Friday, December 27, 2019

విశ్వమే నా శ్వాసలో జీవమై జీవించునా

విశ్వమే నా శ్వాసలో జీవమై జీవించునా
జగమే నా ధ్యాసలో స్వరమై గమనించునా

వేదమే నా భాషలో జ్ఞానమై స్మరించునా
నాదమే నా వ్యాసలో గ్రంధమై పఠించునా

భావమే నా మేధస్సులో లీనమై ఆలోచించునా
తత్వమే నా దేహస్సులో లయమై అధిరోహించునా

సూర్యోదయమే నా శ్వాసను సజీవంతో విశ్వమంతా సాగిస్తున్నది
మహోదయమే నా ధ్యాసను సుజీవంతో జగమంతా సాగిస్తున్నది  || విశ్వమే ||

విశ్వమునే నా శ్వాసగా ధ్యానిస్తూ జీవిస్తున్నానుగా
జగమునే నా ధ్యాసగా స్మరిస్తూ గమనిస్తున్నానుగా

వేదమే నా భాషగా స్మరిస్తూ జ్ఞానిస్తున్నానుగా
నాదమే నా వ్యాసగా స్వరిస్తూ పఠిస్తున్నానుగా

భావమే నా ఆలోచనగా అర్థిస్తూ సంభాషిస్తున్నానుగా
తత్వమే నా యోచనగా అర్పిస్తూ సంబోధిస్తున్నానుగా  || విశ్వమే ||

విశ్వమే నాలో శ్వాసగా ప్రకృతితో ఉచ్చ్వాసించునుగా 
జగమే నాలో ధ్యాసగా ఆకృతితో ప్రశాంతించునుగా

వేదమే నాలో భాషగా జ్ఞానిస్తూ సంబోధించునుగా
నాదమే నాలో వ్యాసగా పఠిస్తూ పరిశోధించునుగా

భావమే నాలో వీక్షిస్తూ సంపూర్ణంగా సుఖించునుగా
తత్వమే నాలో దీక్షిస్తూ పరిపూర్ణంగా విశ్వాసించునుగా  || విశ్వమే ||  

Thursday, December 26, 2019

ఎవరికి తెలియని భావన ఎవరి మేధస్సులో ఉందో

ఎవరికి తెలియని భావన ఎవరి మేధస్సులో ఉందో
ఎవరికి తెలియని తత్వన ఎవరి దేహస్సులో ఉందో

ఎవరికి తోచని తపన ఎవరి ఆలోచనలో ఉందో
ఎవరికి కలగని స్పందన ఎవరి సులోచనలో ఉందో

ప్రతి జీవి మేధస్సులో ఎదో తెలియని వేదన దేహస్సులో పరిశోధనమై ఉందో  || ఎవరికి ||

ఆలోచనగా తెలియని అర్థం భావనగానే మేధస్సులో మిగిలిందా
యోచనగా తెలియని అర్థం తత్వనగానే దేహస్సులో తపించిందా

సంభాషణగా తెలియని అర్థం వేదనగానే మనస్సులో వేచిందా
వివరణగా తెలియని అర్థం స్పందనగానే వయస్సులో తోచిందా  || ఎవరికి ||

గమనముగా తెలియని అర్థం ప్రకృతిగానే ఉషస్సులో కలిగిందా
స్మరణముగా తెలియని అర్థం ఆకృతిగానే ఆయుస్సులో రగిలిందా

ప్రయాణముగా తెలియని అర్థం దృశ్యంగానే తేజస్సులో ప్రకాశించిందా
ప్రవాహముగా తెలియని అర్థం చిత్రంగానే వచస్సులో ప్రజ్వలించిందా  || ఎవరికి || 

విశ్వ భావాల దైవంతో ఉదయమై అవతరిస్తాను

విశ్వ భావాల దైవంతో ఉదయమై అవతరిస్తాను
విశ్వ తత్వాల దేహంతో మరణమై అస్తమిస్తాను

సర్వ భావాల వేదంతో గమనమై జీవిస్తాను
సర్వ తత్వాల జ్ఞానంతో చలనమై జన్మిస్తాను

నిత్య భావాల కాలంతో నిలయమై ప్రయాణిస్తాను
నిత్య తత్వాల కార్యంతో నిశ్చలమై ప్రసాదిస్తాను

అమర గుణాలతో ఆకర్షితమై అనుబంధాలనే ఆచరిస్తాను  || విశ్వ ||

ఉదయించుటకే జన్మించానని కార్యాలన్నీ అద్భుతమై అధిరోహిస్తున్నాను
మరణించుటకే జీవించానని స్వరాలన్నీ అఖండమై అతిశయిస్తున్నాను

అవతరించుటకే జన్మించానని సర్వం అసాధ్యమై ఆశ్రయిస్తున్నాను
అస్తమించుటకే జీవించానని నిత్యం అసామాన్యమై ఆర్భాటిస్తున్నాను 

విశ్వంలోనే ఉదయిస్తున్నా దైవ మేధస్సులోనే ఆదేశమౌతున్నా  || విశ్వ ||

గమనించుటకే జన్మించానని భావాలే పరిశోధనమై పరిశుద్ధమౌతున్నాను
స్మరించుటకే జీవించానని తత్వాలే ప్రశాంతమై ప్రబోధమౌతున్నాను

ప్రయాణించుటకే జన్మించానని వేదాలతో ప్రతేజమై ప్రజ్వలిస్తున్నాను
విహారించుటకే జీవించానని నాదాలతో ప్రభంజనమై ప్రచారిస్తున్నాను 

విశ్వంలోనే అస్తమిస్తున్నా దేహ తేజస్సులోనే ఆచరణమౌతున్నా  || విశ్వ ||

ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను

ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను
ఎవరూ స్మరించలేరా నా తత్వాల నాదాలను

ఎవరూ పలికించలేరా నా గమన గీతాలను
ఎవరూ లిఖించలేరా నా చలన స్వరాలను

శృతించుటలో నా భావ వేద తత్వ నాదాలు సరిగమల సాహిత్యాన్ని శుద్దిస్తున్నాయి  || ఎవరూ ||

నా భావాలు పరిశోధనలోనే సాగుతూ పరిభ్రమిస్తున్నాయి
నా తత్వాలు పర్యవేక్షణలోనే సాగుతూ పరిశ్రమిస్తున్నాయి

నా గమనాలు పరిశుద్ధంలోనే ఆడుతూ పరిమితమౌతున్నాయి
నా చలనాలు పరిపూర్ణంలోనే ఆడుతూ పవిత్రమౌతున్నాయి   || ఎవరూ ||

నా వేదాలు పర్యావరణంలోనే సాగుతూ ప్రశాంతమౌతున్నాయి
నా నాదాలు ప్రపంచంలోనే సాగుతూ ప్రాచుర్యమౌతున్నాయి

నా గీతాలు పల్లవించుటలోనే ఆడుతూ ప్రౌఢత్వమౌతున్నాయి
నా రాగాలు పరితపించుటలోనే ఆడుతూ ప్రభాతమౌతున్నాయి  || ఎవరూ || 

తెలిసినా తెలియని విజ్ఞానం అజ్ఞానమై సాగేనా

తెలిసినా తెలియని విజ్ఞానం అజ్ఞానమై సాగేనా
తలచినా తెలియని వేదాంతం అనర్థమై సాగేనా

తెలిసిన దారిలో తెలియని మార్గం అపార్థమై సాగేనా
తలచిన రీతిలో తెలియని వైనం అశుభమై సాగేనా   || తెలిసినా ||

ప్రావీణ్యంతో సాగినా అజ్ఞత ప్రచండమై సాగించును
ప్రాముఖ్యంతో సాగినా అవిద్య ప్రఘాతమై ఆవహించును

విశ్వాసంతో సాగినా ఆసక్తి అఘాతమై విజృంభించును
సౌరత్యంతో సాగినా అపేక్ష అరాజకమై ఆర్భాటించును  || తెలిసినా ||

విజ్ఞానంతో సాగినా ఆనాటి విభిన్నమే స్వాగతించును
వినయంతో సాగినా ఈనాటి విచ్చికమే ఆస్వాదించును

వేదాంతంతో సాగినా ఎంతటి అనుభవమైన ప్రతిఘటించును 
విధేయతతో సాగినా ముందటి అఘోరమైన ప్రబలించును      || తెలిసినా || 

Wednesday, December 25, 2019

ప్రతి జీవి తమ భాషలోని భావాలను గమనించాలి

ప్రతి జీవి తమ భాషలోని భావాలను గమనించాలి
ప్రతి జీవి తమ భాషలోని తత్వాలను తెలుసుకోవాలి

ప్రతి భాషలో తమ భావాలను సంభాషణతో వివరించాలి
ప్రతి భాషలో తమ తత్వాలను అన్వేషణతో పరిశీలించాలి

ప్రతి భాషలో ప్రతి భావాన్ని ప్రతి తత్వాన్ని అర్థంగా తెలుపుకోవాలి  || ప్రతి జీవి ||

ప్రతి భాషలో ప్రతి భావాన్ని తమ వారికి వ్యక్తపఱచాలి
ప్రతి భాషలో ప్రతి తత్వాన్ని తమ వారికి అనువదించాలి

ప్రతి భాషను సంపూర్ణంగా అర్థంగా అలవరచుకోవాలి
ప్రతి భాషను సభ్యతగా సమర్థంగా అభివృద్ధిచేసుకోవాలి  || ప్రతి జీవి ||

ప్రతి భాషలో తమ భాష ఔన్నత్యమును చాటుకోవాలి
ప్రతి భాషలో తమ భాష అన్యోన్యతను అవలంబించుకోవాలి

ప్రతి భాషలో తమ పదాల వాక్యాల ఉచ్చారణ స్పష్టంగా ఉండాలి
ప్రతి భాషలో తమ వాక్య సముదాయ విభాగం సంక్లిష్టంగా ఉండాలి  || ప్రతి జీవి ||

ప్రతి భాషలో సమాచార సాహిత్య విధానాన్ని సమన్వయంగా వ్యక్తపఱచాలి
ప్రతి భాషలో శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానాన్ని నిండుగా ఉపయోగించుకోవాలి

ప్రతి భాషలో స్నేహితులను ప్రేమికులను అనుభవం చేసుకోవాలి
ప్రతి భాషలో ప్రయాణికులను యాత్రికులను అవగాహన చేసుకోవాలి  || ప్రతి జీవి || 

ప్రతి జీవి గమనంతోనే జీవిస్తుంది

ప్రతి జీవి గమనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి చలనంతోనే జీవిస్తుంది

ప్రతి జీవి సహనంతోనే జీవిస్తుంది
ప్రతి జీవి ప్రయాణంతోనే జీవిస్తుంది

ప్రతి జీవి మేధస్సులో ఆహార నియమం నిరంతరం సాగుతుంది
ప్రతి జీవి మేధస్సులో జీవన నియమం నిరంతరం సాగుతుంది   || ప్రతి జీవి ||

ఏ జీవికైనా తమ జీవన విధానం మేధస్సులోనే నిర్మితమై సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవిత ధర్మం మేధస్సులోనే ఆద్యంతమై సాగుతుంది

ఏ జీవికైనా తమ ఆచార వ్యవహారం మేధస్సులోనే అన్వేషణగా సాగుతుంది
ఏ జీవికైనా తమ విహార వ్యవహారం మేధస్సులోనే పర్యవేక్షణగా సాగుతుంది   || ప్రతి జీవి ||

ఏ జీవికైనా తమ జీవ కార్యం రూపంతోనే సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ లోపం ఆకారంతోనే సాగుతుంది

ఏ జీవికైనా తమ జీవ గమనం శ్వాసతోనే సహనమై సాగుతుంది
ఏ జీవికైనా తమ జీవ చలనం ధ్యాసతోనే ప్రయాణమై సాగుతుంది   || ప్రతి జీవి || 

మేధస్సులోనే సర్వం వీక్షించావా మేధస్సులోనే నిత్యం వలచావా

మేధస్సులోనే సర్వం వీక్షించావా మేధస్సులోనే నిత్యం వలచావా
మేధస్సులోనే శాంతం కొలిచావా మేధస్సులోనే కాంతం ధరించావా
మేధస్సులోనే మోహం సహించావా మేధస్సులోనే లోపం తలచావా  || మేధస్సులోనే ||

మరచిపోయే మేధస్సు జీవులకే మననమై సాగేనా
అలసిపోయే మేధస్సు జీవులకే నిలయమై సాగేనా

నిష్ఫలమైపోయే మేధస్సు జీవులకే చలనమై సాగేనా
చులకనైపోయే మేధస్సు జీవులకే ప్రయాణమై సాగేనా  || మేధస్సులోనే ||

లీనమైపోయే మేధస్సు జీవులకే కారణమై సాగేనా
దీనమైపోయే మేధస్సు జీవులకే ధారణమై సాగేనా

సాగిపోయే మేధస్సు జీవులకే సహనమై సాగేనా
ఎదిగిపోయే మేధస్సు జీవులకే సహకారమై సాగేనా  || మేధస్సులోనే || 

మరిచావా మహా మంత్రాన్ని నీ మేధస్సులో

మరిచావా మహా మంత్రాన్ని నీ మేధస్సులో
తలిచావా మహా మంత్రాన్ని నీ ఆలోచనలో

గమనించావా మహా మంత్రాన్ని నీ దేహంలో
స్మరించావా మహా మంత్రాన్ని నీ యోగంలో

మంత్రమే మర్మమై చేరిందా నీ శ్వాసలో
మంత్రమే తంత్రమై మారిందా నీ ధ్యాసలో  || మరిచావా ||

దేహంలోనే దాగున్నదా మహా యంత్ర మంత్రం
రూపంలోనే దాగున్నదా మహా తంత్ర మంత్రం

జీవంలోనే దాగున్నదా మహా మేధస్సు మర్మం
జ్ఞానంలోనే దాగున్నదా మహా మనస్సు మర్మం  || మరిచావా ||

వేదంలోని దాగున్నదా మహా వయస్సు తంత్రం
నాదంలోనే దాగున్నదా మహా ఉషస్సు తంత్రం

నిత్యంలోనే దాగున్నదా మహా దేహస్సు యంత్రం
సర్వంలోనే దాగున్నదా మహా ఆయుస్సు యంత్రం  || మరిచావా || 

నీ ప్రయాణాలే ఒక యోగమని నీ దేహానికి తెలుపవా

నీ ప్రయాణాలే ఒక యోగమని నీ దేహానికి తెలుపవా
నీ ఉచ్చ్వాసాలే ఒక భోగమని నీ ఆలోచనకు తెలుపవా

నీ శ్వాస గమనమే మహా యోగమని నీ దేహానికి తెలుపవా
నీ ధ్యాస చలనమే మహా భోగమని నీ ఆలోచనకు తెలుపవా 

జీవితమే ఒక యోగ భోగ ప్రయాణమని ప్రతి జీవికి నీవే తెలుపవా  || నీ ప్రయాణమే ||

జీవించుటలో ప్రయాణం ఒక యోగ ధ్యాన సిద్ధియే
శ్వాసించుటలో చలనం ఒక భోగ ధ్యాస ప్రసిద్ధియే

ఆలోచించుటలో దేహం ఒక మహా యోగ సామర్థ్యమే
ధ్యానించుటలో జీవం ఒక మహా భోగ సంభూతయమే  || నీ ప్రయాణమే ||

ప్రయాణించుటలో నీ జీవం ఒక యోగ భావ ప్రశాంతమే
తిలకించుటలో నీ రూపం ఒక భోగ తత్వ పరివర్తనమే

దర్శించుటలో నీ దేహం ఒక మహా ధ్యాన దైవ పరిశుద్ధమే
ఆశ్రయించుటలో నీ వేదం ఒక మహా ధ్యాస దివ్య ప్రజ్ఞానమే  || నీ ప్రయాణమే ||  

ఏనాడు లిఖించెదరో నా భావాలను అనేక భాషలలో

ఏనాడు లిఖించెదరో నా భావాలను అనేక భాషలలో
ఏనాడు వర్ణించెదరో నా తత్వాలను అనేక వాక్యాలలో

ఎవరు లిఖించెదరో నా వేదములను అనేక ప్రాంతాలలో
ఎవరు వర్ణించెదరో నా జ్ఞానములను అనేక పాఠములలో   || ఏనాడు ||

భావనయే తెలియని నాడు తెలియును భాష ప్రభావ తేజము
తత్వనయే తోచని నాడు తెలియును భాష ప్రబోధ కాంతము

వేదమే తెలియని నేడు తెలిపేను భాషే ఖ్యాతి ప్రాధాన్యము
జ్ఞానమే తెలియని నేడు తెలిపేను భాషే కీర్తి ప్రాముఖ్యము  || ఏనాడు ||

జీవమే తెలియని నాడు తెలిపేను భాష బంధాల ప్రయోజనము
రూపమే తెలియని నాడు తెలిపేను భాష స్వరాల ప్రతియత్నము

సర్వమే తెలియని నాడు తెలిపేను భాషే విశ్వ అనంతము
నిత్యమే తెలియని నాడు తెలిపేను భాషే లోక ఆద్యంతము  || ఏనాడు || 

విశ్వమే నీవని వేదమే తెలిపెను

విశ్వమే నీవని వేదమే తెలిపెను
జగమే నీవని జ్ఞానమే తెలిపెను

వేదమే నీవని కాలమే తెలిపెను
జ్ఞానమే నీవని మోహమే తెలిపెను

సర్వం నీవని భావమే తెలిపెను
నిత్యం నీవని తత్వమే తెలిపెను

భావమే నీవని బంధమే తెలిపెను
తత్వమే నీవని జీవమే తెలిపెను

మనస్సే నీవని శ్వాసే తెలిపెను
వయస్సే నీవని ధ్యాసే తెలిపెను

శ్వాసే నీవని యోగమే తెలిపెను
ధ్యాసే నీవని భోగమే తెలిపెను

గమనమే నీవని దేహమే తెలిపెను
చలనమే నీవని దైవమే తెలిపెను

దేహమే నీవని ప్రకృతి తెలిపెను
దైవమే నీవని జాగృతి తెలిపెను 

Monday, June 17, 2019

విశ్వము చేసే ఆలోచనలో ప్రకృతి ప్రక్రియ పరమార్థము తెలిపేను

విశ్వము చేసే ఆలోచనలో ప్రకృతి ప్రక్రియ పరమార్థము తెలిపేను
జగము చేసే యోచనలో జీవతి ప్రక్రియ పరిశోద్దార్థనము తెలిపేను

ప్రకృతి ప్రక్రియ జీవ పదార్థముచే సాగే సూక్ష్మ క్రియ కార్యముల విశ్వ జ్ఞాన పరిశోధనమే
విశ్వతి ప్రక్రియ అణు పరమాణుచే సాగే అర్థ క్రియ కార్యముల వేద విజ్ఞాన పర్యవేక్షణమే  || విశ్వము ||

విశ్వములో రూపాలన్ని కాల ప్రభావముచే ఎదిగిన ప్రకృతి జీవములే
జగములో ఆకారాలన్నీ కాల సమయముచే మారిన ప్రకృతి జీవములే

ప్రకృతి విశ్వతి జగతికి రూపతినిచ్చిన ఆకృతి భావాల ఆవరణమే
జగతి జాగృతి ప్రకృతికి ఆకృతినిచ్చిన జీవతి తత్వాల పరిణామమే  || విశ్వము ||

విశ్వములో అనంతమై ఎదిగిన రూపాలన్నీ అణువుల ఆకారాల అర్థాంశమే
జగములో నిత్యమై ఒదిగిన ఆకారాలన్నీ పరమాణువుల రూపాల దివ్యాంశమే

ప్రకృతి ప్రక్రియ విశ్వ పదార్థముల జీవ పరిణామ పరమార్థమే
విశ్వతి ప్రక్రియ జీవ పదార్థముల జన్యు పర్యావరణ పరమాత్మమే  || విశ్వము ||

ఆలోచనలో యోచన ఉందా మేధస్సులో మర్మం ఉందా

ఆలోచనలో యోచన ఉందా మేధస్సులో మర్మం ఉందా
యంత్రములో తంత్రం ఉందా దేహములో దైవం ఉందా

విజ్ఞానములో పరమార్థం ఉందా అణువులో పరమాణువు ఉందా
అనుభవములో అఖిలం ఉందా ఆత్మములో పరమాత్మం ఉందా

జీవించుటకు జీవనం ఉన్నట్లు ఉదయించుటకు ఉద్దేశం ఉందా
మరణించుటకు కారణం ఉన్నట్లు జన్మించుటకు జాప్యం ఉందా   || ఆలోచనలో || 

విశ్వమా నీవు అజ్ఞానాన్ని కలిగిస్తున్నావు

విశ్వమా నీవు అజ్ఞానాన్ని కలిగిస్తున్నావు
కాలమా నీవు అనర్థాన్ని సాగిస్తున్నావు

మేధస్సును నీవే అజాగ్రత్త పరుస్తున్నావు
మనస్సును నీవే అప్రమత్తం చేస్తున్నావు

జీవితాలను అనారోగ్యంతో సాగిస్తూనే ఆయుస్సును తరిగిస్తున్నావు  || విశ్వమా ||

ఆలోచనలకు తీరిక లేక దేహాలకు విశ్రాంతి లేక
బంధాలకు స్వేచ్ఛ లేక రూపాలకు విలువ లేక

స్నేహాలకు విజ్ఞానం లేక ప్రేమాలకు అనుభవం లేక
జీవితాలకు విలాసము లేక జీవనాలకు అభివృద్ధి లేక

దినచర్య కార్యాలు దశ దిశల అపార్థమై సంకలనమగును  || విశ్వమా ||

వేదాలకు వచనం లేక జీవులకు నియంత్రణ లేక
భావాలకు నియమం లేక తత్వాలకు సహనం లేక

జ్ఞానులకు ఆధారం లేక మానవులకు నిజాయితి లేక
స్వరూపాలకు ఐక్యత లేక ఆకారాలకు అనుమతి లేక

దినచర్య కార్యాలు దశ దిశల అపార్థమై సంకలనమగును  || విశ్వమా || 

కవి బ్రంహ మేధస్సులో విశ్వ నాడుల కదలికల బ్రంహ జ్ఞానము

కవి బ్రంహ మేధస్సులో విశ్వ నాడుల కదలికల బ్రంహ జ్ఞానము
కవి బ్రంహ మేధస్సులో జీవ నాడుల పరంపరల వేద విజ్ఞానము
కవి బ్రంహ యోచనలో మర్మ త్రయముల కర్త కర్మ క్రియాంశము
కవి బ్రంహ యోచనలో త్రికరణముల దేహాంతర త్రిగుణాంశము

ఏనాటి కవి బ్రంహ ఏనాటి కవి రాజ ఏనాటి కవి కీర్తి భ్రమణము
ఏనాటి  కవి పూర్ణ ఏనాటి కవి చంద్ర ఏనాటి కవి కాంస్య చరణము 
ఏనాటి కవి చక్ర ఏనాటి కవి శర్మ ఏనాటి కవి స్ఫూర్తి స్పందనము 
ఏనాటి కవి బాహు ఏనాటి కవి జాణ ఏనాటి కవి దారి దర్పణము 

ఓ మహా దేవా! నీవైనా అజ్ఞానాన్ని కలిగించవా

ఓ మహా దేవా! నీవైనా అజ్ఞానాన్ని కలిగించవా
ఓ ప్రభు దేవా! నీవైనా అనర్థాన్ని నడిపించవా
ఓ గురు దేవా! నీవైనా అనిష్టము చూపించవా
ఓ జయ దేవా! నీవైనా అర్ధాంతము చేకూర్చవా

విజయమే లేని నా విజ్ఞానము నాకు నిత్యం నిష్ప్రయోజనమే
సంతోషమే లేని నా వేదాంతము నాకు సర్వం నిరర్థకారణమే   || ఓ మహా దేవా! ||

అజ్ఞానం అఖండమై కార్యములన్నియు అపజయంతో సాగిపోతున్నాయి
అనర్థం అమోఘమై కార్యములన్నియు అపార్థంతో జరిగిపోతున్నాయి
అనిష్టం అభిన్నమై కార్యములన్నియు అస్వస్థతతో వెళ్ళిపోతున్నాయి
అర్ధాంతం అమరమై కార్యములన్నియు అజాగ్రతతో చెదిరిపోతున్నాయి

విజయం కలిగే వరకు నా కార్యములు సప్త సముద్రాలతో పోరాడుతుంటాయి  || ఓ మహా దేవా! ||

అజ్ఞానం అనివార్యమై కార్యములన్నియు అధ్యాయంతో సాగిపోతున్నాయి
అనర్థం అనంతమై కార్యములన్నియు అన్వేషణతో జరిగిపోతున్నాయి
అనిష్టం అపారమై కార్యములన్నియు అప్రమత్తతతో వెళ్ళిపోతున్నాయి 
అర్ధాంతం ఆద్యంతమై కార్యములన్నియు అవిశ్వాసంతో చెదిరిపోతున్నాయి 

మరణం కలిగే వరకు నా కార్యములు విశ్వ వేదాలతో లిఖింపబడుతుంటాయి  || ఓ మహా దేవా! ||

జీవము నీవై జీవంతర్యామిగా జగతిని పరిశోధిస్తావా

జీవము నీవై జీవంతర్యామిగా జగతిని పరిశోధిస్తావా
నిత్యము నీవై నిత్యాంతర్యామిగా జీవతిని నడిపిస్తావా
సర్వము నీవై సర్వాంతర్యామిగా విశ్వతిని వెలిగిస్తావా
రూపము నీవై రూపాంతర్యామిగా ప్రకృతిని సృష్టిస్తావా  || జీవము ||

ఓ మహాశయా! అంతర్యామివై అంతరిక్షములను తాకావా
ఓ మహాదేవా! అంతరాత్మవై అనంతకార్యములను చూడవా
ఓ మహాదయా! అంతర్భావమై అంతఃకరణములను మీటవా
ఓ మహాత్రయా! అంతర్లీనమై అంతర్భావములను తిలకించవా  || జీవము ||

ఓ మహాచరా! జీవంతర్యామివై ఉపనిషత్తులను పలికించవా
ఓ మహాతేజా! రూపాంతర్యామివై వేదములను పరిశోధించవా
ఓ మహాకరా! సర్వాంతర్యామివై సద్భావములను కలిగించవా
ఓ మహాక్రమా! నిత్యంతర్యామివై సర్వేంద్రియములను ఏకీభవించవా  || జీవము || 

ఏనాటి విజ్ఞానం తరతరాలకు సాగినా స్వచ్ఛత లేదే ఏ మేధస్సులో

ఏనాటి విజ్ఞానం తరతరాలకు సాగినా స్వచ్ఛత లేదే ఏ మేధస్సులో
ఏనాటి అనుభవం యుగయుగాలకు సాగినా స్వచ్ఛత లేదే ఏ కార్యములో
ఏనాటి ఉపాయం నిత్యానంతరం సాగినా స్వచ్ఛత లేదే ఏ ఆచరణలో  || ఏనాటి ||

స్వచ్ఛమైన జీవితం స్వచ్ఛమైన జీవనం విశ్వమంతా సాగించవా
స్వచ్ఛమైన ప్రదేశం స్వచ్ఛమైన ప్రపంచం జగమంతా సాగించవా

స్వచ్ఛమైన భావాల స్వచ్ఛమైన తత్వాల వేదాలను సాగించవా
స్వచ్ఛమైన రూపాల స్వచ్ఛమైన దేహాల బంధాలను సాగించవా  || ఏనాటి ||

స్వచ్ఛమైన విజ్ఞానం స్వచ్ఛమైన అనుభవం నిత్యం సాగించవా
స్వచ్ఛమైన వేదాంతం స్వచ్ఛమైన ఆచరణం సర్వం సాగించవా

స్వచ్ఛమైన స్నేహం స్వచ్ఛమైన ప్రేమం నిరంతరం సాగించవా
స్వచ్ఛమైన కాలం స్వచ్ఛమైన సమయం సర్వాంతరం సాగించవా  || ఏనాటి || 

రోగానికి ఏది ఔషధము అనారోగ్యానికి ఏది కారణము తెలుపవా దేవా

రోగానికి ఏది ఔషధము అనారోగ్యానికి ఏది కారణము తెలుపవా దేవా
మనస్సుకు ఏది వేదము వయస్సుకు ఏది విజ్ఞానము తెలుపవా దేవా

నా కార్యముల కర్త కర్మ క్రియలను ఏక కాలములో త్రికరణ శుద్ధి చేయవా
నా యోచనముల భావ తత్వ స్పందనలను సకాలములో త్రిగుణ శుద్ధి చేయవా

నా మేధస్సులోని ఆలోచనలను మహా ప్రదేశముల సరిహద్దులను దాటించవా   || రోగానికి ||

విజ్ఞానంతో ప్రయాణిస్తున్నా మేధస్సును గ్రహాల స్థితి సమయంతో అప్రమత్తం చేసేను  
ఏకాగ్రతతో ఆలోచిస్తున్నా కార్యాలను లోపాల స్థితి స్వభావాలతో ఆపదలను కలిగించేను

సాంకేతిక ఆధునిక విజ్ఞానంతో నడుచుకున్నా జీవుల మతి స్థితి అజ్ఞానంతో అశుభం చేకూర్చేను
కృతిమపర యంత్రాగములను విడిచినా అత్యవసర ఆధారాల జీవన స్థితి అజాగ్రత్త కలిగించేను  || రోగానికి ||

ప్రకృతి సిద్ధాంతాల ఔషధాలచే రోగాలు స్వస్థతమైనా ఆధునిక ఔషధములే మిక్కిలి లభ్యమయ్యేను
ఆధునిక ఔషధములచే దేహములు స్వల్పారోగ్యమైనా నవ రోగాలకు శరీరములు అంకితమయ్యేను

మేధస్సులో మహా విజ్ఞాన అనుభవాలు ఉన్నా కార్యాలలో అజాగ్రత్త అనర్థ అశుభ స్థితి కలిగి ప్రమాదం వాటిల్లేను
ఆలోచనలో మహా ఎరుక ఏకాగ్రతలు ఉన్నా కార్యాలలో అప్రమత్త అజ్ఞాన ఆకస్మిక స్థితి కలిగి జీవ నష్టం చేకూరేను  || రోగానికి || 

ఓ కాలమా నీవైనా నా జీవితాన్ని మార్చావా

ఓ కాలమా నీవైనా నా జీవితాన్ని మార్చావా
ఓ సమయమా నీవైనా నా జీవనాన్ని తేల్చవా
ఓ తరుణమా నీవైనా నా జీవస్థితిని చూడవా

ఎక్కడికి వెళ్ళినా అజ్ఞానం అనర్థం అశుభం కలిగేలా సాగుతుంది ప్రయాణం
ఎక్కడకు వెళ్ళకున్నా ఆపదలు అస్వస్థమై అకాలంతో వచ్చేస్తుంది ప్రకారం   || ఓ కాలమా ||

విజ్ఞానం ఉన్నా సమయం చాలదా
వినయం ఉన్నా వివేకం సాగదా

సమయం ఉన్నా సందర్భం కుదరదా
సంతోషం ఉన్నా సంబరం వీలుకాదా

అన్వేషణకు అనుభవం ఏకాగ్రతతో అనుకూలించదా   || ఓ కాలమా ||

ఆలోచన ఉన్నా ఆధారం సమీపించదా
ఆవేదన ఉన్నా ఆనందం సహించదా

విచారణ ఉన్నా వివరణ సరికాదా
పరిశోధన ఉన్న ప్రయోజనం ఉండదా

ఆచరణకు అభ్యాసం ఆలోచనతో ఏకీభవించదా   || ఓ కాల

Monday, May 27, 2019

విశ్వమై ప్రతి అణువునే అన్వేషిస్తున్నా నా స్నేహమా

విశ్వమై ప్రతి అణువునే అన్వేషిస్తున్నా నా స్నేహమా
జగమై ప్రతి పరమాణువునే పరిశోధిస్తున్నా నా ప్రేమమా

ప్రకృతినై ప్రతి ఆకృతినే శాస్త్రీయ సిద్ధాంతంతో పర్యవేక్షిస్తున్నా నా మిత్రమా  || విశ్వమై ||

విశ్వ జగతికి నీడనై నిత్యం నేనే ఉంటున్నా
విశ్వ ప్రకృతికి ఛాయనై సర్వం నేనే దాగున్నా

అణువుగానే నీడనై విశ్వంలోనే ఆకృతిగా ఇమిడిపోయి ఉన్నా
పరమాణువుగా ఛాయనై జగంలోనే రూపతిగా ఇంకిపోయి ఉన్నా

అణువుగానే నా స్వరూపం అంతరించి పోదని ప్రకృతినై ఎదుగుతున్నా
పరమాణువుగానే నా ఆకారం అస్తమించి పోదని ఆకృతినై ఒదుగుతున్నా  || విశ్వమై ||

దివ్య జగతికి ఆకృతినై నిత్యం నేనే వెలసి ఉన్నా
దివ్య ప్రకృతికి రూపతినై సర్వం నేనే విరసి ఉన్నా

అణువుగానే నా అన్వేషణ విశ్వమందే సాగుతుందని నిలిచివున్నా
పరమాణువుగానే నా పరిశోధన జగమందే సాగుతుందని తలిచివున్నా

అణువులన్నీ ఒకటిగా ఆకారమై విశ్వాన్ని నడిపిస్తుందని ప్రయాణిస్తున్నా
పరమాణువులన్నీ ఒకటిగా స్వరూపమై జగాన్ని నడిపిస్తుందని వ్యాపిస్తున్నా  || విశ్వమై || 

Friday, May 10, 2019

ఉన్నది ఏది లేనిది ఏది

ఉన్నది ఏది లేనిది ఏది
వచ్చేది ఏది రానిది ఏది

మనలో ఉన్నది ఎవరికి
మనతో ఉన్నది ఎందరికి

ఏది తెలిసినా ఎంతో తెలియాలని
ఎంత తెలిసినా ఏదో తెలుసుకోవాలని   || ఉన్నది ||

నా భావం ఎవరి వెంట లేదు
నా తత్వం ఎవరి వెంట రాదు

నా వేదం ఎవరి చెంత లేదు
నా జ్ఞానం ఎవరి చెంత రాదు

నా కోసం ఎవరి సమయం ఆగదు
నా దేహం ఎవరి సహాయం కోరదు

నా మేధస్సులో ఉన్న మర్మం ఎవరికి తెలియదు
నా శిరస్సులో ఉన్న మంత్రం ఎవరికి తోచబడదు  || ఉన్నది ||

నా రూపం ఎవరి వెంట నిలవదు
నా తాపం ఎవరి వెంట కలవదు

నా జీవం ఎవరి చెంత సాగదు
నా లోపం ఎవరి చెంత ఉండదు

నా కార్యం ఎవరి తరుణం మార్చదు
నా బంధం ఎవరి కలహం అంటదు

నా ఆలోచనలో ఉన్న గమనం ఎవరిని తపించదు
నా యోచనలో ఉన్న చలనం ఎవరిని వహించదు  || ఉన్నది || 

Wednesday, May 8, 2019

నీ శ్వాసతోనే జన్మించాను మాతృదేవా

నీ శ్వాసతోనే జన్మించాను మాతృదేవా
నీ ధ్యాసతోనే ఉదయించాను పితృదేవా

నీ ఆకారమే జగతికి మహా దేవ స్వరూపం
నీ ప్రకారమే విశ్వతికి మహా దేవ స్వభావం

నీ భావాలే నాలో జీవత్వాలై జీవించునే సర్వం
నీ వేదాలే నాలో స్వరత్వాలై స్మరించునే నిత్యం  || నీ శ్వాసతోనే ||

నీ జీవన వేదం విశ్వతికి మహోదయ ప్రజ్వల ప్రతేజం 
నీ భావన జ్ఞానం జగతికి మహోదయ ప్రభాత ప్రణామం

నీ జీవం శ్వాస ధ్యాసకు కలిగే మహానంద భరిత యోగం
నీ తత్వం ఉచ్చ్వాస నిచ్చ్వాసకు చేరే మహాశయ చరిత భోగం  || నీ శ్వాసతోనే ||

నీ లోనే దైవం నీతోనే భావనం నీయందే మహా జరిత జగతి తత్వం
నీ లోనే దేహం నీతోనే తపనం నీయందే మహా సరిత విశ్వతి భత్యం

నీ లోనే సౌఖ్యం నీతోనే సహచరం నీయందే మహా గణిత ప్రకృతి కోణం
నీ లోనే ఐక్యం నీతోనే సహకారం నీయందే మహా వణిత ఆకృతి చూర్ణం   || నీ శ్వాసతోనే || 

విశ్వమంతా నిశ్శబ్దమై జీవించవా నేస్తమా

విశ్వమంతా నిశ్శబ్దమై జీవించవా నేస్తమా
జగమంతా ప్రశాంతమై సాగించవా మిత్రమా

ప్రకృతంతా నిర్మలమై జీవించవా నేస్తమా
లోకమంతా పరిశోధనమై సాగించవా మిత్రమా

విశ్వమంతా అమోఘమైన ధ్వనుల సందడితో సాగిపోవునా  
జగమంతా అఖండమైన స్వరముల శర్థముతో జరిగిపోవునా  || విశ్వమంతా ||

నిశ్శబ్దమై జీవించవా ప్రశాంతమై సాగించవా జీవితం
నిర్మలమై జీవించవా పరిశోధనమై సాగించవా జీవనం

నిశ్శబ్దమై వరించవా ప్రశాంతమై సహించవా జీవితం
నిర్మలమై వరించవా పరిశోధనమై సహించవా జీవనం  || విశ్వమంతా ||

నిశ్శబ్దమై వర్ణించవా ప్రశాంతమై పఠించవా జీవితం
నిర్మలమై వర్ణించవా పరిశోధనమై పఠించవా జీవనం

నిశ్శబ్దమై పులకించవా ప్రశాంతమై విహరించవా జీవితం
నిర్మలమై పులకించవా పరిశోధనమై విహరించవా జీవనం  || విశ్వమంతా ||

మానవుడా మానవుడా రహస్యం తెలిసేనా

మానవుడా మానవుడా రహస్యం తెలిసేనా
మాధవుడా మాధవుడా మర్మజ్ఞం తెలిసేనా

మానవుడా మానవుడా అద్భుతం జరిగేనా
మాధవుడా మాధవుడా ఆశ్చర్యం కలిగేనా

జీవితంలో ఏది లేని భవితవ్యం నాకే వరించెనే ఎందుకో  || మానవుడా ||

మేధస్సులో కలిగే ఆలోచన అపారమైనా అన్వేషణ శూన్యమా
మనస్సులో కలిగే యోచన అఖండమైనా పరిశోధన పూజ్యమా

వయస్సులో కలిగే మోహనం అఖిలమైనా ఆద్యంతం అంతమా
ఉషస్సులో కలిగే చందనం అమోఘమైనా అధ్యాయం వ్యయమా  || మానవుడా ||

గుణములో కలిగే సువర్ణం సుందరమైనా అలంకారం చిత్రమా
వైనములో కలిగే ఉపాయం ఆస్వాదమైనా రూపాకారం క్షత్రమా

బంధములో కలిగే బాంధవ్యము సుధీర్ఘమైనా సంయుక్తం అభాగ్యమే
శాస్త్రములో కలిగే వేదాంతము ఆధిక్యమైనా నిరంకుశత్వం అపార్థమే  || మానవుడా || 

Sunday, May 5, 2019

ఏనాడో వెళ్ళిపోయినా నా పాద రక్షాలను నేడే దర్శించాను

ఏనాడో వెళ్ళిపోయినా నా పాద రక్షాలను నేడే దర్శించాను
ఎప్పుడో కనుమఱుగైన నా పాద రక్షాలను నేడే గమనించాను

నా పాద రక్షాలను నేను గుర్తించినా నేను స్వీకరించలేదు
నా పాద రక్షాలను నేను దర్శించినా నేను ధరించలేదు

ధరించినవారి తమ పాదాలకు రక్షణగా ఉండాలనే నేను భావించాను
వరించినవారి తమ పాదాలకు స్పర్శగా ఉండాలనే నేను స్పందించాను  || ఏనాడో ||

నా పాద రక్షములే పద్మములై నీ భావాలను సుఖించేను
నా పాద రక్షములే పదకములై నీ కార్యాలను స్మరించేను 

నా పాద రక్షములే నీ దివ్య గుణములై విశ్వాన్ని అన్వేషించేను
నా పాద రక్షములే నీ విద్య వర్ణములై లోకాన్ని పరిశోధించేను     || ఏనాడో ||

నా పాద రక్షములే నీ ఆలోచనల తత్వాన్ని తిలకించేను
నా పాద రక్షములే నీ ఆవేదనల స్వభావాన్ని తపించేను

నా పాద రక్షములే నీ మనస్సును ప్రకృతిపై కేంద్రీకరించేను
నా పాద రక్షములే నీ వయస్సును జగతిపై  ధ్రువీకరించేను    || ఏనాడో || 

హృదయమా నిలిచిపోయావా దేహంలో

హృదయమా నిలిచిపోయావా దేహంలో
మరణమా వదిలిపోయావా విశ్వంలో

కాలమైనా ఆగలేదు క్షణమైనా తెలుపలేదు
సమయమైనా చూపలేదు చివరికేది తెలియలేదు

మేధస్సుకే తోచలేదు మనస్సుకే స్పందనలేదు   || హృదయమా ||

భావమైనా గ్రహించలేకపోయే తత్వమైనా ఆవహించకపోయే
వేదమైనా స్పందించలేకపోయే జ్ఞానమైనా స్వరించకపోయే

దైవమైనా తెలుపలేకపోయే కాలమైనా తపించలేకపోయే
దేహమైన త్యజించలేకపోయే జీవమైనా తడబడలేకపోయే   || హృదయమా ||

కార్యమైనా చెప్పలేకపోయే కారణమైన తెలియలేకపోయే
హృదయమైనా గమనించకపోయే జీవమైనా గ్రహించకపోయే

వయస్సైనా జాగ్రతలేకపోయే మనస్సైనా చూసుకోలేకపోయే
మేధస్సైనా నిలుపలేకపోయే ఉషస్సైనా చెదరలేకపోయే      || హృదయమా ||

Wednesday, April 17, 2019

ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో

ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో
ఆలోచన చేయవా తోచదా నీ మేధస్సులో

ఆలోచన కలుగదా ఎదగదా నీ మేధస్సులో
ఆలోచన తెలుపవా తలచవా నీ మేధస్సులో

ఆలోచన లేని నీ మేధస్సు మహా సుకుమారమా  || ఆలోచన ||

ఆలోచనలను అర్థం చేసుకోవా
అర్థాన్నే ఆలోచనగా మార్చుకోవా

అనేక భావాల ఆలోచనలనే గ్రహించవా
అనంత తత్వాల ఆలోచనలనే గమనించవా  || ఆలోచన ||

మహోన్నత ఆలోచనలనే తిలకించలేవా
మహత్తరమైన ఆలోచనలనే పరిశోధించవా

ఆలోచనలనే అనుభవాల అర్థాలుగా మార్చుకోవా
ఆలోచనలనే అనుబంధాల పరమార్థంగా చూసుకోవా  || ఆలోచన ||

ఉపయోగమైన ఆలోచనలనే దాచుకోవా
నిరుపయోగమైన ఆలోచనలనే వదులుకోవా

మేధస్సునే అనంతమైన ఆలోచనలతో నింపుకోవా
మేధస్సునే సుందరమైన ఆలోచనలతో ఉంచుకోవా   || ఆలోచన ||

ఆలోచనలనే ఉపయోగిస్తూ ఐశ్వర్యమే చేసుకోవా
ఆలోచనలనే వినియోగిస్తూ అదృష్టమే చేర్చుకోవా

ఆలోచనలనే అద్భుతంగా మళ్ళించుకోవా
ఆలోచనలనే ఆశ్చర్యంగా మరిపించుకోవా    || ఆలోచన || 

సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా

సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా
సంగీతం పాడెదవా స్వరములను తెలిపెదవా

గమకాల గాన గాంధర్వ గీతములనే శృతించెదవా   || సరిగమలు ||

వేణువుగా శృతించి వేదాలనే పలికెదవా
దరువుగా మెప్పించి చరణాలనే పాడెదవా

తనువుతో శ్వాసించి గేయములనే తలిచెదనా
అరువుతో ధ్యానించి గీతములను తెలిపెదనా    || సరిగమలు ||

చనువుతో అర్పించి స్వరములనే కొలిచెదనా
గురువుతో ఒప్పించి కంఠములనే ఆర్జించెదనా

సత్తువుతో నేర్పించి శృతులనే చేర్చేచెదనా
మధువుతో గర్వించి గానములనే కలిపెదనా   || సరిగమలు || 

Sunday, April 14, 2019

ఓ కాలమా ఏనాడు ఉదయించావో

ఓ కాలమా ఏనాడు ఉదయించావో
ఓ సమయమా ఏనాడు జన్మించావో

క్షణమై ఉదయిస్తూనే సమయమై సాగుతున్నావు
క్షణ క్షణాలుగా సాగుతూనే కాలమై ఎదుగుతున్నావు

నీ కాల సమయంలోనే ఎన్నో కార్యాలు సాగుతున్నాయి
నీ కాల కార్యాలతోనే ఎన్నెన్నో భావాలు మారుతున్నాయి   || ఓ కాలమా ||

జీవిగా జన్మించే సమయం ఎంతటిదో జీవిగా ఎదిగే కాలం ఎంతటిదో
జీవిగా జీవించే సమయం ఎంతటిదో జీవిగా ఒదిగే కాలం ఎంతటిదో

ఎన్నో కార్యాలతో ఎన్నో భావాలు సమయంతో మారుతున్నాయి
ఎన్నో కాలాలతో ఎన్నో తత్వాలు సమయంతో ఎదుగుతున్నాయి   || ఓ కాలమా ||

జీవిగా జీవించే జీవితం కాలంతో సాగే తరతరాల జీవన చదరంగం
జీవిగా జన్మించే విజేతం కాలంతో సాగే యుగయుగాల జనన విధానం

ఎన్నో కార్యాలతో ఎన్నో బంధాలు సమయంతో సాగుతున్నాయి
ఎన్నో కాలాలతో ఎన్నో స్నేహాలు సమయంతో కలుగుతున్నాయి   || ఓ కాలమా || 

Friday, April 5, 2019

నీవే శ్వాసగా నీవే ధ్యాసగా నాలో చేరవా

నీవే శ్వాసగా నీవే ధ్యాసగా నాలో చేరవా
నీవే జీవమై నీవే ధ్యానమై నాలో చేరవా

నీవే వేదమై నీవే జ్ఞానమై నాలో చేరవా
నీవే భావమై నీవే తత్వమై నాలో చేరవా

ఎవరూ లేని చోట ఎవరూ రాని చోట ఏకాంతమై విశ్వమే గమనించావా
ఏదో తెలిసే చోట ఎంతో తలిచే చోట ఆకాశమై జగమే నీవై తిలకించవా   || నీవే ||

శ్వాసలో ఉన్న చలనం ధ్యాసలో ఉన్న గమనం మేధస్సులో చేరేనా
జీవమై ఉన్న దేహం ధ్యానమై ఉన్న దైవం మేధస్సులో చేరేనా

వేదమై ఉన్న వదనం జ్ఞానమై ఉన్న జ్ఞాపకం మేధస్సులో చేరేనా
భావమై ఉన్న బంధం తత్వమై ఉన్న తపనం మేధస్సులో చేరేనా  || నీవే ||

శ్వాసతో కలిగే మౌనం ధ్యాసతో కలిగే మోహం మేధస్సుకు అందేనా
జీవంతో కలిగే చలనం ధ్యానంతో కలిగే గమనం మేధస్సుకు అందేనా

వేదంతో కలిగే వచనం జ్ఞానంతో కలిగే అనుభవం మేధస్సుకు అందేనా
భావంతో కలిగే ప్రేమం తత్వంతో కలిగే మిథునం మేధస్సుకు అందేనా   || నీవే ||

Thursday, April 4, 2019

నీ శ్వాసనై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ

నీ శ్వాసనై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ
నీ ధ్యాసనై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ

నీ భావమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ
నీ తత్వమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ

నీ జీవమై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ
నీ రూపమై ఉన్నానా నిత్యం నీలోనే ప్రభూ

నీ దేహమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ
నీ దైవమై ఉన్నానా సర్వం నీలోనే ప్రభూ   || నీ శ్వాసనై ||

విశ్వమంతా వేదమై జగమంతా దివ్యమై విజ్ఞానంతో సాగుతున్నాను
దేశమంతా నాదమై లోకమంతా విద్యనై సాహసంతో సాగుతున్నాను

సాగరమంతా లక్ష్యమై శిఖరమంతా శ్రద్దనై విజయంతో నిలిచిపోయాను
సమయమంతా దీక్షనై కాలమంతా యజ్ఞమై సహనంతో నిలిచిపోయాను  || నీ శ్వాసనై ||

మేధస్సంతా మౌనమై మోహమంతా లీనమై ఏకాగ్రతతో నిలిచిపోతున్నా
మనస్సంతా భావమై వయస్సంతా తత్వమై పరిశోధనతో నిలిచిపోతున్నా

ప్రయాణమంతా పర్యావరణమై ప్రదేశమంతా పర్యవేక్షణమై సాగుతున్నా
జీవితమంతా విశ్వాలయమై జీవనమంతా విద్యాలయమై సాగుతున్నా      || నీ శ్వాసనై || 

ప్రయాణమా సాగించవా దూరాన్ని

ప్రయాణమా సాగించవా దూరాన్ని
సమయమా అందించవా గమ్యాన్ని

చలనమా నడిపించవా జీవితాన్ని
గమనమా వినిపించవా జీవనాన్ని

ప్రయాణమే నాకు తెలుపుతుంది నాతోటి చలనం
సమయమే నాకు తెలుపుతుంది నాలోని గమనం    || ప్రయాణమా ||

ప్రయాణంతో ప్రతి క్షణం చలనమై జీవితాన్ని సాగించెదను
సమయంతో ప్రతి క్షణం గమనమై జీవనాన్ని సాగించెదను  

దూరమే చేరెదనని నాలోని కాల ప్రయాణమే తెలియజేయును 
గమ్యమే అందేదని నాతోటి కార్య సమయమే తెలియజేయును    || ప్రయాణమా ||

కాలంతో సాగే దూరం ఎంతటిదో వయస్సుకే తెలియును
కార్యంతో సాగే గమ్యం ఎంతటిదో మనస్సుకే తెలియును

దూరాన్ని నడిపించే కాలం ప్రయాణమే సమయానికి చేర్చును
గమ్యాన్ని చేర్పించే కార్యం ప్రయాణమే చలనానికి ఇచ్చును    || ప్రయాణమా ||

ప్రతి జీవిని ప్రశాంతంగా ఉంచెదవా పర జీవమా

ప్రతి జీవిని ప్రశాంతంగా ఉంచెదవా పర జీవమా
ప్రతి జీవిని స్నేహంతో చూసెదవా పర ప్రాణమా

ప్రతి జీవిలో ఉన్నది ఒకే జీవ బంధం
ప్రతి ప్రాణిలో ఉన్నది ఒకే ఆకలి వేదం

ప్రతి జీవి శ్వాసలో తెలియును ఒక గమనం
ప్రతి జీవి వేదనలో తెలియును ఒక నియమం   || ప్రతి జీవిని ||

జీవించే విధములో ఎన్నో మార్గాల ఏంతో సహనం
జీవించే వైనములో ఎన్నో వేదాల ఎంతో వేదాంతం (విజ్ఞానం )

జీవించుట ప్రతి జన్మకు తెలిసిన కాల సిద్ధాంతం
జీవించుట ప్రతి ప్రాణికి తెలిసిన విజ్ఞాన శాస్త్రీయం   || ప్రతి జీవిని ||

జీవించు కాల సమయాన నియమాలను పాఠించుట ఒక శాస్త్ర విజ్ఞానం
జీవించు కాల ప్రమాణమున సిద్ధాంతాలను ఆదరించుట ఒక వేద సారాంశం

జీవించుటలోనే ఎన్నో జీవ వేదాల పురాణాల పరమార్థం
జీవించుటలోనే ఎన్నో జీవ శాస్త్రాల సాంకేతిక నైపుణ్యార్థం   || ప్రతి జీవిని ||

వినబడుతుందా యదలోని గమనం

వినబడుతుందా యదలోని గమనం
కనబడుతుందా మదిలోని చలనం
తడబడుతుందా మనలోని మౌనం

నిశ్చలమే లేని మానవ హృదయం
మేధస్సుకే తెలిసిన నిత్య గమనం
దేహంలో కలిగే శాస్త్రీయ సిద్ధాంతాల నియమం  || వినబడుతుందా ||

జీవించుట ఒక తపనం చలించుట ఒక కార్యం
భరించుట ఒక మౌనం ధరించుట ఒక శాస్త్రం

గమనించుట ఒక సిద్ధాంతం గ్రహించుట ఒక యోగం
వినిపించుట ఒక శాస్త్రీయం నడిపించుట ఒక భోగం     || వినబడుతుందా ||

ఆచరించుట ఒక నియమం ఆకర్షించుట ఒక నాదం
సందర్శించుట ఒక చలనం స్మరించుట ఒక వేదం

దీవించుట ఒక ఆశయం సాధించుట ఒక కర్తవ్యం
ఆశ్రయించుట ఒక సహాయం ఆదేశించుట ఒక కావ్యం   || వినబడుతుందా || 

దూరం అంటే దూరం ఆహా ఎంత దూరం

దూరం అంటే దూరం ఆహా ఎంత దూరం
దూరం అంటే దూరం ఓహో ఎంతో దూరం

దూరంగానే ఉంది మహా మౌనంతో చూస్తే
దూరంగానే ఉంది మహా వైనంతో చూస్తే

దూరంగానే ఉన్నా ఎవరూ చూడలేని దూరం
దూరంగానే ఉన్నా ఎవరూ వెళ్ళలేని దూరం    || దూరం ||

తెలియని దూరం తెలుసుకోలేని కొత్త దూరం
తోచలేని దూరం తలుచుకోలేని గొప్ప దూరం  

తపనంతో తడబడుతున్నా నడకలు వేస్తే తెలియదా దూరం
విరహంతో విడిపోతున్నా అడుగులు వేస్తే తెలియదా దూరం   || దూరం ||

కొలతలు వేస్తే తెలియదా ఎంతైనా తెలుసుకునే దూరం
పరుగులు వేస్తే తోచదా ఎంతైనా అందుకునే దూరం

విజ్ఞానం తెలుపదా కొలతల గణాంకాల దూరం
అనుభవం తెలుపదా అంచనాల సాహసాల దూరం  || దూరం ||

స్నేహ బంధాలు తెలుపవా మన సిద్ధాంతాల దూరం
ప్రేమ బంధాలు తెలుపవా మన శాస్త్రీయాల దూరం

పరిశోధనలు తెలుపవా శ్రమించిన ప్రతి ఫలాల దూరం
అన్వేషణలు తెలుపవా గడించిన కాల సమయాల దూరం  || దూరం ||

ప్రయాణించినా సమయం తెలుపదా గమ్యం ఎంతో దూరం
వేచియున్నా ఆయుస్సు తెలుపదా మరణం ఎంతో దూరం

జీవించిన శ్రేయస్సుకు తోచదా జీవితం ఎంతో దూరం
విహరించిన వయస్సుకు తోచదా జీవనం ఎంతో దూరం  || దూరం ||

సాగలేని దూరాన్ని సాగించేను ఓ మహా జీవం
నడవలేని దూరాన్ని నడిపించేను ఓ గొప్ప బంధం

వెళ్ళలేని దూరాన్ని చేర్చేను గమ్యం ఓ మహా కార్యం
తోచలేని దూరాన్ని చేర్చేను మోక్షం ఓ మహా యజ్ఞం   || దూరం ||