఊపిరి ||

నీవు నిలిచిన రూపమే విశ్వానికి ప్రతి రూపం
నీవు వెలిసిన స్థానమే జగతికి పుణ్య క్షేత్రం

నీవు లేని శ్వాస ఏ జీవికి నిలవదుగా దేహం
నీవు లేని ధ్యాస ఏ జీవికి కలగదుగా భావం

నీవు తలచిన దైవమే ఈ లోకం
నీవు నడచిన ధర్మమే ఈ సత్యం  || ఊపిరి ||

నీవు లేని లోకము మాకు ఓ శూన్యము
నీవు లేని జగతి మాకు దుఃఖ సాగరము

నీవు లేనిదే కాలము క్షణమైనా సాగదు
నీవు లేనిదే కార్యము విజ్ఞానమై సాగదు

నీవు చూపే దారిలోనే వెలుగును చూస్తున్నాము
నీవు తెలిపే భావనలోనే విజ్ఞానాన్ని గ్రహించాము  || ఊపిరి ||

Sunday, May 29, 2016

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస
ఆట పాటలతో మాటలు కలిపితే పదాలలోనే సద్భావం 
మాటలతోనే బంధాలన్నీ అనువైన ఆనందం
ఆనందంతోనే అనుబంధాలన్నీ సంబంధాలుగా కలిసేను  || సంగీతంలో ||

ఏనాటికైనా బంధాలన్నీ కలిసే వేళ వస్తుంది ఉత్సవంలా
బంధాలతో కొత్త సంభందాలు కలిసినప్పుడే మహోత్సవం
ఊరు వాడ అందరు కలిస్తేనే జరుపుకుంటారు రథోత్సవం
నగరాలన్నీ దేశాలుగా కలిసి జరిగేను మహా బ్రంహోత్సవం  || సంగీతంలో ||

మనస్సు మనస్సు కలిసినప్పుడే కల్యాణోత్సవం
దశాబ్దాలుగా కలిసి జీవిస్తేనే దశ దిక్కులా దశోత్సవం
శతాబ్దాలుగా కలిసి జీవించినప్పుడే మధురమైన శతోత్సవం
ఎన్నాళ్ళైనా ఎక్కడైనా ఎప్పుడైనా అందరు కలిసి చేసుకుంటే వజ్రోత్సవం  || సంగీతంలో ||

ఉత్సవాలను జరుపుకుంటూ పోతే ఎన్నైనా మనకు కలిగే సంగీతాల సంతోషం
అలా చెప్పుకుంటూ పొతే 25 ఏళ్ళ రజతోత్సవం 50 ఏళ్ళ మహోదయ సువర్ణోత్సవం
జరుపుకునే వార్షికోత్సవాలన్నీ ఆనందంగా ఎక్కువ కాలం అందరు జీవించాలనే
కొత్త పాత అందరు నవ భావాలతో నూరేళ్ళు జీవించాలనే ఈ మాటల ఉత్సవాలు  || సంగీతంలో ||

Friday, May 27, 2016

మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఉంది

మళ్ళీ మళ్ళీ చెప్పాలని ఉంది
మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది
చెప్పినదే చెప్పాలని మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది
చూసినదే చూడాలని మళ్ళీ మళ్ళీ కలవాలని ఉంది    || మళ్ళీ మళ్ళీ ||

మళ్ళీ మళ్ళీ ఏ రోజు వస్తుందో ఎదురు చూడాలని ఉంది
మళ్ళీ మళ్ళీ అదే రోజు అలాగే వస్తుందని కలగానే ఉంది

మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే సమయమే తెలియకున్నది
మళ్ళీ మళ్ళీ గుర్తే లేకపోతే ఏదీ తెలియనట్లే ఉంటున్నది

మళ్ళీ మళ్ళీ కలిసే కాలమే రావాలని ఉంది
మళ్ళీ మళ్ళీ కలిసే ఉండాలని ఆశగా ఉంది   || మళ్ళీ మళ్ళీ ||

మళ్ళీ మళ్ళీ కలసిన క్షణం మరల రాని మరో క్షణం
మళ్ళీ మళ్ళీ కలిసిన రోజు మరవలేని మధుర క్షణం

మళ్ళీ మళ్ళీ జీవించే జన్మ ఉందంటే మళ్ళీ ఉదయిస్తాం
మళ్ళీ మళ్ళీ మనమే జతగా ఉంటే మళ్ళీ కలిసే జీవిస్తాం

మళ్ళీ మళ్ళీ ఇదే జగతి మనదైతే తరతరాలు వస్తుంటాం
మళ్ళీ మళ్ళీ ఇదే మన లోక మైతే కలిసి మెలసి ఉంటాం  || మళ్ళీ మళ్ళీ || 

జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే

జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే
మేము కోరినవన్నీ తీర్చే అనంత శక్తివి నీవే
జగతికి జగదేశ్వరుడు నీవే లోకానికి లోకేశ్వరుడు నీవే
గంగా జలానికి గంగాధరుడు నీవే సృష్టికి మూలం నీవే || జీవము ||

మేధస్సున కలిగే ఆలోచనలో అర్థానివి నీవే
ఆలోచనలో దాగిన భావ పరమార్థానివి నీవే

కాలంతో సాగే ఆలోచనలలో కలిగే కోరికలు తీర్చుకునే సమయం నీవే
కోరికలను తీర్చుకునేందుకు కావలసిన విజ్ఞాన సామర్థ్యాని కలిగించేది నీవే

కోరికలతో పాటు ఎన్నో సంతోషాలను కలిగించే విశ్వ చైతన్య మూర్తివి నీవే
సుఖ సంతోషాల ఆనందాలతో మానవ హృదయాలను నడిపించేది నీవే    || జీవము ||

జగతికి జీవము నీవై ఎన్నో జీవరాసులకు ప్రాణమిచ్చే దాతవు నీవే
విశ్వానికి శ్వాసవు నీవై ఎన్నో జీవులకు జనన మరణ కర్త క్రియ నీవే

ఆకలి నుండి అనంతమైన కోరికలను తీర్చే ఆది పరాశక్తివి నీవే
క్షణము నుండి యుగాలుగా సాగే కాల చక్రానికి భైరవుడవు నీవే

లోకాన్ని శాసించే మహా పంచభూత పరంజ్యోతివి నీవే
బ్రంహాండాన్ని నడిపించే లోకాలకు జగద్గురువు నీవే   || జీవము || 

Thursday, May 26, 2016

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా

ఏది నీ ధ్యేయం ఏది నీ లక్ష్యం ఏది నీకు సాధ్యం తెలుసుకో ఓ మిత్రమా
తెలిసినది విజ్ఞానం తెలియనిది అనుభవం సాధన చేసుకో ఓ భావమా    || ఏది నీ ధ్యేయం ||

అన్నీ తెలిసి ఉన్నా తెలియనిది మరో కొత్తగా కాలంతో వస్తూనే ఉంటుంది
కాలంతో మారిపోయే అలవాట్లతో వచ్చి పోయేవి ఎన్నో మేధస్సుకే తెలియాలి

విజ్ఞానం సౌందర్యం అలంకారం అనుభవించడం ఇవేనా మన సౌకర్యం
సృష్టించడం సుధీర్గ కాలం శ్రమించడం ఇవేలే మనకు అసలు సిసలు

విజ్ఞానానికి కొదవ లేదు అనుభవానికి తావు లేదు ఎక్కడైనా తెలియని విధమేలే
అందరికి అన్నీ అందక పోయినా అవసరమయ్యేవి అందించాలి ఓ మిత్రమా  || ఏది నీ ధ్యేయం ||

సాధనతో  సాధ్యం చేసుకోవడమే మన కర్తవ్యం
దీక్షతో శ్రమించడమే మన జీవిత పర మార్థం

అన్వేషించడంలోనే ఉన్నది నవ జీవన విజ్ఞానం
నీవుగా ఎదిగి ఎందరికో దారి చూపడమే సంపూర్ణం

నీతో ఉన్నది నలుగురికి చెప్పడమే విజ్ఞాన సోపానం
నీకు మరల కొత్త అనుభవం కలగడమే కాల తత్త్వం

నీ ధ్యేయం ఓ విజ్ఞాన విశ్వ గ్రంథం
నీ లక్ష్యం నవ జీవన విధాన సంపూర్ణత్వం
నీ సాధన ప్రతి క్షణం అనుభవంతో జీవించడం || ఏది నీ ధ్యేయం ||

Wednesday, May 25, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
నీటితో ప్రయాణమా నావతో చెలగాటమా
ఇది జీవిత పోరాటమా జీవన చదరంగమా || ఓ బాటసారి ..... ||

గాలి వానతో సుడిగుండమై ప్రయాణమే మారిపోయేను
ప్రయాణము సాగని నావ చిందర వందరమై పోయేను

మార్గం తెలియని నీటిలో నావ లేక మిగిలిపోయేవు
ఒడ్డుకు చేరుకోలేక నీటిలోనే మునిగి తేలి పోయేవు

ఏ దిక్కున ప్రయాణించాలో దిక్సూచి కూడా లేకపోయే
దిక్కులన్ని ఒకటై నీటి చుట్టూ తిరుగుతూ ఉండిపోయే || ఓ బాటసారి ..... ||

ఏ వైపు చూసిన ఒకటే దూరం ఎటూ వెళ్ళినా అన్ని వైపులా అంతంతే దూరం
ఏ వైపు వెళ్ళినా దూరం తగ్గని విధంగా దిక్కు తోచని దూరంతో దిక్కులదూరం

ఆగి పోవాలని లేదు ప్రయాణించాలని తెలియుట లేదు
ఆగినా ఉండలేను సాగినా ఎటు వెళ్ళాలో ఏదీ తోచట్లేదు

ఇది జీవన పోరాటమో జీవిత చదరంగమో తెలియని ప్రయాణం
ఏది తెలిసినా ఏది తెలియక పోయినా ప్రయాణంతో సాగి పోవాలి || ఓ బాటసారి ..... || 

Monday, May 23, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
చివరికి లెక్క తేల్చి వెళ్ళగలవా
లెక్క తేల్చకుండా వెళ్ళలేవా
ప్రతి ఒక్కరు లెక్క తేల్చి వెళ్ళాలనుకున్నా తేల్చకుండానే వెళ్ళిపోయారు || ఓ బాటసారి ..... ||

అసలు ఎంతో అప్పు ఎంతో
ఎవరు నీకు ఎంత అప్పో నీవు ఎవరికి ఎంత అసలో
ఎవరెవరు తిరిగి ఇస్తారో ఎవరెవరికి నీవు ఇచ్చావో

కాలంతో సాగే ధన జీవనం సమయానికి తేలని జీవిత మూలం
సమయంతో సాగే లెక్కింపులో చిక్కులు ఎన్నో తేలని రోజులే  || ఓ బాటసారి ..... ||

లెక్కలు వేసే ప్రతి లెక్కకు ఏవో చిక్కులు ఉంటాయి
లెక్కలు తేలని ప్రతి లెక్కకు సమస్యలే వస్తుంటాయి

లెక్క ఎంత చక్కగా వేసినా తీరని లెక్కలు ఎన్నో ఉంటాయి
లెక్కలు తేలినా అవి తీర్చని లెక్కలుగానే మిగిలి పోతాయి

ఉన్నవారు కూడా లేనివారిగా మాటలు చెప్పుతూ తప్పుకుంటారు
లేనివారు ఎంతో శ్రమించి అప్పుడప్పుడు కాస్త తీరుస్తూ ఉంటారు || ఓ బాటసారి ..... ||

ఓ బాటసారి ....

ఓ బాటసారి ....
నీటిలో ప్రయాణమా రహదారిలో ప్రమాదమా
రహదారిలో అడుగు వేస్తే నడవడి మారిపోవునా
నీటిలో అలలు వస్తే నావ తిరగబడి పోవునా  || ఓ బాటసారి .... ||

వర్షం వస్తే రహదారి చిందర వందర అగునా
నదిలో నావ చీటికిమాటికి అటుఇటు తిరుగునా

రహదారిలో దిక్కులు తోచినా అడుగులు వేయలేవా
నీటిలో దిక్కులు తోచకున్నా ఏ దిక్కున సాగి పోలేవా

ఇది జీవన ప్రయాణంతో సాగే జీవిత పోరాటం
ఇది మౌనంతో సాగే హృదయ వేదన సాగరం || ఓ బాటసారి .... ||

అలలతో సాగే నావ ఆగిపోతే అడుగులు వేసే రహదారి తీరం చేరుకోవా
కలలతో సాగే జీవితం కలతతో ఆగితే మరో కొత్త ప్రయాణం చేయలేవా

మారిపోయే కాలంతో మనిషే మారకపోతే ఏ జీవి నిన్ను మార్చునో
ప్రతి జీవిలో ఉన్న పరమార్థమే నీ మేధస్సుకు అనుభవమైనదేమో

సాగించే ప్రయాణం ఏదైనా ఓర్పుతో ధైర్యంగా సాగిపోవాలి
కాలంతో ప్రమాదం అనుకున్నా అజ్ఞానాన్ని వదులుకోవాలి || ఓ బాటసారి .... ||

మధురం మధురం విశ్వమే మధురం

మధురం మధురం విశ్వమే మధురం
మధురం మధురం జగతియే మధురం
మధురం మధురం అమ్మే మధురం
మధురం మధురం స్త్రీ యే మధురం
మధురం మధురం శ్రీ శ్రీ మధురం
మధురం మధురం శ్రీమతి మధురం || మధురం ||

హృదయమే మధురం మనస్సే మధురం
శ్వాసే మధురం ధ్యాసే మధురం
దేహమే మధురం ధ్యానమే మధురం
భావం మధురం బంధం మధురం
జీవం మధురం జీవితం మధురం

శయనం భువనం లలితం కమలం
ఉదయం నయనం శ్రావణం సంధ్యావనం

ప్రకృతి మధురం పుష్పం మధురం
అమృతం మధురం అభినయం మధురం
ఆహారం మధురం ఆరోగ్యం మధురం
సత్యం మధురం ధర్మం మధురం

తిలకం త్రిగుణం తరుణం తన్మయం
అధరం అమరం వందనం వసంతం
నాట్యం శిల్పం శృంగారం సుందరం
గళం గమనం వచనం వేదం వేదాంతం  || మధురం ||

ప్రతి జీవిలో జీవించే శ్వాసే మధురం
ప్రతి జీవిని ప్రేమించే మనిషే మధురం

ప్రతి జీవిలో కలిగే భావం మధురం
భావాన్ని తెలిపే మేధస్సే మధురం

సమయం నీతో నడిచే కాలం మధురం
సమయానికి తోడుగా వచ్చే క్షణమే మధురం

మనిషిని కలిపే కల్యాణం మధురం
కళ్యాణంతో సాగే నూతన జీవితం మధురం

భాషతో సాగే సంస్కృతి మధురం
విజ్ఞానముతో సాగే అద్భుత విజయం మధురం

సృష్టిలోని రూపాలే జగతికి మధురం
జగతిలో వెలిసిన శిఖరం పర్వతం మధురం   || మధురం ||

సరస్సు సముద్రం మధురం ద్వీపం ఖండం మధురం    
లోకం శాంతం మధురం అందం ఆనందం మధురం

వర్ణం రూపం ఆకారం సూర్య చంద్రుల ఆకాశ తేజం
మేఘం వర్షం ఋతు పవనాల ఉనికితో సాగే జీవనం

బంధం అనుబంధం సుఖం సంతోషం మధురం
జననం మరణం జీవుల దృశ్యం కావ్యం మధురం

పుష్పం పత్రం దీపం కర్పూరం
గంధం సుగంధం మందారం మకరందం తేనీయం
ఉదకం తీర్థం పాయసం పంచామృతం
శ్లోకం పద్యం చరణం స్మరణం జ్ఞాపకం
అలంకారం వైభోగం కళ్యాణం బ్రంహోత్సవం
మోక్షం మార్గం స్వర్గం వైకుంఠం ప్రయాణం

మధురం మధురం మాధుర్యం మధురం
మధురం మధురం మనోహరం మధురం

పఠనం జ్ఞానం ప్రతిభం విజ్ఞానం
విజయం జయం ఫలితం పతాకం
త్యాగం కరుణం గుణం విశేషణం
దీక్ష కృషి ఓర్పు సహనం సమయోచితం
గాత్రం తపనం భ్రమణం నిశబ్ధం
హితం స్నేహం పూజ్యం ఆరాధ్యం అనంతం  || మధురం ||

Monday, May 16, 2016

హృదయం ఎక్కడ నిలిచింది చూడూ

హృదయం ఎక్కడ నిలిచింది చూడూ
భావనగా ఆలోచన లేక మాటతో మౌనమాయనే ...
హృదయం ఎక్కడ ఆగింది చూడూ
అలజడి లేక అలవోకగా నిలిచిపోయేనే ...

మనస్సు లేని భావన ప్రేమ లేని వేదన ఆవేదన
హృదయం లేని వాదన జీవం లేని అనువాదన

మనిషిగా మరణమే తలచినా హృదయమే నిలిచిపోయేను
మనస్సుతో మౌనమే వహించినా నా ప్రాణమే ఆగిపోయేను

శ్వాసలో ధ్యాస కూడా గమనం లేక మేధస్సు మందగించిపోయేను  
ఊపిరితో ఉన్న జీవం ఊహకు అందని విధంగానే వెళ్ళిపోయేను  || హృదయం ||

హృదయమే జీవితం అనుకున్నా మనస్సు మేధస్సునే మోసగించేను
మనస్సే మధురం అనుకున్నా మోహం హృదయాన్ని మరచిపోయేను

కాలం ఎంత దూరం ఉన్నా మోసం వెంబడిస్తూ వెంటబడి పోయేను
మోసమే హృదయాన్ని వెంబడిస్తూ మరణ కాలాన్ని దగ్గరకు చేర్చేను

మనషికి ఎంత విజ్ఞానం ఉన్నా మనస్సుకు ఒదిగే భావన లేకపోయేను
మేధావిగా ఎంత అనుభవం ఉన్నా మోహానికి హృదయం ఆగలేకపోయేను  || హృదయం ||  

అరె ఏమైందీ ..... ఒక మనిషికి ఈనాడే జీవితం ముగిసిందీ

అరె ఏమైందీ ..... ఒక మనిషికి ఈనాడే జీవితం ముగిసిందీ
అరె ఏమైందీ ..... ఒక హృదయం నేడే భావనతో నిలిచిందీ

ఏనాడు ఏమౌతుందో ఏ క్షణం ఏమౌతుందో ఏ జీవికి తెలియదుగా
ఏ భావంతో ఏ జీవితం ఎప్పుడు ఆగి పోతుందో ఎవరికి తెలియదుగా

భావాలతో జీవిస్తున్నా మౌనంతో సాగే హృదయం ఆగిపోయేనుగా
బంధాలతో జీవితాలు అల్లుకున్నా ఒంటరిగానే వదిలి వెళ్ళేనుగా

శిఖరమై ఎదిగినా పర్వతమై నిలిచినా ఏనాటికైనా ఒంటరియేగా
వృక్షమై ఒదిగినా ఆకాశమై విస్తరించినా ఎప్పటికైనా ఒకరేగా       || అరె ఏమైందీ ..... ||

భావాలతో బంధాలు సాగుతున్నా జీవితాలు ఆగిపోయేనుగా
బంధాలతో జీవితాలు ఎదుగుతున్నా భావాలతో నిలిచేనుగా

జీవితాలు ఏవైనా అనుభవంతో సాగే భావాలే అనుబంధమయ్యేనుగా
అనురాగాల సంబంధాలే అనుబంధంతో జీవితాలు ఆకట్టుకొనెనుగా 

విశ్వమంతా ఎదిగినా జగమంతా నిలిచినా మరణం ఓనాడు సంభవించేనుగా
లోకమంతా ఉదయించినా ఆకాశంతో ప్రయాణించినా జీవం అస్తమించేనుగా || అరె ఏమైందీ ..... ||