Friday, December 27, 2019

విశ్వమే నా శ్వాసలో జీవమై జీవించునా

విశ్వమే నా శ్వాసలో జీవమై జీవించునా
జగమే నా ధ్యాసలో స్వరమై గమనించునా

వేదమే నా భాషలో జ్ఞానమై స్మరించునా
నాదమే నా వ్యాసలో గ్రంధమై పఠించునా

భావమే నా మేధస్సులో లీనమై ఆలోచించునా
తత్వమే నా దేహస్సులో లయమై అధిరోహించునా

సూర్యోదయమే నా శ్వాసను సజీవంతో విశ్వమంతా సాగిస్తున్నది
మహోదయమే నా ధ్యాసను సుజీవంతో జగమంతా సాగిస్తున్నది  || విశ్వమే ||

విశ్వమునే నా శ్వాసగా ధ్యానిస్తూ జీవిస్తున్నానుగా
జగమునే నా ధ్యాసగా స్మరిస్తూ గమనిస్తున్నానుగా

వేదమే నా భాషగా స్మరిస్తూ జ్ఞానిస్తున్నానుగా
నాదమే నా వ్యాసగా స్వరిస్తూ పఠిస్తున్నానుగా

భావమే నా ఆలోచనగా అర్థిస్తూ సంభాషిస్తున్నానుగా
తత్వమే నా యోచనగా అర్పిస్తూ సంబోధిస్తున్నానుగా  || విశ్వమే ||

విశ్వమే నాలో శ్వాసగా ప్రకృతితో ఉచ్చ్వాసించునుగా 
జగమే నాలో ధ్యాసగా ఆకృతితో ప్రశాంతించునుగా

వేదమే నాలో భాషగా జ్ఞానిస్తూ సంబోధించునుగా
నాదమే నాలో వ్యాసగా పఠిస్తూ పరిశోధించునుగా

భావమే నాలో వీక్షిస్తూ సంపూర్ణంగా సుఖించునుగా
తత్వమే నాలో దీక్షిస్తూ పరిపూర్ణంగా విశ్వాసించునుగా  || విశ్వమే ||  

No comments:

Post a Comment