Thursday, August 31, 2017

మరణమిదే మనస్సు తలచిన సమయమిదే

మరణమిదే మనస్సు తలచిన సమయమిదే
మేధస్సుకే తెలిసి తెలియని భావ తత్వమిదే

జీవమిదే శ్వాస తపించిన ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ఇదే
దేహమిదే హృదయం తెలిపే పర ధ్యాన గమనమిదే   || మరణమిదే ||

ఏనాడో జన్మించిన కాలం మరణాన్నే మరచిన సమయం ఏదో
ఏనాడో తలచిన మరణం ఏనాటికో తెలియని సందర్భం ఏదో

జీవించే శ్వాసపై ధ్యాసతో గమనమై జీవించేస్తున్నా
తపించే హృదయమే ధ్యాన గమ్యమై ప్రయాణిస్తున్నా   || మరణమిదే ||

తెలియనివి ఎన్నో తెలియుట కొరకే తపనమే సాగుతున్నది
తెలిసినవి ఎన్నో తెలుపుట కోసమే తరుణమే వెళ్ళుతున్నది

ఎన్నెన్నో నేర్చిన వన్నీ మరణ సమయాన్ని తపించలేదే
ఎన్నెన్నో మరచిన వన్నీ మరణ భావత్వాన్ని తెలుపలేదే   || మరణమిదే || 

విశ్వ దంతాయ నమః

విశ్వ దంతాయ నమః
వేద విజ్ఞానాయ నమః

సర్వ లోకాయ నమః
భావ తత్వయ నమః

పూర్ణ చంద్రాయ నమః
సూర్య కాంతాయ నమః

సత్య ధర్మాయ నమః
నిత్య దైవాయ నమః

దివ్య రూపాయ నమః
విద్య నాదాయ నమః

జగతి పూజ్యంతాయా నమః
జనని మాతృత్వాయ నమః

ఆత్మ పరమాత్మాయ నమః
రామ పరంధామాయ నమః

శ్రీరస్తు శుభమస్తాయ నమః
శ్రీధరణి కళ్యాణాయ నమః 

Tuesday, August 29, 2017

నీతో జీవిస్తే పాపం పంచుకోనా

నీతో జీవిస్తే పాపం పంచుకోనా
నాతో జీవిస్తే పాపం కడిగించేనా
నీవే వచ్చేస్తే పాపం ధరించేనా
నేనే వచ్చేస్తే పాపం తొలగించేనా   || నీతో జీవిస్తే ||

నీవే నన్ను కొలిస్తే పాపం కరిగేనా
నీవే నన్ను పిలిస్తే పాపం తరిగేనా
నీవే నన్ను తపిస్తే పాపం వదిలేనా
నీవే నన్ను స్మరిస్తే పాపం విడిచేనా
నీవే నన్ను ధరిస్తే పాపం ప్రకాశమేనా    || నీతో జీవిస్తే ||

నీవే నన్ను పూజిస్తే పాపం అంతమేనా
నీవే నన్ను ఆచరిస్తే పాపం పుణ్యమేనా
నీవే నన్ను ధ్యానిస్తే పాపం దహనమేనా
నీవే నన్ను ఆరాధిస్తే పాపం శూన్యమేనా  
నీవే నన్ను గమనిస్తే పాపం అదృశ్యమేనా   || నీతో జీవిస్తే || 

Monday, August 28, 2017

మర్మం మంత్రం తంత్రం యంత్రం మేధస్సుకే

మర్మం మంత్రం తంత్రం యంత్రం మేధస్సుకే
భావం తత్వం వేదం జ్ఞానం మానవుని మేధస్సుకే

మర్మం మంత్రం తంత్రం యంత్రం దేహానికే
భావం తత్వం వేదం జ్ఞానం మానవుని దేహానికే  || మర్మం ||

భావం మర్మం తత్వం మంత్రం వేదం తంత్రం యంత్రం జ్ఞానం దేహానికే
విశ్వం విజ్ఞానం జగం ప్రజ్ఞానం లోకం సర్వజ్ఞం ప్రపంచం సత్యజ్ఞం మేధస్సుకే

జీవం దైవం సత్యం నిత్యం దేహానికే
కాలం రూపం ధర్మం గుణం మేధస్సుకే   || మర్మం ||

క్రియం కర్మం కర్తం భాష్పం దేహానికే
సర్వం శాంతం సుఖం శుభం దేహానికే

క్షణం భారం ఆలోచనం అర్థం మేధస్సుకే
లక్షణం ప్రవర్తనం మార్గం ప్రయాణం మేధస్సుకే   || మర్మం || 

Friday, August 25, 2017

ఓం శ్రీ గణా దిశాయ నమః

ఓం శ్రీ గణా దిశాయ నమః
ఓం శ్రీ గణా దశాయ నమః
ఓం శ్రీ గణా దేశాయ నమః
ఓం శ్రీ గణా ధరాయ నమః
ఓం శ్రీ గణా ధీరాయ నమః
ఓం శ్రీ గణా దైవాయ నమః
ఓం శ్రీ గణా దొరాయ నమః
ఓం శ్రీ గణా దేహాయ నమః
ఓం శ్రీ గణా దీపాయ నమః
ఓం శ్రీ గణా దత్తాయ నమః
ఓం శ్రీ గణా ధారాయ నమః
ఓం శ్రీ గణా ధాతాయ నమః
ఓం శ్రీ గణా దాతాయ నమః
ఓం శ్రీ గణా ధ్వనీయ నమః
ఓం శ్రీ గణా దిక్కాయ నమః
ఓం శ్రీ గణా దీటాయా నమః
ఓం శ్రీ గణా ధైర్యాయ నమః
ఓం శ్రీ గణా ధర్మాయ నమః
ఓం శ్రీ గణా దివ్యాయ నమః
ఓం శ్రీ గణా ధాత్రాయ నమః
ఓం శ్రీ గణా దృష్టాయ నమః
ఓం శ్రీ గణా ధృవాయ నమః
ఓం శ్రీ గణా ధూపాయ నమః
ఓం శ్రీ గణా దండాయ నమః
ఓం శ్రీ గణా దృశ్యాయ నమః
ఓం శ్రీ గణా దంతాయ నమః
ఓం శ్రీ గణా ధ్యానాయ నమః
ఓం శ్రీ గణా ధ్యాసాయ నమః
ఓం శ్రీ గణా ధరణాయ నమః
ఓం శ్రీ గణా ద్వారాయ నమః
ఓం శ్రీ గణా దక్షణాయ నమః
ఓం శ్రీ గణా దీక్షణాయ నమః
ఓం శ్రీ గణా ధీషణాయ నమః

Thursday, August 24, 2017

నిజం భీజం నైజం ధ్వజం - శివాయే నమః

వర్ణం పూర్ణం కర్ణం చూర్ణం - శివాయే నమః
నిజం భీజం నైజం ధ్వజం - శివాయే నమః
పత్రం గాత్రం సత్రం ఆత్రం - శివాయే నమః
సర్వం పూర్వం గర్వం శర్వం - శివాయే నమః
ధర్మం మర్మం కర్మం కూర్మం - శివాయే నమః
సాగరం నగరం తగరం వగరం - శివాయే నమః
పూజ్యం రాజ్యం ఆజ్యం భాజ్యం - శివాయే నమః
స్నేహం దేహం మోహం దాహం - శివాయే నమః
ఆకృతి ప్రకృతి శ్రీకృతి స్వీకృతి - శివాయే నమః
చరితం పరితం సరితం గరితం - శివాయే నమః
కవితం సవితం పవితం జీవితం - శివాయే నమః
మరణం కారణం కరణం వరణం - శివాయే నమః
చదరం అదరం పదరం వదరం - శివాయే నమః
సత్యం నిత్యం ముత్యం నృత్యం  - శివాయే నమః
చరణం దరణం పురణం తోరణం - శివాయే నమః
వీక్షణం లక్షణం దీక్షణం పక్షణం - శివాయే నమః
ఆకారం సుకారం మకారం నకారం - శివాయే నమః
సుజనం ప్రజనం తజనం రజనం - శివాయే నమః
వదనం మదనం వేదనం పదనం - శివాయే నమః
కదనం సోదనం వాదనం అదనం - శివాయే నమః
శాంతం కాంతం ప్రాంతం అంతం - శివాయే నమః
లలితం ఫలితం జలితం వలితం - శివాయే నమః
భువనం సువనం నవనం జవనం - శివాయే నమః
భరణం స్మరణం వరణం సురణం - శివాయే నమః
జీవనం పావనం భావనం సువనం - శివాయే నమః
గోపురం త్రిపురం సుపురం జైపురం - శివాయే నమః
పునీతం సునీతం వనీతం జనీతం - శివాయే నమః
పతనం సుతనం మతనం రతనం - శివాయే నమః
అభిష్టం సుభిష్టం నభిష్టం వభిష్టం - శివాయే నమః
సురాగం స్వరాగం పరాగం శ్రీరాగం - శివాయే నమః
దక్షణం సుక్షణం ప్రక్షణం తక్షణం - శివాయే నమః
శ్రీకారం ప్రకారం స్వకారం స్వీకారం - శివాయే నమః
శోధనం బోధనం యోధనం వేధనం - శివాయే నమః
రక్షణం మోక్షణం యక్షణం నీక్షణం - శివాయే నమః
ఆహారం విహారం మోహారం సుహారం - శివాయే నమః
ప్రదానం నిదానం సుదానం చిదానం - శివాయే నమః
కమలం విమలం తమలం శ్యామలం - శివాయే నమః
తరంగం సురంగం పరంగం వరంగం - శివాయే నమః
త్రీనేత్రం సునేత్రం పనేత్రం జనేత్రం - శివాయే నమః
పతంగం తతంగం సుతంగం మతంగం - శివాయే నమః
గుణింతం గణింతం మణింతం పణింతం - శివాయే నమః
చందనం వందనం కుందనం అందనం - శివాయే నమః 

శ్రీ గణేశాయ నమః శివాయ నమః

శ్రీ గణేశాయ నమః శివాయ నమః
శ్రీ గణపతేయ నమః శివాయ నమః
శ్రీ గజేంద్రాయ నమః శివాయ నమః

శ్రీ గురేశాయ నమః శివాయ నమః
శ్రీ గుణేశాయ నమః శివాయ నమః

శ్రీ గౌరీయ నమః శివాయ నమః
శ్రీ గౌరవాయ నమః శివాయ నమః

శ్రీ విజ్ఞేశ్వరాయ నమః శివాయ నమః
శ్రీ విద్యేశ్వరాయ నమః శివాయ నమః

శ్రీ విచక్షణాయ నమః శివాయ నమః
శ్రీ విజేంద్రాయ నమః శివాయ నమః

శ్రీ సర్వేంద్రాయ నమః శివాయ నమః
శ్రీ సర్వాంతరాయ నమః శివాయ నమః 

నేను ఎవరో నీవు ఎవరో ఎవరు ఎవరిని ఏమని తలచేది

నేను ఎవరో నీవు ఎవరో ఎవరు ఎవరిని ఏమని తలచేది
నేను ఎవరో నీవు ఎవరో ఎవరికి ఎవరు ఏమని స్మరించేది
నేను ఎవరో నీవు ఎవరో ఎవరితో ఎవరు ఏమని అర్పించేది  || నేను ||

నీవు నేను ఒకటిగా తలచినా కాలంతో ఎవరు స్మరించేది
నీవు నేను ఒకటిగా తపించినా భావంతో ఎవరు వరించేది
నీవు నేను ఒకటిగా తెలిపినా వేదంతో ఎవరు స్వీకరించేది  || నేను ||

నీవే నేనై ఒకటిగా దేహమై స్మరించినా నిత్యం ఎవరు వహించేది
నీవే నేనై ఒకటిగా ధర్మమై వరించినా సత్యం ఎవరు అర్పించేది  
నీవే నేనై ఒకటిగా దైవమై తపించినా సర్వం ఎవరు తిలకించేది  || నేను ||

Wednesday, August 23, 2017

నిద్రించలేదు ఎన్నడూ మరవలేదు ఎప్పుడూ

నిద్రించలేదు ఎన్నడూ మరవలేదు ఎప్పుడూ
మరణించలేదు ఎన్నడూ అస్తమించలేదు ఎప్పుడూ

భావాలతోనే స్మరిస్తున్నా జ్ఞాపకాలతోనే  జీవిస్తున్నా ఎల్లప్పుడూ
తత్వాలతోనే స్పర్శిస్తున్నా వేదాలతోనే గమనిస్తున్నా ఎల్లప్పుడూ   || నిద్రించలేదు ||

రూపంతోనే ఉదయిస్తున్నా దేహంతోనే ధ్యానిస్తున్నా
జ్ఞానంతోనే విశ్వసిస్తున్నా దైవంతోనే ప్రయాణిస్తున్నా

శ్వాసతోనే తపిస్తున్నా ధ్యాసతోనే పరిశోధిస్తున్నా
కోరికతోనే శ్రమిస్తున్నా ఎరుకతోనే విలపిస్తున్నా   || నిద్రించలేదు ||

కాలంతోనే సమర్పిస్తున్నా జీవంతోనే అర్పిస్తున్నా
వర్ణంతోనే నివసిస్తున్నా ప్రాయంతోనే వచ్చేస్తున్నా

విశ్వతితోనే గడిపేస్తున్నా జగతితోనే విహరిస్తున్నా
జనతితోనే పనిచేస్తున్నా ప్రకృతితోనే ఎదిగేస్తున్నా  || నిద్రించలేదు ||

మర్మం నాదే మంత్రం నాదే

మర్మం నాదే మంత్రం నాదే
తంత్రం నాదే యంత్రం నాదే

జీవం నాదే రూపం నాదే
దేహం నాదే దైవం నాదే  || మర్మం ||

రహస్యంతో మర్మమే మదించాను విజ్ఞానంతో మంత్రమే మలిచాను
వేదంతో తంత్రమే తలిచాను అధ్యాయంతో యంత్రమే అర్పించాను

రూపమే మర్మంగా మలిచాను భావమే మంత్రంగా కొలిచాను
తత్వమే తంత్రంగా తలిచాను దేహమే యంత్రంగా వలిచాను  || మర్మం ||

జీవమే ఆత్మ పర మర్మం రూపమే వేద పర మంత్రం
భావమే జ్ఞాన పర తంత్రం దేహమే స్వర పర యంత్రం

బంధమే పర జ్ఞాన మర్మం వర్ణమే పర ధ్యాన మంత్రం
తత్వమే పర వేద తంత్రం దేహమే పర దైవ యంత్రం  || మర్మం || 

ఉదయిస్తూనే ప్రయాణిస్తున్నావా సూర్యదేవా

ఉదయిస్తూనే ప్రయాణిస్తున్నావా సూర్యదేవా
గమనిస్తూనే ఉదయిస్తున్నావా సూర్య తేజా
స్మరిస్తూనే ప్రకాశిస్తున్నావా సూర్యభావా

ప్రజ్వలంతో ప్రతేజమై ప్రకాశిస్తూ ఉదయిస్తూనే ప్రయాణిస్తున్నావా  || ఉదయిస్తూనే ||

ధర్మమే నీదని సత్యమే నీవని నిత్యం జీవిస్తున్నావా
భావమే నీదని తత్వమే నీవని సర్వం స్మరిస్తున్నావా
వేదమే నీదని జ్ఞానమే నీవని శాశ్వితం ధ్యానిస్తున్నావా
దైవమె నీదని దేహమే నీవని సమస్తం గమనిస్తున్నావా   || ఉదయిస్తూనే ||

జీవమై ఉన్నావో ధ్యాసతో ఉన్నావో ధర్మమే తెలిపేనా
వర్ణమై ఉన్నావో రూపంతో ఉన్నావో సత్యమే తెలిపేనా
భావమై ఉన్నావో తత్వంతో ఉన్నావో వేదమే తెలిపేనా
దైవమై ఉన్నావో దేహంతో ఉన్నావో జ్ఞానమే తెలిపేనా    || ఉదయిస్తూనే || 

ఏనాటిదో సూర్యోదయం జగతికే పూజ్యోదయం

ఏనాటిదో సూర్యోదయం జగతికే పూజ్యోదయం
ఎప్పటిదో సర్వోదయం విశ్వతికే పూర్ణోదయం
ఎంతటిదో స్వర్ణోదయం జనతికే పూర్వోదయం   || ఏనాటిదో ||

ఏనాటివరకో తెలియని ఉదయం అస్తమిస్తున్నా మరో సమయం ఉదయం
ఎప్పటివరకో తెలియని గమనం నిద్రిస్తున్నా మెళకువతో జ్ఞాపకాల గమనం
ఎంతవరకో తెలియని మననం మర్పిస్తున్నా కార్యాలతో ఆలోచనల మననం  || ఏనాటిదో ||

ఏనాటివరకో తేజోదయం ఏమని ప్రకాశించేనో మహోదయం
ఎప్పటివరకో నవోదయం ఎంతని ధ్వనించేనో భావోదయం
ఎంతటివరకో వర్ణోదయం ఏదని విస్తరించేనో సర్వోదయం   || ఏనాటిదో ||

ఓ సూర్యదేవా ఓ మహాదేవా సర్వము నీవే

ఓ సూర్యదేవా ఓ మహాదేవా సర్వము నీవే
ఓ సూర్యతేజా ఓ మహాతేజా నిత్యము నీవే

పూజ్యోదయమై సూర్యోదయమై ఉదయిస్తున్నావు
పూర్ణోదయమై సర్వోదయమై విస్తరించేస్తున్నావు
పూర్వోదయమై స్వర్ణోదయమై ప్రయాణిస్తున్నావు   || ఓ సూర్యదేవా ||

విశ్వమున నీవు లేనిచో జీవమే లేదని అణువైనను శ్వాసతో ఉండదని భావించావులే

నీవు ఉదయించుటలో అనంత పుష్పములచే సుగంధాలను వెదజల్లుతున్నాను
నీవు విస్తరించుటలో సర్వ ప్రకృతి పర్యావరణాన్ని పరిశుద్ధంగా మార్చుతున్నాను
నీవు ప్రయాణించుటలో నిత్య జగతి స్వభావాలను పరిశోధనతో ఓదార్చుతున్నాను  || ఓ సూర్యదేవా ||

విశ్వమున నీవు లేనిచో మేధస్సుకు ఉత్తేజమే లేదని కార్యాలకే తెలిసేలా స్మరించావులే

అనంత జీవులకు సర్వము నీవే సమ భావాలతో సమర్పిస్తున్నావు
అనంత రూపాలకు సర్వము నీవే సమ తత్వాలతో సహకరిస్తున్నావు
అనంత దేహాలకు సర్వము నీవే సమ బంధాలతో సందర్శిస్తున్నావు   || ఓ సూర్యదేవా || 

Tuesday, August 22, 2017

ఓ మహాదేవా ఓ మహదేశ్వరా

ఓ మహాదేవా ఓ మహదేశ్వరా
ఓ పరమాత్మా ఓ పరంధామా
ఎవరిని ఎలా చూసేదవో ఎవరిని ఎప్పుడు తలచెదవో  || ఓ మహాదేవా ||

నీవే ఉన్నావని తెలియదు నీవే లేవని తోచుటలేదు
నీవే ఉంటావని తెలియదు నీవే వస్తావని తపనలేదు

నీకై ఎందరో తపిస్తున్నా నీవే ఉన్నావని కరుణించలేదు
నీకై ఎందరో ఆలపిస్తున్నా నీవే ఉంటావని కనిపించలేదు  || ఓ మహాదేవా ||

కొలిచిన వారికి సౌభాగ్యము కొలవని వారికి వైభోగము
తలచిన వారికి సంతోషము తపించని వారికి ఆనందము

కొలవకున్నను నీవే తలచెదవో తపించకున్నను నీవే మలిచెదవో
కోరికలను నీవే కొన్నైనను తీర్చెదవో తపనను నీవే కలిగించెదవో    || ఓ మహాదేవా ||

ఎవరిని ఏమని తలిచేది ఎంతని ఎవరిని కొలిచేది

ఎవరిని ఏమని తలిచేది ఎంతని ఎవరిని కొలిచేది
ఎవరిని ఏమని వలచేది ఎంతని ఎవరిని మలిచేది

తెలియని భావం తెలిసిన స్వప్నం తెలియక సజీవం
తోచని రూపం తెలుపని వేదం తెలిపేదే సహృదయం  || ఎవరిని ||

ఎవరో మలచిన రూపం ఎవరికో తెలియని వర్ణం
ఎవరో వలచిన భావం ఎవరికో తెలిసిన సువర్ణం

ఎవరో తలచిన దేహం ఎవరికో తెలపని సుగంధం
ఎవరికి ఎవరో ఏమని తపించిన తెలియదు బంధం  || ఎవరిని ||

ఎవరిదో రూపం ఎవరిదో బంధం ఎవరికి ఎవరో అనుబంధం
ఎవరిదో స్వప్నం ఎవరిదో భావం ఎవరికి ఎవరో అనుస్వారం

ఏమని కోరిన ఎంతని ఓర్చిన ఏదని కలగదే అనుపథం
ఏమని వాల్చిన ఎంతని వేచిన లేదని అలగదే అనురాగం  || ఎవరిని || 

Monday, August 21, 2017

శిల్పమా నవ రూపమా తేజమే నీ మౌనమా

శిల్పమా నవ రూపమా తేజమే నీ మౌనమా
శిల్పమా నవ భావమా వర్ణమే నీ స్వప్నమా

కలలకే రూపమా కన్నులకే మహా అందమా
కవితలకే భావమా కవులకే మహా ఆనందమా   || శిల్పమా ||

వయస్సుకే వయ్యారామా మనస్సుకే శృంగారమా
ఉషస్సుకే ఉత్కంఠమా మేధస్సుకే మాధుర్యమా

సొగసుకే సోయగమా నాదానికే నయగారమా
ఉన్నతికే ఔదార్యమా సరసానికే సౌందర్యమా  || శిల్పమా ||

మాటలకే మందారమా మౌనానికే మనోహరమా
సువర్ణాలకే సౌఖ్యమా సుగంధాలకే సుందరమా

బంధాలకే సౌభాగ్యమా రాగాలకే రమణీయమా
భావాలకే అతిశయమా అందాలకే ఆనందమా  || శిల్పమా ||

భావమా అపురూపమా బంధమా అనురాగమా

భావమా అపురూపమా బంధమా అనురాగమా
రూపమా అనుబంధమా వర్ణమా అతిశయమా

జీవులకే స్వభావమా మేధస్సులకే మోహమా
వేదాలకే సువర్ణమా బంధాలకే స్వరూపమా   || భావమా ||

ఎవరో మలచిన శిల్పం ఎవరో తిలకించిన వర్ణం
ఎందరో దాల్చిన వర్ణం ఎందరో వర్ణించిన శిల్పం

ఎవరికో కలిగిన స్వప్నం ఎవరో మలచిన రూపం
ఎవరికో తెలిసిన భావం ఎవరో వహించిన దేహం  || భావమా ||

ఏమని కలిగిన భావం ఎవరికో తోచిన స్వరూపం
ఏమని తెలిసిన రూపం ఎవరికో కోరిన సుందరం

ఎంతని వర్ణించిన దేహం ఏదని తపించిన భావం
ఎంతని వహించిన రూపం ఏదని ధరించిన వర్ణం  || భావమా || 

ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...

ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...
ఓ శివ .. శివ శంకరా .. నీ స్వర మహదేశ్వరా ...
శివ శివ .. శివ శంకరా .. నీవే లోకానికి జీవేశ్వరా ..   || ఓ శివ .. ||

నీ శ్వాసలో ఏకమై నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే గమనిస్తున్నా
నీ ధ్యాసలో లీనమై నీ పర ధ్యాన స్వభావాలనే తిలకిస్తున్నా

నీ లయలో గానమై నీ స్వర శృతులనే తపిస్తున్నా
నీ స్వరలో గాత్రమై నీ శృతి స్వరాలనే జపిస్తున్నా   || ఓ శివ .. ||

నీ జీవమే విశ్వానికి భావమై నీ స్వరానికే ధ్యానమై వినిపిస్తున్నా
నీ ప్రాణమే జగతికి స్వభావమై నీ లయకే వేదమై ఆలపిస్తున్నా

నీ రూపమే మౌనమై లోకానికే శాంతమై నీ రాగమే వహిస్తున్నా
నీ దేహమే వర్ణమై దైవానికే ప్రశాంతమై నీ వరమే ధరిస్తున్నా   || ఓ శివ .. || 

Thursday, August 17, 2017

మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం

మరవలేను జ్ఞాపకాలలో నీ మహోత్సవం
మరచిపోలేను గమనాలలో నీ వైభవోత్సవం
అంగరంగ వైభోగమే నీ కళ్యాణ బ్రంహోత్సవం

జగతికి మహా ఉత్సవం విశ్వతికి మహా దైవోత్సవం
ప్రకృతికి మహా సంతోషం జనతికి మహా ఆనందం  || మరవలేను ||

గమనించలేదు నీ భావాలను ఇంతకు ముందెన్నడు
తపించలేదు నీ స్వభావాలను ఇంతకు ముందెన్నడు

వినిపించలేదు నీ స్వరాలు ఇంతకు ముందెన్నడు
కనిపించలేదు నీ తత్వాలు ఇంతకు ముందెన్నడు  || మరవలేను ||

భవిష్య కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా గొప్పదనం
రాబోయే కాలాన ఏమున్నదో ఇంతకన్నా మహా అద్భుతం

తరతరాలుగా సాగే కళ్యాణ రథోత్సవ ఉత్సవం విశ్వతికి మహా బ్రంహోత్సవం
యుగయుగాలుగా సాగే వైభోగ మహోత్సవ సర్వోత్సవం జగతికి మహా శుభోత్సవం  || మరవలేను || 

ఎక్కడికో నీ భావన ఎందాకో నీ స్వభావన

ఎక్కడికో నీ భావన ఎందాకో నీ స్వభావన
తెలియని ప్రయాణమై తెలుసుకో ఎందుకో

ఎవరితో నీ వేదన ఎక్కడో నీ తపన
గమనమే సాధనగా గమ్యమే చేరుకో   || ఎక్కడికో ||

ఎక్కడైనా ఆచరణగా నడిచిపో ఆదరణగా మిగిలిపో
ఎప్పుడైనా ఆవేదనగా నిలిచిపో ఆవరణగా ఉండిపో

ఏనాటికైనా కార్యాచరణ కార్యాదరణగా సాగించుకో
ఎప్పటికైనా కార్యావేదన కార్యావరణగా నిలుపుకో    || ఎక్కడికో ||

ఏ కార్యమైనా మూలమే ఆధారణంగా గమనిస్తూ సాగిపో
ఏ భావమైన స్వభావమే సాధారణంగా ధ్యానిస్తూ వెళ్ళిపో

ఎవరితో ఏ భావమైన అధ్యాయంగా అనుభవంతో తెలుసుకో
ఎవరితో ఏ తత్వమైన ఆద్యంతంగా అణుకువతో తెలుపుకో    || ఎక్కడికో ||

Wednesday, August 16, 2017

లక్ష్మి ప్రదం సర్వ సిద్ధం

లక్ష్మి ప్రదం సర్వ సిద్ధం
లక్ష్మి కాంతం పూర్ణ తేజం
లక్ష్మి భావం వేద వచనం
లక్ష్మి కనకం దివ్య పూజ్యం
లక్ష్మి రూపం శుభ ప్రభావం
లక్ష్మి కార్యం మహా కాంచనం
లక్ష్మి తత్వం సర్వ మంగళం
లక్ష్మి కాటాక్షం విశ్వ మోక్షనం 

జగమే తెలిపిన మాటలలోనే భావాలెన్నో ఉదయిస్తున్నా

జగమే తెలిపిన మాటలలోనే భావాలెన్నో ఉదయిస్తున్నా
విశ్వమే తెలిపిన రాగాలలోనే వేదాలెన్నో పలికిస్తున్నా
భావాలే వేదాలుగా మన జ్ఞాపకాలనే జ్ఞానంగా వర్ణిస్తున్నా  || జగమే ||

శుభమే శోభనమై ఉదయిస్తున్నది సూర్య తేజం
శకునమే శరణమై శోభిల్లుతున్నది సూర్య కిరణం

చరణమే మూలాధారమై ప్రయాణిస్తున్నది కాలం
గమనమే స్వధారణమై ప్రదర్శిస్తున్నది విజ్ఞానం  || జగమే ||

కమలమే ప్రకృతి వలయమై పవళిస్తున్నది జగతి తత్వం
సరళమే విశ్వతి వృత్తమై ఆవహిస్తున్నది జగతి స్వభావం

విజ్ఞానమే విశ్వ మార్గమై సహజత్వం పులకిస్తున్నది నేస్తం
వేదాంతమే విశ్వ గీతమై దివ్యత్వం ప్రబలిస్తున్నది జీవం  || జగమే || 

నీ లోనే నేనున్నానని తలచెదను

నీ లోనే నేనున్నానని తలచెదను
నా లోనే నీవున్నావని తపించెదను

నీ కోసమే నేనున్నానని పలికెదను
నా కోసమే నీవున్నావని పిలిచెదను  || నీ లోనే ||

నీకు నేనే ప్రాణమై భావాలతో జీవిస్తున్నా  
నీకు నేనే జీవమై వేదాలతో నడిచేస్తున్నా

నీకు నేనే బంధమై అనురాగాలతో ప్రయాణిస్తున్నా
నీకు నేనే స్నేహమై అనుబంధాలతో విహరిస్తున్నా   || నీ లోనే ||

నీకు నేనే స్వప్నమై జ్ఞాపకాలతో ఒదిగేస్తున్నా
నీకు నేనే సత్యమై స్మరణాలతో ఎదిగేస్తున్నా

నీకు నేనే ప్రియమై సుగంధాలతో ప్రార్థిస్తున్నా
నీకు నేనే ప్రాయమై సువర్ణాలతో తిలకిస్తున్నా   || నీ లోనే || 

జీవితం చాలని జీవనం సాగుతున్నదా మనలో

జీవితం చాలని జీవనం సాగుతున్నదా మనలో
వేదం చాలని విజ్ఞానం సాగుతున్నదా మనలో
తెలుసుకో ఒక రూపమై తెలుపుకో ఒక ఆత్మవై   || జీవితం ||

శరీరానికి కదలిక చాలని  
దేహానికి ఆహారం చాలని
ఆలోచనకు విజ్ఞానం చాలని

కాలమే తెలిపేను ఏదైనా కొంతవరకే చాలని   || జీవితం ||

మేధస్సుకు భావనం చాలని
హృదయానికి ప్రసరణ చాలని
వయస్సుకు అనుభవం చాలని

సమయమే తలచేను ఎంతైనా కొంతవరకే చాలని   || జీవితం || 

ఏ మంత్రం వేశానో విశ్వానికి

ఏ మంత్రం వేశానో విశ్వానికి
ఏ తంత్రం పంచానో జగతికి
ఏ యంత్రం ఇచ్చానో దేహానికి
తెలియని మర్మమై మేధస్సులోనే వరించినది ఓ కాలమా!   || ఏ మంత్రం ||

శూన్య భావముతో విశ్వాన్ని మహా మంత్రంచే తలచాను
పూర్ణ స్వభావముతో జగతిని మహా తంత్రంచే తపించాను
మంగళ తత్వముచే దేహాన్ని మహా యంత్రంచే కొలిచాను  || ఏ మంత్రం ||

మంత్రమన్నది మేధస్సుకు కార్యాచరణగా సాగే పరిశీలన
తంత్రమన్నది ఆలోచనకు కార్యాదరణగా సాగే పరిశోధన
యంత్రమన్నది భావనకు కార్యావరణగా సాగే ప్రతిస్పందన  || ఏ మంత్రం || 

ప్రజ్వలమై ఉదయించే సూర్య తేజత్వమా

ప్రజ్వలమై ఉదయించే సూర్య తేజత్వమా
మహోజ్వలమై ప్రకాశించే సూర్య కిరణమా

కాలంతో ప్రయాణించే మహా విజ్ఞాన రూపమా
సర్వం కార్యాలను సాగించే ఉత్తేజ స్వభావమా  || ప్రజ్వలమై ||

వెలుగే జీవమై తేజమే రూపమై ఉదయిస్తున్నావా
రగిలే ప్రాణమై ప్రకాశమే భావమై ఎదుగుతున్నావా

కాలమే నీ గమనమని క్షణమే నీ ప్రమేయమని తెలుపుతున్నావా
సమయమే నీ కార్యమని భావమే నీ ప్రమోదమని మేలుకొలుపుతున్నావా  || ప్రజ్వలమై ||

జీవులకే జీవమై మేధస్సుకే ఉత్తేజమై కార్యాలను సాగిస్తున్నావా
శ్వాసకు తేజమై ధ్యాసకే ఉత్తేజమై శోభనాలను కొనసాగిస్తున్నావా

విశ్వానికి నీవే అనంతమై జగతికి నీవే పరిమితమై ప్రయాణిస్తున్నావా
లోకానికి నీవే ప్రయుక్తమై ప్రకృతికి నీవే పరిశోధనమై ప్రజ్వలిస్తున్నావా  || ప్రజ్వలమై || 

Tuesday, August 15, 2017

మెళకువ కలిగిన క్షణమే సూర్యోదయమా

మెళకువ కలిగిన క్షణమే సూర్యోదయమా
నిద్రించిన సమయ కాలమే సూర్యాస్తమా

జీవన విధానములో కలిగే మార్పులే ప్రకృతి విరుద్ధమా
సమయం కాని సమయంలో నిద్రించడం ప్రచండమా
సకాలం కాని కాలంలో మెళకువ రావడం ప్రమాదమా     || మెళకువ ||

జీవన విధాన కార్యాల మార్పులలో లోపమా
జీవన విధాన పరిస్థితి ప్రభావాలలో భేదమా  

యాంత్రిక తత్వాలతో సాగే జీవన శైలిలో విభేదమా
సాంకేతిక ప్రజ్ఞానంతో సాగే జీవన శైలిలో విచారమా  || మెళకువ ||

జీవించుటలో మార్పులు ఎన్నో కలుగుట భారమా
జీవించుటలో మార్పులు ఎన్నో చేయుట మోసమా
 
విజ్ఞాన సాధనలో కలిగే ఆటంకాలే జీవన విఫలమా
ప్రజ్ఞాన గమనలో కలిగే అడ్డంకులే జీవిత పరిణామమా  || మెళకువ || 

Monday, August 14, 2017

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస

ఏమిటో నీ ధ్యాస ఏమిటో నీ శ్వాస
తెలియని తొలి ఉచ్చ్వాస తెలుపని తొలి నిచ్ఛ్వాస
తరతరాలుగా సాగే జీవ భావ దేహ ధ్యాన మంత్రమే   || ఏమిటో ||

వేదమై వచ్చిందో విజ్ఞానమై సాగిందో మర్మమై దాగినది మేధస్సులో
గానమై పలికిందో స్వరమై పిలిచిందో భావమై వచ్చినది దేహములో

ఉచ్చ్వాసగా సాగినా నిచ్చ్వాసగా నిలిపినా శ్వాసగా సాగుతున్నది ప్రతి జీవిలో
ఊపిరిగా ఉంటున్నా స్వధ్యాసగా వస్తున్నా శ్వాసగా ఆడుతున్నది ప్రతి జీవిలో  || ఏమిటో ||

భావమై వచ్చిందో స్వభావమై నిలిచిందో మంత్రమై స్మరిస్తున్నది దేహములో
జీవమై వెలసిందో దైవమై ఒదిగిందో తంత్రమై విస్మరిస్తున్నది హృదయములో

ప్రాణంగా ఎదిగినా కాలంతో ఒదిగినా శ్వాసగా జీవిస్తున్నది ప్రతి అణువులో
ప్రాయంగా సాగినా సమయంతో వచ్చినా శ్వాసగా వరిస్తున్నది ప్రతి అణువులో  || ఏమిటో || 

గమనించవా నా శృతి భావాలను

గమనించవా నా శృతి భావాలను
వినిపించవా నా ధృతి స్వరాలను
ధ్వనించవా నా కృతి తత్వాలను ... హరా హరా!  || గమనించవా ||

స్వరం శృతిస్తున్న గానమే గాత్రం
గళం స్మరిస్తున్న గంధర్వమే ఘనం
శుభం పలుకుతున్న శోభనమే శరణం

దేహం జీవిస్తున్న విధానమే దైవం
దైవం వరిస్తున్న స్వభావమే జీవం
జీవం విహరిస్తున్న తత్వమే గానం  || గమనించవా ||

మోహం తపిస్తున్న కాలమే తపనం
సూక్ష్మం జీవిస్తున్న క్షణమే వినయం
దాహం పలికిస్తున్న గానమే గమకం

వేదం తరిస్తున్న విజ్ఞానమే కమలం
భావం ఫలిస్తున్న మేధస్సే మధురం
తత్వం తిలకిస్తున్న దేహమే తన్మయం  || గమనించవా || 

Friday, August 11, 2017

మంత్రమే వేశాను విశ్వానికి

మంత్రమే వేశాను విశ్వానికి
తంత్రమే పంచాను జగతికి
యంత్రమే ఇచ్చాను దేహానికి

మర్మమే తెలిపాను లోకానికి మంత్రమే దాచాను మేధస్సుకు  || మంత్రమే ||

కార్యాలన్నీ సుఫలంగా సాగుటలోనే మంత్రం ఉన్నది
భావాలన్నీ నిర్విఘ్నంగా సాగుటలోనే తంత్రం ఉన్నది
తత్వాలన్నీ ఆద్యంతంగా సాగుటలోనే యంత్రం ఉన్నది

జీవుల ఆలోచనలలోనే అనంతమైన విశ్వం విజ్ఞానమై మర్మంతో కలిసినది  || మంత్రమే ||

వేదాలతో సాగే భావాలకు మంత్రం వేశాను
తత్వాలతో సాగే బంధాలకు తంత్రం పంచాను
స్వరాలతో సాగే దేహాలకు యంత్రమే ఇచ్చాను   || మంత్రమే ||

జీవుల స్వభావాలలోనే అనంతమైన దేహాన్ని కాలజ్ఞాన మర్మంతో నింపాను  || మంత్రమే || 

Thursday, August 10, 2017

వేదాన్నే తెలుసుకో వేదాంతమే పంచుకో

వేదాన్నే తెలుసుకో వేదాంతమే పంచుకో
భావాలనే తెలుపుకో బంధాలనే చూసుకో

కాలమే మారినా ప్రకృతి భావాలనే గమనిస్తూ సాగిపో  || వేదాన్నే ||

వేదాల గమనం విజ్ఞాన సోపానం
వేదాంత భావం ప్రజ్ఞాన బోధనం

ప్రకృతి సిద్ధాంతం సహజం సమ భావ వేదం
ప్రకృతి పరిశోధనం గమనం సమ తత్వ జీవం  || వేదాన్నే ||

శాస్త్రీయ పరిశోధనమే వేదాల జీవన సిద్ధాంత దైవం
శాస్త్రీయ పరిణామమే భావాల జీవిత పరిస్థిత తత్వం

బంధాల భావాల అనుభవాలే అనుబంధాల సుగుణం
యోగాల వేదాల అనుభవాలే అనురాగాల ఫలితార్ధం   || వేదాన్నే ||

జగమే నీవని ఉదయిస్తున్నావా

జగమే నీవని ఉదయిస్తున్నావా
విశ్వమే నీవని ప్రజ్వలిస్తున్నావా
లోకమే నీవని అస్తమిస్తున్నావా
సర్వమే నీవని ప్రకాశిస్తున్నావా

ఓ సూర్య దేవా మహా తేజ రూపా
ఉదయించుటలో శాంతం నీవే
అస్తమించుటలో ప్రశాంతం నీవే  || జగమే ||

ప్రతి ఉదయం మేధస్సుకు నవోదయ భావాల కార్యాల తేజోదయం
ప్రతి సాయంత్రం ఆలోచనలకు విశ్రాంతి భావాల ఆనందమయం

ప్రకృతిలోనే వేదాలను పరిశోధిస్తూ అనంత భావాలను తెలిపెదవు
జీవులలోనే భావాలను పరిశీలిస్తూ అనంత స్వభావాలను చూపెదవు  || జగమే ||

వెలిగే గుణముతో ప్రకాశిస్తున్నా నిత్యం ప్రజ్వలించే భావంతో జగమంతా ఉదయిస్తూ జీవిస్తున్నావు
జ్వలించే భావంతో వెలుగుతున్నా సర్వం కాలచర్యగా విశ్వమంతా ప్రకాశిస్తూనే పరిశోధిస్తున్నావు

నీవు లేని లోకానికే ప్రతి స్పర్శ లేదని జీవుల జీవన ప్రభావం కలగదని అంతరిక్షమే తెలిపేను
నీవు లేని కాలానికి ప్రతి చలన లేదని గ్రహాల జీవిత ప్రభావం మారదని భవిష్య జ్ఞానమే తెలిపేను  || జగమే ||

Monday, August 7, 2017

ఏ శ్వాసతో జీవించాలి ఏ ధ్యాసతో గమనించాలి

ఏ శ్వాసతో జీవించాలి ఏ ధ్యాసతో గమనించాలి
ఏ భాషతో పలికించాలి ఏ ఆశతో మెప్పించాలి

కాలమే భావాలను తెలిపినా తెలియని స్వభావాలు మనలోనే ఎన్నో  || ఏ శ్వాసతో ||

శ్వాసలోనే ఉందా ఉచ్చ్వాస ధ్యాసల నిచ్ఛ్వాసాల గమనం
భాషలోనే ఉందా పలికే ఆశల స్వర స్వభావాల గానామృతం

ధ్యానంతో శ్వాసించినా పర ధ్యాసతో గమనించినా తెలియని అభిరుచులు ఎన్నో
వేదాలతో తిలకించినా భావాలతో తపించినా తెలియని అనురాగ శృతులు ఎన్నో  || ఏ శ్వాసతో ||


మోహమే మౌనమై దేహమే లీనమై ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ధ్యాసలతోనే జీవన గమనం
రాగమే వేదమై స్వరమే భావమై భాషయే వరమై ఆశలతోనే శృతి జీవిత ప్రయాణం

కాలంతో సాగినా తపించే భావాలు మేధస్సులోనే మిగిలిపోయిన స్వర శృతులు ఎన్నో
వేదంతో సాగినా వేదాల స్వభావాలు ఆలోచనలలో కలిగే నవ ఊహల భావాలు ఎన్నో   || ఏ శ్వాసతో ||

ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం

ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం
ఓ సూర్య దేవా! నిత్యం నీవే వైభోగం

ప్రతి జీవికి నీవే ఉత్తేజం
ప్రతి అణువుకు నీవే ఉత్కంఠం  || ఓ సూర్య దేవా! ||

ఉదయించే భావాలకు సూర్యోదయమే సువర్ణ సుప్రభాతం
అస్తమించే భావాలకు సూర్యాస్తమయమే సుదీర్ఘ ప్రయాణం

ఎదిగే ప్రతి వారికి నీవే మహా ఆదరణం
ఒదిగే ప్రతి వారికి నీవే మహా ఆభరణం   || ఓ సూర్య దేవా! ||

తేజముతోనే విజ్ఞానం ఉత్తేజముతోనే ప్రజ్ఞానం
భావంతోనే ప్రయాణం స్వభావంతోనే ప్రయాసం

ప్రజ్వలించుటలోనే అత్యంతమైన భావాలు ప్రకాశవంతమై వచ్చినదే సువర్ణ తేజం
ప్రజ్వలించుటలోనే ఆద్యంతమైన భావాలు ప్రభావంతమై మెచ్చినదే సువర్ణ కిరణం  || ఓ సూర్య దేవా! || 

ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా

ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా
అస్తమించే సూర్యుడు వెళ్ళేనమ్మా

ఆకాశమంతా సూర్య తేజమై సువర్ణాలతో వేద భావమై ప్రకృతినే పరిశోధించేనమ్మా
ఆకాశమంతా చంద్ర బింబమై నీలి వర్ణముతో విశ్రాంతమై ప్రకృతినే పరిశీలించేనమ్మా  || ఉదయించే ||

ప్రజ్వలమైన కాంతులతో సువర్ణాల కిరణాలతో జగతిని వెలిగించేనులే
నిశ్చలమైన అగ్ని కణాలతో సువర్ణాల బింబాలతో లోకాన్ని జ్వలించేనులే

రమణీయమైన భావాలతో రంగుల రూపులతో ఆకారాలనే చూపించేనులే
సుందరమైన స్వభావాలతో లేత సోయగాలతో రూపాలనే అందించేనులే  || ఉదయించే ||

వెలుగే ప్రతి జీవికి వేదమై జీవనమే ప్రతి జీవికి విజ్ఞానమై మేధస్సే ప్రకాశించేనులే
తేజమే ప్రతి జీవికి ఉత్తేజమై వర్ణమే ప్రతి జీవికి ఆనవాలై మేధస్సే ఉదయించేనులే

నేత్ర కాంతమే లోకమంతా విజ్ఞాన భవనమై జగమంతా అనుభవ మందిరమై సాగించేనులే
భావ చంద్రమే విశ్వమంతా విజ్ఞాన సోపానమై ప్రపంచమంతా భువన సాగరమై తపించేనులే  || ఉదయించే ||