Showing posts with label ఓ బాటసారి. Show all posts
Showing posts with label ఓ బాటసారి. Show all posts

Thursday, June 2, 2016

ఓ బాటసారి... నీవు నడిచే మార్గం నాదే నీవు తెలిపే రహదారి నాదే

ఓ బాటసారి...
నీవు నడిచే మార్గం నాదే
నీవు తెలిపే రహదారి నాదే
నీవు ఎక్కడ నిలిచినా ఏ గమ్యం చేరినా నా ప్రయాణం సాగిపోవునే  || ఓ బాటసారి... ||

విశ్వమంతా నా రహదారి మార్గమే కనిపిస్తున్నది
నీవు ఉన్న చోట నా స్థానమే నీకు సూచిస్తున్నది

ఏ దారి లేని చోట నీవు నడచినా అదే నా రహదారిగా మారేను
ఏ మార్గాన్ని నీవు విడచినా ఆ దారిలోనే నడిచే వారు ఎందరో

ఎడారిలో కనిపించదు నా దారి ఆకాశం చూపదు నా మార్గము
నీటిలో తోచదు నా మార్గం నీకు ఏ దిక్కున ఎలా వెళ్ళిపోవాలో  || ఓ బాటసారి... ||

విజ్ఞానంతో సాగిపోతే దిక్సూచిలా నా మార్గం నీకు తెలిసేను
అనుభవంతో సాగిపోతే మరో మార్గం నా రహదారిలో కలిసేను

జన్మించిన స్థానము నుండి మార్గాన్ని సాగించే మరణ గమ్యాన్ని చేరేవు
ఎందరో సాగించిన ఈ మార్గాలే సృష్టిలో రహదారులుగా సాగి పోయేను

తెలియని మార్గాన్ని అన్వేషిస్తే సూచనలెన్నో తెలిసేను
సూచనలతో మార్గాన్ని సాగిస్తే అనుభవమే నీకు కలిగేను

ఇదే నా ప్రయాణం ఇదే నా మార్గం ఇదే నా దారి రహదారి
ఇదే నా లోకం ఇదే నా రహస్యం ఇంతే నీ ప్రయాణ జీవితం  || ఓ బాటసారి... ||

Tuesday, May 31, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
ఇది నవ్వుతూ నడిచే రహదారి కాదయ్యా
ఇది అనుభవంతో నడక నేర్చే మహాదారయ్యా  || ఓ బాటసారి .....  ||

ఎందరో అడుగులు వేస్తూ ఉంటారు పడి పడి పోతూ లేస్తారు
ఎన్నో సార్లు పడి  పడి లేచినా సాగించే ప్రయాణమే ఈ దారి

జీవితమంతా ప్రయాణించినా అనుభవం చాలదయ్యా
జీవనమే మార్గమని తలచినా అడుగులు తప్పి పోవునయ్యా

ఏనాటికి తెలియని పరిమాణమే దారిలో తెలియని నవ సూత్రాలు
ఏనాటికి తెలియని పరిశోధనమే మార్గంలో తెలియని  విధానాలు   || ఓ బాటసారి .....  ||

భావంతో నడిచినా భాష్పంతో సాగించినా
జ్ఞానంతో నడిచినా విజ్ఞానంతో సాగించినా

మనిషికే తెలియని అన్వేషణ
మేధస్సుకే తెలియని ప్రతి ఘటన

ఏ సమయంలో నీవు మరణిస్తావో నీ గమ్యం ఎక్కడని తెలియదుగా
ఏ క్షణంలో నీవు జన్మించావో నీ స్థానమే ఏదని గమనించ లేదుగా   || ఓ బాటసారి .....  || 

Wednesday, May 25, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
నీటితో ప్రయాణమా నావతో చెలగాటమా
ఇది జీవిత పోరాటమా జీవన చదరంగమా || ఓ బాటసారి ..... ||

గాలి వానతో సుడిగుండమై ప్రయాణమే మారిపోయేను
ప్రయాణము సాగని నావ చిందర వందరమై పోయేను

మార్గం తెలియని నీటిలో నావ లేక మిగిలిపోయేవు
ఒడ్డుకు చేరుకోలేక నీటిలోనే మునిగి తేలి పోయేవు

ఏ దిక్కున ప్రయాణించాలో దిక్సూచి కూడా లేకపోయే
దిక్కులన్ని ఒకటై నీటి చుట్టూ తిరుగుతూ ఉండిపోయే || ఓ బాటసారి ..... ||

ఏ వైపు చూసిన ఒకటే దూరం ఎటూ వెళ్ళినా అన్ని వైపులా అంతంతే దూరం
ఏ వైపు వెళ్ళినా దూరం తగ్గని విధంగా దిక్కు తోచని దూరంతో దిక్కులదూరం

ఆగి పోవాలని లేదు ప్రయాణించాలని తెలియుట లేదు
ఆగినా ఉండలేను సాగినా ఎటు వెళ్ళాలో ఏదీ తోచట్లేదు

ఇది జీవన పోరాటమో జీవిత చదరంగమో తెలియని ప్రయాణం
ఏది తెలిసినా ఏది తెలియక పోయినా ప్రయాణంతో సాగి పోవాలి || ఓ బాటసారి ..... || 

Monday, May 23, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
చివరికి లెక్క తేల్చి వెళ్ళగలవా
లెక్క తేల్చకుండా వెళ్ళలేవా
ప్రతి ఒక్కరు లెక్క తేల్చి వెళ్ళాలనుకున్నా తేల్చకుండానే వెళ్ళిపోయారు || ఓ బాటసారి ..... ||

అసలు ఎంతో అప్పు ఎంతో
ఎవరు నీకు ఎంత అప్పో నీవు ఎవరికి ఎంత అసలో
ఎవరెవరు తిరిగి ఇస్తారో ఎవరెవరికి నీవు ఇచ్చావో

కాలంతో సాగే ధన జీవనం సమయానికి తేలని జీవిత మూలం
సమయంతో సాగే లెక్కింపులో చిక్కులు ఎన్నో తేలని రోజులే  || ఓ బాటసారి ..... ||

లెక్కలు వేసే ప్రతి లెక్కకు ఏవో చిక్కులు ఉంటాయి
లెక్కలు తేలని ప్రతి లెక్కకు సమస్యలే వస్తుంటాయి

లెక్క ఎంత చక్కగా వేసినా తీరని లెక్కలు ఎన్నో ఉంటాయి
లెక్కలు తేలినా అవి తీర్చని లెక్కలుగానే మిగిలి పోతాయి

ఉన్నవారు కూడా లేనివారిగా మాటలు చెప్పుతూ తప్పుకుంటారు
లేనివారు ఎంతో శ్రమించి అప్పుడప్పుడు కాస్త తీరుస్తూ ఉంటారు || ఓ బాటసారి ..... ||

ఓ బాటసారి ....

ఓ బాటసారి ....
నీటిలో ప్రయాణమా రహదారిలో ప్రమాదమా
రహదారిలో అడుగు వేస్తే నడవడి మారిపోవునా
నీటిలో అలలు వస్తే నావ తిరగబడి పోవునా  || ఓ బాటసారి .... ||

వర్షం వస్తే రహదారి చిందర వందర అగునా
నదిలో నావ చీటికిమాటికి అటుఇటు తిరుగునా

రహదారిలో దిక్కులు తోచినా అడుగులు వేయలేవా
నీటిలో దిక్కులు తోచకున్నా ఏ దిక్కున సాగి పోలేవా

ఇది జీవన ప్రయాణంతో సాగే జీవిత పోరాటం
ఇది మౌనంతో సాగే హృదయ వేదన సాగరం || ఓ బాటసారి .... ||

అలలతో సాగే నావ ఆగిపోతే అడుగులు వేసే రహదారి తీరం చేరుకోవా
కలలతో సాగే జీవితం కలతతో ఆగితే మరో కొత్త ప్రయాణం చేయలేవా

మారిపోయే కాలంతో మనిషే మారకపోతే ఏ జీవి నిన్ను మార్చునో
ప్రతి జీవిలో ఉన్న పరమార్థమే నీ మేధస్సుకు అనుభవమైనదేమో

సాగించే ప్రయాణం ఏదైనా ఓర్పుతో ధైర్యంగా సాగిపోవాలి
కాలంతో ప్రమాదం అనుకున్నా అజ్ఞానాన్ని వదులుకోవాలి || ఓ బాటసారి .... ||