Showing posts with label ఇంకా. Show all posts
Showing posts with label ఇంకా. Show all posts

Monday, October 17, 2011

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా
ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆశిస్తున్నావా
ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

జీవితం అనుభవ విజ్ఞానమైనా విశ్వ విజ్ఞానం మహా అధ్యాయమే
అనుభవం ఎంతైనా జీవితంలో తెసిసే విజ్ఞానం ఒక అణువంతయే
నీలో నీవు మేధస్సులో మహా భావమై జీవించు విశ్వ విజ్ఞానిగా
నీకై నీవు విశ్వంలో మహా రూపమై సత్యాన్ని సాగించు మహాత్మగా
మరల రాని సమయ భావమే అవకాశమై నిన్ను చేరుతున్నది
మరల కలిగే భావంతోనే విజ్ఞానిగా నీతో కాలం తెలుపుతున్నది

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా
ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆశిస్తున్నావా
ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది

ఎవరి కోసమో కాలం సాగిపోతున్నా విజ్ఞాన అన్వేషణ మన కోసమే
ఎవరి జీవితం ఎలా గడిచిపోతున్నా మన జీవనమే మహా విజ్ఞానమై
మేధస్సులో మన సంకల్పమే విశ్వ వేద భావమై సాగిపోవాలని
విశ్వంలో మన కార్యమే విశ్వ విజ్ఞాన బంధాలతో సాగిపోవాలని
క్షణమైనా నీకు తెలియాలి విశ్వ విజ్ఞాన అనుభవ వేదాంతము
మరణమైనా నీవు నేర్చుకోవాలి మహా విజ్ఞానుల జీవిత సారాంశము

ఇంకా ఏదో తెలుసుకోవాలనే జీవిస్తున్నావా
ఇంకా ఏదో నేర్చుకోవాలనే ఆశిస్తున్నావా
ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది