Monday, May 27, 2019

విశ్వమై ప్రతి అణువునే అన్వేషిస్తున్నా నా స్నేహమా

విశ్వమై ప్రతి అణువునే అన్వేషిస్తున్నా నా స్నేహమా
జగమై ప్రతి పరమాణువునే పరిశోధిస్తున్నా నా ప్రేమమా

ప్రకృతినై ప్రతి ఆకృతినే శాస్త్రీయ సిద్ధాంతంతో పర్యవేక్షిస్తున్నా నా మిత్రమా  || విశ్వమై ||

విశ్వ జగతికి నీడనై నిత్యం నేనే ఉంటున్నా
విశ్వ ప్రకృతికి ఛాయనై సర్వం నేనే దాగున్నా

అణువుగానే నీడనై విశ్వంలోనే ఆకృతిగా ఇమిడిపోయి ఉన్నా
పరమాణువుగా ఛాయనై జగంలోనే రూపతిగా ఇంకిపోయి ఉన్నా

అణువుగానే నా స్వరూపం అంతరించి పోదని ప్రకృతినై ఎదుగుతున్నా
పరమాణువుగానే నా ఆకారం అస్తమించి పోదని ఆకృతినై ఒదుగుతున్నా  || విశ్వమై ||

దివ్య జగతికి ఆకృతినై నిత్యం నేనే వెలసి ఉన్నా
దివ్య ప్రకృతికి రూపతినై సర్వం నేనే విరసి ఉన్నా

అణువుగానే నా అన్వేషణ విశ్వమందే సాగుతుందని నిలిచివున్నా
పరమాణువుగానే నా పరిశోధన జగమందే సాగుతుందని తలిచివున్నా

అణువులన్నీ ఒకటిగా ఆకారమై విశ్వాన్ని నడిపిస్తుందని ప్రయాణిస్తున్నా
పరమాణువులన్నీ ఒకటిగా స్వరూపమై జగాన్ని నడిపిస్తుందని వ్యాపిస్తున్నా  || విశ్వమై || 

No comments:

Post a Comment