Sunday, August 26, 2018

ఆత్మనై భూగోళం చుట్టూ తిరుగుతున్నా

ఆత్మనై భూగోళమంతా తిరుగుతున్నా
పరమాత్మనై బ్రంహాండమంతా ప్రయాణిస్తున్నా

అణువు పరమాణువునై కాలమంతా చలించేస్తున్నా   || ఆత్మనై  ||

విశ్వతిగా నిలయమై ప్రకృతిగా ఎదుగుతున్నా
ఆకృతిగా ఆశ్చర్యమై రూపతిగా ఒదుగుతున్నా

కార్యాలతోనే సాగుతూ అణువుల ఆకారాలను మార్చేస్తున్నా
కాలంతోనే వెళ్ళుతూ పరమాణువుల రూపాలను విశదించేస్తున్నా   || ఆత్మనై  ||

ఆకారం మారినా ఆత్మగా నిలిచే ఉంటున్నా
రూపం చెదిరినా పరమాత్మగా వరించే ఉంటున్నా

ఎక్కడ ఎలా ఉన్నా చలనమే నేనై ఉంటున్నా
ఎందుకు ఎలా ఉన్నా గమనమే నేనై ఉంటున్నా  || ఆత్మనై  ||

శ్వాసగా ఆత్మను నేనే ధ్యాసగా పరమాత్మను నేనే
భావనగా ఆత్మను నేనే తత్వనగా పరమాత్మను నేనే

ఉచ్చ్వాసగా అణువుల ఆకారాల ఆకృతిని నేనే
నిచ్చ్వాసగా పరమాణువుల రూపాల రూపతిని నేనే   || ఆత్మనై  ||

భూగోళమంతా అణువుగా తిరిగినా ఆత్మగా నిలయమై ఉంటున్నా
బ్రంహాండమంతా పరమాణువుగా ప్రయాణించినా పరమాత్మగా కొలువై ఉంటున్నా

కాలంతో సాగే ఆత్మ జీవమే దేహమై భూగోళమంతా జన్మిస్తుంది
కార్యంతో సాగే పరమాత్మ ధర్మమే దైవమై బ్రంహాండమంతా జీవిస్తుంది   || ఆత్మనై  || 

Friday, August 24, 2018

వర్షమే కురిసింది వరదై ప్రవహించింది

వర్షమే కురిసింది వరదై ప్రవహించింది
మేఘమే అదిరింది సాగరమై ఉప్పొంగింది

చెఱువే తెగింది పట్టణమే మునిగింది
నదియే సాగింది పర్వతమే చలించింది

ఏమిటో వర్షం కురిసింది కుండపోతంగా
ఎందుకో నష్టం వరించింది అండదండగా   || వర్షమే ||

వర్షాల జోరు వరదల పోరు పల్లెలను సంక్రమించేనా
నదుల జోరు వాగుల పోరు గ్రామాలను ఆక్రమించేనా 

ఆనకట్టలే అదిరేలా మహా జలమే ఉద్ధృతమై ధ్వజమెత్తేనా
వంతెనలే చెదిరేలా మహా వాయువే ఉద్రేకమై శృతిమించేనా   || వర్షమే ||

తరతరాలుగా అనుభవిస్తున్నా ప్రణాళికలు ప్రక్షాళణ కావటం లేదు
యుగయుగాలుగా చూస్తున్నా ప్రయోజనాలు సక్రమణ కలగటం లేదు

వచ్చిపోయే వర్షాల వరదలను ఏ అధికారత్వం పట్టించుకోవటం లేదు
నిలిచిపోయే కరువుల కష్టాలను ఏ ప్రభుత్వం తొలగించుకోవటం లేదు   || వర్షమే ||

కాలమే కష్టాలకు సమాధానమా జనులకు సమయమే సంక్షోభమా
దుస్థితియే నష్టాలకు సమరమా జనులకు మరణమే సంఘర్షణమా

ప్రకృతియే మహా ప్రమాదమా సర్వ విధ జీవులకు మహా దుఃఖమా
విశ్వతియే మహా భీభత్సమా సర్వ విధ జీవులకు మహా క్షోభిత్వమా   || వర్షమే ||

Saturday, August 4, 2018

విశ్వం నుండే జగతికి మాతృ భావమై వచ్చావా సుమతి

విశ్వం నుండే జగతికి మాతృ భావమై వచ్చావా సుమతి
శూన్యం నుండే విశ్వతికి పితృ తత్వమై ఉన్నావా మహతి

పర లోకాల నుండే ప్రకృతికి పరంధామవై నిలిచావా అమరావతి
ఘన లోకాల నుండే జగతికి పరమాత్మవై జన్మించావా అరుంధతి   || విశ్వం ||

మాతృత్వ భావాల ప్రేమతి మమతాను రాగాల స్రవంతి
జీవిత బంధాల జయంతి జీవన స్వరూపాల సంస్కృతి

సంగీత సరిగమల సాహితి విజ్ఞాన వేదాల సరస్వతి
సువర్ణ మధురాలా సంపతి సుగంధ మోహాల మాలతి   || విశ్వం ||

అనంత గుణాల ఆద్యంతి అఖండ తత్వాల ప్రణతి
నదుల సంగముల తపతి  సాగర ప్రవాహాల సమ్మతి

అమోఘ కార్యాల భూపతి ఆవర్ణ రూపాల ఆకృతి
ఆనంద స్నేహాల దేవతి ఐశ్వర్య కాంతుల ఇరావతి   || విశ్వం ||

ఎటు చూసినా నీవే ఎటు వెళ్ళినా నీవే దేవా!

ఎటు చూసినా నీవే ఎటు వెళ్ళినా నీవే దేవా!
ఎటు తలచినా నీవే ఎటు మలచినా నీవే దేవా!

ఏది పలికినా నీవే ఏది పిలిచినా నీవే దేవా!
ఏది అడిగినా నీవే ఏది కలిగినా నీవే దేవా!

సర్వం నీవే భూతం నిత్యం నీవే పంచభూతం దేవా!
దైవం నీవే తారకం దివ్యం నీవే దశావతారకం దేవా!   || ఎటు ||

విశ్వమై వచ్చావు జగమై వెలిశావు మేఘమై కురిశావు నీవే
దేహమై వచ్చావు ధర్మమై వెలిశావు ఆత్మమై వెలిగావు నీవే

శాంతమై ఉన్నావు ప్రశాంతమై కదిలావు తేజమై చలించావు నీవే
మౌనమై ఉన్నావు భావనమై కదిలావు ప్రజ్వలమై ప్రకాశించావు నీవే   || ఎటు ||

తత్వమై ఎదిగావు దివ్యమై ఒదిగావు మూలమై నిలిచావు నీవే
శ్వాసవై దాగావు ఉచ్చ్వాసవై వస్తావు నిశ్శబ్దమై చలిస్తావు నీవే

అణువై జన్మించావు పరమాణువై ఉద్భవించావు జీవమై అధిరోహించావు నీవే
ఆకారమై వరించావు అపురూపమై ధరించావు అవధానమై ఆదర్శించావు నీవే   || ఎటు ||