Wednesday, October 7, 2015

చుక్కల్లో చుక్కనై ఎక్కడ ఉన్నానో చుక్కలకే తెలియదులే

చుక్కల్లో చుక్కనై ఎక్కడ ఉన్నానో చుక్కలకే తెలియదులే
ఏ చుక్కైనా నాలాగే మెరిసి పోతున్నది అన్ని చుక్కల్లలో

చుక్కల్లో చంద్రుడైనా నా చుక్కను మరిచేనుగా
చూసినా అన్ని చుక్కల్లో నేను చుక్కగానే తోచానుగా ॥

తారనై తపించే నాభావం ఏ చుక్కకు అర్థమయ్యేనో
తారగా విహరించే నా ప్రయాణం ఆకాశానికే తెలియునులే

తారలలో సితారనై ఎప్పుడు సింధూరాన్ని ధరిస్తానో
సింధూరాన్ని ధరించినా నా రూపం సింధూరమేగా

సింధూర సితారనై సిరి వెన్నెల తారలలో స్వాతి ముత్యమౌనా
సిరి కాంతుల తారలలో సింధూరమై నేలపై రాలిపోవునా  ॥

తారల తోరణాలలో బంధించే నా జీవితం తప్పిపోదులే
మేఘాలలో దాగి ఉన్నా తోరణంలో నిలిచే ఉంటానులే

చీకటిలో మెరిసే నా జీవితం పగటి వెలుగులో కానరాదులే
చీకటిలో దాగే నా స్థానం కాంతి భావానికే తెలియునులే

తారగా జీవిస్తున్నా సింధూర తిలకమై ప్రకాశిస్తానులే
ప్రకాశించే తారలలో సింధూర తోరణ చుక్కను నేనేలే ॥  

Monday, October 5, 2015

రణ రంగం సిద్ధం జయ భేరి మృదంగం

రణ రంగం సిద్ధం జయ భేరి మృదంగం
రాజ్యాల పోరాటంలో ఎవరైనా సమరం 
బంధాలను పెన వేసుకున్నా పోరాటం అవశ్యం
శతృత్వం లేకున్నా పోరాటంలో బంధాలు శూన్యం
బహు బలగాలు ఉన్నా లేకున్నా సమరానికి సై  ॥

వీరుల లక్ష్యమే ఆయుధం ధీరుల అడుగే ధ్యైర్యం
భయంకర పోరాటంలో గాయాల మరణాల శౌర్యం 
విధ్వంస్వం సృష్టించే యుద్ధం మహా ఘోర భయంకర ప్రళయం 
మనిషైనా మృగమైనా స్త్రీ పురుషులైనా యుద్ధంలో పోరాటమే
విజయమైనా అపజయమైనా సమరంలో సహాసమే లక్షణ లక్ష్యం
ప్రకృతిని ఆవహించే పోరాటం గుండెలను దద్దరిల్లించే సమర సింహం  ॥

రాజ్యాలను ఆక్రమిస్తే వీరత్వమే విజయం
రాజ్యాలే కూలిపోతే అపజయమే మరణం   
యుద్ధాలే లేకుంటే స్నేహ భావాలే శాంతికి చిహ్నం
గర్వం లేదంటే స్నేహ బంధాలే ప్రగతికి మార్గ దర్శకం 
ధృడమైన స్నేహ బంధాలే విదేశాలకు స్ఫూర్తి దాయకం
దేశ ధృడత్వం సరిహద్దుల సాహాస వీరుల చైతన్య శిఖరం ॥

Wednesday, September 2, 2015

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....!

దైవ దర్శనం నిత్య పూజితం
లోక భాస్వరం విశ్వ మంగళం
సత్య సాగరం శాంతి సంభావనం
పుష్ప అలంకారం పత్ర సోపానం  
భావ స్వభావం తత్వ తాపత్రయం

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....!

శ్వాస సాత్వికం ఆత్మ అద్వైత్వం
ధ్యాస ఆధ్యాత్మకం పరమార్థ సార్థకం
సుగుణ పవిత్రం శుద్ధ పరిపూర్ణం
దేహ కారణం జనన చరణం
బుద్ధి లక్షణం మరణ కర్మణం

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....!
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప.....! 

Monday, August 31, 2015

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!
ప్రతి రోజు ఉదయిస్తూ ప్రతి జీవికి మెలకువ కలిగిస్తూ
విశ్వానికే తేజమై మేధస్సులకే ఉత్తేజమై సాయంత్రపు సంధ్య వేళ అస్తమించేను ఓ... మేఘమా! ॥

జగతికే ఆది కేంద్రంలా ఉదయిస్తూ మేధస్సులకే ఆలోచన భావనను కలిగించేను
సూర్య కిరణాలతో వెలుగును ప్రసారిస్తూ మేధస్సులకే విజ్ఞానాన్ని అందించేను
తన వెలుగులోనే ప్రతి జీవి చలనం సాగిస్తూ జీవనాన్ని కార్యాలతో సాగించేను
చీకటి అయ్యేలోగా ఇంటిని చేరుతూ విశ్రాంతితో సేద తీరి జీవులు నిద్రించేను ఓ... మేఘమా! ॥

సూర్య దేశం ఓ విజ్ఞాన క్షేత్రమై ప్రతి జీవి సూర్య తేజస్సుతో విజ్ఞానంగా ఎదుగుతుంది
సూర్యుని కిరణాల తేజస్సు మేధస్సులో కలిగే ఉత్తేజమైన ఆలోచనలకు స్పూర్తినిస్తుంది
సూర్యుని శక్తితోనే మన సామర్థ్యం పట్టుదల ధృడమై వివిధ కార్యాలకు చేయూతనిస్తుంది
సూర్య ప్రపంచం ఓ విజ్ఞాన స్థావరమై విశ్వానికి పరిపూర్ణమైన సంపూర్ణ భావాన్ని కలిగిస్తుంది ఓ... మేఘమా! ॥ 

Tuesday, August 25, 2015

ఓ వర్ణ మోహపు సుందరీ..

ఓ వర్ణ మోహపు సుందరీ.. నీవు సువర్ణ దేశపు యువరాణివే   
విశ్వ దేశాల సుందరీ..  నీవు అఖండ జగతికే నవనీత తరంగిణివి ||

సువర్ణాలతో పొదిగిన నీ దేహం సుగంధ పరిమళాల సౌందర్యం
నవ వర్ణాలతో ఒదిగిన నీ రూపం సూర్యోదయ కాంతికే సుందరం  ||

నీ ఆకార రూపం మనస్సులో మంత్రమై ధ్యాసలో తంత్రమయ్యేను
నీ నాట్య కళా భావం మేధస్సులో మర్మమై శ్వాసలో స్థిరమయ్యేను  ||

నక్షత్రాల వెలుగులో నడిచి వెళ్ళే ఆకాశ దేశపు మేఘ మాలిని నీవే 
గంధర్వ లోకాన జల సుగంధాల పల్లకిలో ఊరేగే సుధారాణి నీవే    ||

ఊహా చిత్రాలలో ఒదిగిన అనంత దేశాల దివ్యమైన విశ్వ సుందరి నీవేలే
అజంతా ఎల్లోరా శిల్పాలలో అలరించినా అందాల ఆణి ముత్యానివి నీవేలే  ||

జగమున జత కలిసే జాబిలి రాత్రి జగన్మోహన సుందిరి నీవేలే
జగతిలో జలదరించే జన జీవన జాడలో జగదేక సుందరి నీవేలే   ||

నక్షత్రాల దీవిలో నవ మోహన వర్ణ ఛాయలో నిలచిన తారవు నీవేలే
విశ్వపు దీవుల వీధిలో వయ్యారి హంసల అతిలోక సుందరి నీవేలే   ||

అమృత తేనీయపు సెలయేరులో జలకాలాడే జలధారపు నెరజాణవు నీవేలే
శికరపు అంచుల సరస్సులలో సరసాలాడే సరోవర సంయుక్తవు నీవేలే    ||

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా
నా స్వర గాన సంగీతాన్ని వినిపించరా
నాలోని వేద గీతాన్ని నీవే ఆలకించరా
నీకై నా శ్వాస భావాన్ని అర్పించెదనురా ॥

నీ ధ్యాన శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసనై శృతిని కలిపెదనురా
నీ విశ్వ భావాలలో నవ నాడుల జీవ తత్వాలను గమనించెదనురా
నీ దేహ ఆకారాలలో విభూదినై మహా రూపాన్ని అవతరించెదనురా
నీ యోగ ధ్యాసలో విశ్వ భావాన్నై స్వప్త స్వరాలతో శృతించెదనురా

శంకరా శంఖంతో శంకించకురా నాపై కక్ష ఉన్నను నీ కక్ష్యలోనే జీవించెదనురా
విష నాగులతో భయ పెట్టినను నీ డమరుకాన్ని ఏనాటికి నేను విడవలేనురా
త్రిలోకాలలో త్రినేత్రుడవై త్రినేత్రంతో నన్ను భస్మం చేసినను నీ త్రిశూలాన్ని వదలనురా
ఎన్ని ప్రళయాలు సంభవించినను నీకై యుగాలుగా జీవిస్తూ గంగా జలమై నివసించెదనురా ॥

శంకరా నీకై శృతి మించెదనురా నటరాజ కళా నాట్యంతో నిన్నే మెప్పించెదనురా
విశ్వమంతా నీ నామ శృతినే వివిధ స్వర భావ జీవ తత్వాలతో స్మరించెదనురా
నీకై పుష్పమైనను పత్రమైనను జలమైనను సమర్పిస్తూ పాద సేవ చేసెదనురా
నీ మెడలో రుద్రాక్షమై కర్త కర్మ క్రియల బంధాన్ని నేనుగా అనుభవించెదనురా

విశ్వమందు నిన్ను ఎక్కడ వెతికినను అక్కడే నా శ్వాసలో నీవే జీవించెదవురా
జగతిలో నీవు ఎక్కడ ఉన్నను ప్రతి జీవి శ్వాసలో నీవే జీవమైనావని తెలిసెనురా
సృష్టిలో ఏ స్వరమైనను నీ ఓంకార శృతియే ఆది రాగమై విశ్వ భాషగా పలికెదమురా
భువిలో నీ విశిష్టత విశ్వాంతరమై కాలమంతా వ్యాపిస్తూ నలు దిక్కులు దాగెనురా ॥ 

Tuesday, August 4, 2015

విశ్వ సుందరి నీవు విశ్వమున ఎక్కడ ఉన్నావో

విశ్వ సుందరి నీవు విశ్వమున ఎక్కడ ఉన్నావో
విశ్వపు అంచులలలో నీవు ఎక్కడ దాగి ఉన్నావో

విశ్వ భావాలు నీకు తెలుసా విశ్వ లోకాలు నీకు తెలియునా ॥

విశ్వమందు నీవు ఎక్కడ ఉన్నా అచటనే నే ఉండగలను
విశ్వమందు నీవు ఎలా ఉన్నా అలాగే నే చూడగలను

విశ్వమంటే నీకు నేస్తమా విశ్వమంటే నీకు ప్రాణమా
విశ్వమంటే నాకు వేదమే విశ్వమంటే నాకు జీవమే

విశ్వ ధ్యాసలో నీవు ఉన్నా విశ్వ భాషలో నే దాగి ఉన్నా
విశ్వ శ్వాసతో నీవు ఉన్నా విశ్వ నాభిలో నేనై ఉన్నా

విశ్వ ధ్యానమే చేసినా విశ్వ యోగమే సాగునా
విశ్వ రూపమే చూసినా విశ్వ సుందరియే దర్శించునా  ॥

విశ్వమే నా నేత్రమై విశ్వ తేజమే నీ రూపమగునులే
విశ్వమే నా దైవమై విశ్వ లోకమే నీ స్థానమగునులే

విశ్వమందు నీవు లేకపోతే నాలో అఖండ అన్వేషణయే
విశ్వమందు నీవు శూన్యమైతే నాలో విశ్వం అంతరించునే

విశ్వమందు నీవు లేని సౌందర్యం పుస్పమే లేని ప్రకృతియే
విశ్వమందు నీవు లేని జీవితం నిధి లేని జీవన సన్నిదియే  

విశ్వమంతా నా జగతియే విశ్వమంతా నా తత్వమే
విశ్వమంతా నా అణువులే విశ్వమంతా నా జీవ భావాలే ॥

Monday, June 8, 2015

ఒకటే మాట ఒకటే భావం ఒకటే పదం

ఒకటే మాట ఒకటే భావం ఒకటే పదం పలికినదే స్నేహం
ఒకటే శ్వాస ఒకటే ధ్యాస ఒకటే మనస్సు తెలిపెను జీవం
మనలో మనమై మనస్సుతో జీవిస్తే మాటలో మధురమే
మనలో మనమై విజ్ఞానంతో ఎదిగితే మనస్సులో మౌనమే ॥ ఒకటే మాట ॥

మనిషిగా జీవిస్తూనే మనలోని శ్రమ నశించి పోతున్నది
వెల లేని జీవన విధానం విలువలేని శ్రమ వృధా ఐనది 
ప్రాణాలు రోగాలుగా మారి రాగాలు అరిగి తరిగి పోతున్నాయి
శ్వాస నిలువలేక పోతున్నా జీవాత్మ స్నేహమై నిలుపుతున్నది 
ఎప్పటిదాక ప్రయాణమో శక్తి లేని జీవం ఆరాట పడుతున్నది
గమ్యం లేని రహదారిలో గమనం లేక గానం ఘాటవుతున్నది 
మరణమే ధ్యాసగా రోగమే గమ్యమై శ్వాసే చిన్నదవుతున్నది
మనస్సే యాసగా రూపమే వికారిగా శరీరమే కూలిపోతున్నది   ॥ ఒకటే మాట ॥

ఆదుకునే భావం లేదు స్నేహమనే అర్థం అసలే లేదు మనలో
ఆశించకున్నా అసమర్థంగా చూసే భావన ఎందుకు మనలో
మనలో మనమే స్వార్థపరులైతే మనిషిగా మనిషికి మనుగడ ఎందుకో
మనిషే మనిషికి సహాయమైతే మనిషిలోని మానవత్వమే మరెందరికో
మనిషిలోని మేధస్సే మహా విజ్ఞానమైతే మనిషిగా మరెందరిలో జ్ఞానమే
మనిషిలోని ఆలోచనే అద్భుతమైతే మనిషిగా మనలో మహా విజయమే
మనిషిగా మనమంతా ఏకమై మహాత్ములుగా ఎదుగుదాం
మనిషిగా మహార్షులై అజ్ఞానాన్ని మరోవైపుగా తరిమేద్దాం   ॥ ఒకటే మాట ॥

Friday, June 5, 2015

శృతి లోని పదాలను శృతించరా

శృతి లోని పదాలను శృతించరా శివా
స్వరము లోని భావాలను స్మరించరా శివా

నీ శ్వాస లోని స్వర శృతులు స్వయంభువ శంఖములు
నీ ధ్యాస లోని స్వప్త స్వరాలు స్వయంకృత ప్రకాశములు ॥ శృతి ॥

భువి నుండి దివి వరకు ఓంకార లయ బద్ధమే
నాభి నుండి నాసికము దాక శ్వాసే ఓంకారము

ఆకార రూపాలలో అద్భుతాల అబేదమే నీ శరీరములు
ఆకృత వికృత విస్పోటన భావాలలో నీ వేద తత్వములే

విశ్వమందు నీవు నిలిచిన శివ లింగ రూపములే శిల క్షేత్రములు
కైలాసమందు నీవు లీనమైన చిత్రమే సృష్టికి భావ సుప్రభాతము  ॥ శృతి ॥

ఏ నామములో ఎక్కడ ఎలా ఉంటావో నీవే ఎరుక
నీ జీవ తత్వములు మరణములో నైనా నైతికమే

స్మశానమే దేవాలయమని తలిచే కర్త కర్మ క్రియ జీవి నీవే
అంతరంగమే ఆత్మాలయని కొలిచే ఆది పరమాత్మవు నీవే

అనంత జలచరాలకు పంచభూతాల విశ్వ శక్తి నీవే
అనంత జీవ భావాలకు ప్రతి అర్థ పరమార్థం నీవే         ॥ శృతి ॥

Thursday, April 30, 2015

దేవుడే లేడని అనుకొంటివా!

దేవుడే లేడని అనుకొంటివా!
ఇక మోక్షమేలా ఆపై నీకు స్వర్గమేలా - ఓ మానవా! || దేవుడే లేడని అనుకొంటివా! ||

మనస్సు నీదేగా శ్వాస నీలోనే ధ్యాస నీతోనే
ఇక మేధస్సుతో ఆలోచిస్తే నీకే తెలియునులే
విశ్వ మందు ఏమున్నదో నీకే ఎరుకలే 
భావాలతో ఏకీభవిస్తే అన్నీ నీకే తెలిసేనులే
జగతిని సృష్టించినది మానవుడేనని నీలో సందేహమా 
బ్రమ్హాండాన్ని అమర్చినది మానవులేనని మరో సందేహమా
దేవుడే లేనిదే విత్తనం లేదయ్యా
చెట్టే పెరగనిదే దైవం లేదయ్యా
ఆలోచిస్తే దేవుడు నీలోనే ఉన్నాడు
దైవం కూడా నీలో ఉన్న శక్తి స్వరూపమే || దేవుడే లేడని అనుకొంటివా! ||

మాతృ భావాలే సృష్టి స్వరూపాలకు నిలయం
విశ్వ భావాలే జగతిలోని బంధాలకు నిదర్శనం
నీవు సృష్టించేది ఏదీ లేదయ్యా
నీకు తెలిసేదే ఎంతో ఉందయ్యా
మేధస్సుతో ఆలోచిస్తే మేధావివి కాలేవు
మనస్సుతో ఆచరిస్తే ముక్తిని పొందలేవు
అనుభవాలతో ఎకీభవిస్తేనే అద్భుతాన్ని చూసెదవు
జీవితాన్ని విజ్ఞానంతో సాగిస్తేనే గమ్యాన్ని చేరెదవు
లోకాలెన్నో చూడాలంటే దైవ శక్తి అవసరమే
దేవుడే ఉన్నాడంటే నీకు జీవ శ్వాస అవసరమే  || దేవుడే లేడని అనుకొంటివా! ||