Monday, October 24, 2011

ఎక్కడ నీ రూపం జీవిస్తుందో

ఎక్కడ నీ రూపం జీవిస్తుందో ఎచట నీ స్థానం ఉంటుందో
నీవే నిర్ణయించుకున్నావా లేదా కాలమే నిర్ణయించునా
నీ రూప స్థానం నీకు సరికాకపోతే నీ పొరపాటేనని అనుకున్నావా లేదా కాలాన్నే అనుమానిస్తున్నావా

నీవు ఎదిగే విధానమే నీలో ఉన్న విజ్ఞానం
నీవు తీసుకునే నిర్ణయమే నీ కార్య మార్గం
ప్రతి కార్యం అనుభవంగా సాగే కాలమే నీ జీవితం
ఏ కార్యానికి ఎంత ఫలితమో నిన్ను నిలిపే స్థానం
జీవితంలో ఏదైనా స్థాన భ్రంశమే భవిష్య కాల నిర్ణయం
జీవించుటలో ఏదైనా కార్యంతో సాగే విధి తత్వ జీవితం
ఎదగాలని ఎంత ఉన్నా కాలంతో సాగే సాధన మహా కష్టం
ఎదుగుతూనే పడిపోతున్నా కాల ప్రభావాల మహా భ్రంశం

ఎక్కడ నీ రూపం జీవిస్తుందో ఎచట నీ స్థానం ఉంటుందో
నీవే నిర్ణయించుకున్నావా లేదా కాలమే నిర్ణయించునా
నీ రూప స్థానం నీకు సరికాకపోతే నీ పొరపాటేనని అనుకున్నావా లేదా కాలాన్నే అనుమానిస్తున్నావా

అవకాశాన్ని నీవే నిర్ణయించుకో కార్యాన్ని కష్టమైనా సాధనతో సాగించుకో
కాల ప్రభావాలకు భయపడిపోతే ఎంతటి కార్యాలైనా చివరికి అపజయమే
అనుభవంతో మేధస్సును గాలించు అవకాశంతో విజ్ఞానాన్ని ప్రయోగించు
విధి ప్రభావాలు ఏవైనా ఎన్నైనా కాలంతో వీరుడిగా నీకు నీవే జయించు
విశ్వ కర్త ఎవరో విశ్వ బ్రంహా ఎవరో మన కార్యానికి కార్య కర్త మనమే
మన ఆలోచనే కర్త మన కార్యమే క్రియ మన మేధస్సే కాల కర్మణ
మన జీవిత లక్ష్యం కోసం మన తపన మన సాధన మహా ఆయుధం
మన సంకల్పం వీరుని లక్ష్యం మన కార్యం మహా సామ్రాజ్య సంకీర్తనం

ఎక్కడ నీ రూపం జీవిస్తుందో ఎచట నీ స్థానం ఉంటుందో
నీవే నిర్ణయించుకున్నావా లేదా కాలమే నిర్ణయించునా
నీ రూప స్థానం నీకు సరికాకపోతే నీ పొరపాటేనని అనుకున్నావా లేదా కాలాన్నే అనుమానిస్తున్నావా

ఏ దేహమైనా ఏ రూపమైనా

ఏ దేహమైనా ఏ రూపమైనా నీ మనస్సును ఓదార్చు
ఏ బంధమైనా ఏ బంధువైనా నీ మేధస్సునే ఓదార్చు
ఏ స్థానమైనా ఏ ప్రాంతమైనా నీకు నీవే ఓదార్చుకో

స్నేహితునితో జీవితాన్ని ఆరంభించు స్నేహితులతో లోకాన్ని ఓదార్చు
పరిచయమే స్నేహం ప్రతి ఒక్కరు జీవం నీలాగే వారి జీవితం
జీవనమే దారిగా నీ మార్గమే ఆశగా నీకు నీవై శ్రమతో జీవించు
నీతోనే ఎందరు నీలాగే ఎందరో నీకై ఎందరున్నా నీవే ఎందరికో
కాలమే విధిగా ఏనాటికైనా ఎవరైనా నిన్ను విడిచి పోయేవారే
బంధమైనా బంధువైనా ఆఖరికి స్నేహితుడైనా నిన్ను విడిచేవాడే
మరణంతో జీవితమే మాయం కొత్తగా కనిపించేదే సరికొత్త జీవనం
ఆరోగ్యమే ఆధారం అను క్షణం సహనమే ఊరటనిచ్చే ఆశయ భావం

ఏ దేహమైనా ఏ రూపమైనా నీ మనస్సును ఓదార్చు
ఏ బంధమైనా ఏ బంధువైనా నీ మేధస్సునే ఓదార్చు
ఏ స్థానమైనా ఏ ప్రాంతమైనా నీకు నీవే ఓదార్చుకో

ఉచ్చ్వాసలో నీవే నిచ్చ్వాసలో నీవే జీవిస్తూ ఉన్నావు
ఉచ్చ్వాస ఆగినా నిచ్చ్వాస ఆగినా నీవు ఆగిపోవడమే
కాలమే తెలుపుతున్నది జీవితం అనుభవమేనని ప్రతి జీవికి
ఎవరికి ఎవరు ఎలా ఎప్పుడు ఎందుకు జీవిస్తారో తెలియదే
నీతో ఉన్నప్పుడు నీవే సమ భావమై అందరిని ఓదార్చు
ఎవరికి ఏది ఉన్నా లేకున్నా అందరికి కావాలి ఓదార్పు
జీవించడం భారమైతే మనస్సు నిలిచే క్షణం ఓదార్పు లేని మరణమే
జీవితమే భారమైతే మేధస్సు సాగే కాలం ఓదార్పు లేని అసమానం

ఏ దేహమైనా ఏ రూపమైనా నీ మనస్సును ఓదార్చు
ఏ బంధమైనా ఏ బంధువైనా నీ మేధస్సునే ఓదార్చు
ఏ స్థానమైనా ఏ ప్రాంతమైనా నీకు నీవే ఓదార్చుకో

Monday, October 17, 2011

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా
ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆశిస్తున్నావా
ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

జీవితం అనుభవ విజ్ఞానమైనా విశ్వ విజ్ఞానం మహా అధ్యాయమే
అనుభవం ఎంతైనా జీవితంలో తెసిసే విజ్ఞానం ఒక అణువంతయే
నీలో నీవు మేధస్సులో మహా భావమై జీవించు విశ్వ విజ్ఞానిగా
నీకై నీవు విశ్వంలో మహా రూపమై సత్యాన్ని సాగించు మహాత్మగా
మరల రాని సమయ భావమే అవకాశమై నిన్ను చేరుతున్నది
మరల కలిగే భావంతోనే విజ్ఞానిగా నీతో కాలం తెలుపుతున్నది

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా
ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆశిస్తున్నావా
ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

ఎవరి కోసమో కాలం సాగిపోతున్నా విజ్ఞాన అన్వేషణ మన కోసమే
ఎవరి జీవితం ఎలా గడిచిపోతున్నా మన జీవనమే మహా విజ్ఞానమై
మేధస్సులో మన సంకల్పమే విశ్వ వేద భావమై సాగిపోవాలని
విశ్వంలో మన కార్యమే విశ్వ విజ్ఞాన బంధాలతో సాగిపోవాలని
క్షణమైనా నీకు తెలియాలి విశ్వ విజ్ఞాన అనుభవ వేదాంతము
మరణమైనా నీవు నేర్చుకోవాలి మహా విజ్ఞానుల జీవిత సారాంశము

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా
ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆశిస్తున్నావా
ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

Friday, October 14, 2011

కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు

కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు మారిపోవద్దనే తెలపాలి
విజ్ఞానమే నీలో ఉన్నా అజ్ఞానం నీ వెంట ప్రయాణించరాదు ||

నీవే ఒక మహాత్మవై విశ్వ జగతికి వెలుగును అందించాలి
నీవు చూసే దిక్కులోనే ప్రతి జీవి జీవితాన్ని సాగించాలి
విశ్వానికే మహా భావమై నిలిచే నీ రూపానికే సూర్యోదయం
దైవానికే మహా రూపమై నిలిచిన నీ భావానికే మహోదయం
నీలోనే విశ్వ ఖ్యాతి నీలోనే విశ్వ శక్తి నీలోనే దివ్య స్పూర్తి
నీవే మహా విజ్ఞాన జీవిగా విశ్వానికి విధాతగా జీవిస్తావు

కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు మారిపోవద్దనే తెలపాలి
విజ్ఞానమే నీలో ఉన్నా అజ్ఞానం నీ వెంట ప్రయాణించరాదు ||

ఏనాటిదో నీ విజ్ఞాన జీవితం జగతికే మహా రూప దర్శనం
ఎందరో జీవిస్తున్నా ఏ విజ్ఞానికి లేదే నీ విశ్వ విచక్షనత్వం
ఏ కారణంచే జన్మించావో విశ్వ కర్మకే తెలియని బంధం
ఏ ఆధారంతో వచ్చావో దైవానికే తెలియని మహా మర్మం
నీలోనే ఓ వేదం నీలోనే ఓ విశ్వం నీలోనే ఓ భాష్పం
నీకై ఎవరు ఉన్నా నీవు జీవించే విధానమే విజ్ఞాన సాఫల్యం

కాలమే నిన్ను మారుస్తున్నా మేధస్సు మారిపోవద్దనే తెలపాలి
విజ్ఞానమే నీలో ఉన్నా అజ్ఞానం నీ వెంట ప్రయాణించరాదు ||

కాలమే నిన్ను మార్చగలదు

కాలమే నిన్ను మార్చగలదు
భావమే నిన్ను మార్చగలదు
కాల భావమే నిన్ను మార్చగలదు ||

కాలానికి నీవెవరో తెలియకున్నా బంధాలు మారిపోతాయి
కాలానికి నీ రూపం తెలియకున్నా భావాలు మారిపోతాయి
ప్రయాణించే మార్గంలోనే మార్పులెన్నో సంభవిస్తాయి
ప్రయాణించే మార్గాలే ఎన్నో మార్పులతో మారిపోతాయి
జన్మించిన కాలమే మరణించే కాలానికి మారిపోతున్నది
మరణంతో మరో జన్మకై కాలమే మరో భావంతో మారుతున్నది

కాలమే నిన్ను మార్చగలదు
భావమే నిన్ను మార్చగలదు
కాల భావమే నిన్ను మార్చగలదు ||

ఎన్నో కార్యాలతో భావాలు మారిపోతూనే ఉన్నాయి
ఎన్నో కార్యాలతో ఎందరో మారిపోతున్నారు
వారికే తెలియని భావాలు వారినే మార్చుతున్నాయి
వారికే తెలియని కార్యాలు వారికై కలుగుతున్నాయి
విజ్ఞానంతో మారిపోతున్నా కాలం తానుగా మారిపోతుంది
అజ్ఞానంతో మారిపోతున్నా భావం తానుగా మారిపోతున్నది

కాలమే నిన్ను మార్చగలదు
భావమే నిన్ను మార్చగలదు
కాల భావమే నిన్ను మార్చగలదు ||

Thursday, October 13, 2011

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది
జీవమే విశ్వమై వేదంలా సాగుతున్నది
జీవించేలా వేదమే జీవితాన్ని సాగిస్తున్నది

ఒక జీవం విశ్వానికే తెలుపుతున్నది - భావనగా జీవం వేద సాగరాన్ని చేరుతున్నది
జీవితం ఏమౌతుందో కాలానికే తెలియని వేదంలా కఠిన భావాలతో సాగిపోతున్నది
ఒక భావన హృదయాన్ని పలికిస్తున్నది - ఆకలికి అమృత భావన ఆవేదనగా మారుతున్నది
జీవించుటలో ఎన్ని నేర్చినా పలికించే హృదయానికే గాయమైతే మనస్సైనా పగిలిపోతుంది
ఒక వేదన నాకై వినిపిస్తున్నది - భవిష్య వాణిగా తెలిసే కాల జ్ఞానమే అనుభవం అన్నది
ఏది తెలిసినా వినిపించే వేదానికి భయం కలిగితే అనుభవం ఉన్నా అనుమానస్పదమే

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది
జీవమే విశ్వమై వేదంలా సాగుతున్నది
జీవించేలా వేదమే జీవితాన్ని సాగిస్తున్నది

ఒక విజ్ఞాన భావన అంటున్నది - విశ్వ వేదాన్ని తెలిపేందుకు మహాత్ములు లేరు
కాల మార్పులకు సమాధానాలు తెలిసినా అభివృద్ధి సమాజానికి ఉపయోగం లేదే
ఎవరికి వారు ఆర్థికంగా ఎదుగుతున్నారే గాని మహా విశ్వ నిర్మాణం ఎక్కడ లేదే
శాస్త్రవేత్తలున్నా ఆర్థికంగా పనిచేసేవారే గాని సమాజానికి సేవా భావం లేనే లేదు
విశ్వ ప్రణాళికలు మేధస్సులోనే మరణంతో క్షీణించి గాలిలా అంతరించి పోతున్నాయి
మరో గాలి వీచినా విశ్వ నిర్మాణం సాగని ఊహా భావపు విజ్ఞానుల జీవితాలు ఎన్నో

ఎక్కడో విశ్వం వేదమై జీవిస్తున్నది
జీవమే విశ్వమై వేదంలా సాగుతున్నది
జీవించేలా వేదమే జీవితాన్ని సాగిస్తున్నది

Tuesday, October 11, 2011

సంగీతమే సాగరం - సంగీతమే భావం

సంగీతమే సాగరం - సంగీతమే భావం
సంగీతమే లోకం - సంగీతమే ధ్యానం
సరిగమలు పలికే సాగర తీరమున అలల భావమే ఆనందం
సరిగమలు లోలికే లయ గానమున అల్ప పీడనములే నృత్యం ||

సత్యం సంతోషం స్వర భావాల సంగీతం
నిత్యం సందేశం సర్వ బంధాల సంగీతం
మేధస్సులోనే సంగీత భావాల స్వర వీణ గానం
మనస్సులోనే సంగీత స్వరాల లయ వేద గాత్రం
సంగీతమే జీవతమైతే సరిగమలే జీవమై సాగేను
సంతోషమే సంగీతమైతే స్వరాలే భావాలై సాగేను
వేదాలే మహా లోకాలుగా పదనిసలు పలికేను
పదాలే మహా రాగాలుగా చరణమై పల్లవించేను

సంగీతమే సాగరం - సంగీతమే భావం
సంగీతమే లోకం - సంగీతమే ధ్యానం
సరిగమలు పలికే సాగర తీరమున అలల భావమే ఆనందం
సరిగమలు లోలికే లయ గానమున అల్ప పీడనములే నృత్యం ||

Wednesday, October 5, 2011

ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

శివానంద యోగ శివ కైలాసవాస
విశ్వానంద యోగ విశ్వ వేదవ్యాస
భావా చరణ బహురూప విశ్వ విధాత
భవ్యా కరణ స్వరూప బ్రంహానంద ధాత
మేధస్సులో ఇంద్రధనస్సునే ధరించినా సూర్య తేజస్సువు నీవే
శిరస్సుపై గంగా ధరిణినే ధరించినా జటానంద భూపతివి నీవే
పంచ భూతాల విశ్వ స్థితిలో ధ్యానించే జగాధిపతివి నీవే
విశ్వ భూతాల ఆత్మ స్థితిలో జీవించే హరి చంద్రుడు నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

దయానంద యోగ దివ్య దైవేశ్వరా
కరుణానంద యోగ కార్య కరుణేశ్వరా
అనంత ముఖ వర్ణాయ అవతార మూర్తి శివాయ
ప్రత్యక్ష రూప తేజాయ ప్రమోదూత హరి ద్వారాయ
జగతినే త్రినేత్రంతో దర్శించే అభ్యుదయ రూప కారుడవు నీవే
విశ్వ కార్యాలనే కర్త కర్మ క్రియలుగా నడిపించే కాల రుద్రుడు నీవే
యుగాలనే ప్రళయాలుగా సృష్టించే అరవీర భయంకరుడు నీవే
లోకాలనే దిక్కులుగా మార్చే ద్వీపాలకు కాల యుక్తివి నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ