Showing posts with label సహజత్వం. Show all posts
Showing posts with label సహజత్వం. Show all posts

Wednesday, August 16, 2017

జగమే తెలిపిన మాటలలోనే భావాలెన్నో ఉదయిస్తున్నా

జగమే తెలిపిన మాటలలోనే భావాలెన్నో ఉదయిస్తున్నా
విశ్వమే తెలిపిన రాగాలలోనే వేదాలెన్నో పలికిస్తున్నా
భావాలే వేదాలుగా మన జ్ఞాపకాలనే జ్ఞానంగా వర్ణిస్తున్నా  || జగమే ||

శుభమే శోభనమై ఉదయిస్తున్నది సూర్య తేజం
శకునమే శరణమై శోభిల్లుతున్నది సూర్య కిరణం

చరణమే మూలాధారమై ప్రయాణిస్తున్నది కాలం
గమనమే స్వధారణమై ప్రదర్శిస్తున్నది విజ్ఞానం  || జగమే ||

కమలమే ప్రకృతి వలయమై పవళిస్తున్నది జగతి తత్వం
సరళమే విశ్వతి వృత్తమై ఆవహిస్తున్నది జగతి స్వభావం

విజ్ఞానమే విశ్వ మార్గమై సహజత్వం పులకిస్తున్నది నేస్తం
వేదాంతమే విశ్వ గీతమై దివ్యత్వం ప్రబలిస్తున్నది జీవం  || జగమే || 

Wednesday, January 4, 2017

జీవం ఉన్న రూపంలో మేధస్సు ఉందా

జీవం ఉన్న రూపంలో మేధస్సు ఉందా
మహా జీవం ఉన్న మేధస్సులో వేద విజ్ఞానం ఉందా
నిశ్చలమైన ఆకారంలో తత్వం ఉందా
మహా ఆకారం ఉన్న తత్వంలో స్వభావత్వం ఉందా   || జీవం ||

జీవమే రూపమై స్వధ్యాస భావాలతో సంచలనమై జీవిస్తున్నదా
ఆకారమే భావమై పరధ్యాస స్వభావాలతో అచలమై నిలిచినదా

జీవమే దేహ రూపమై శ్వాసే పరధ్యానమై ప్రతి జీవిలో నిలయమై ఉన్నాదా
అణువులే వివిధ ఆకారాలై పరధ్యాస ప్రభావంతో సృష్టిలో పొదిగి ఉన్నాయా  || జీవం ||

ప్రతి జీవం సహజత్వం ప్రతి అణువు పరమార్థం ప్రతి ఆకార రూపం పరమాత్మం
జీవంలో మహా తత్వం అణువులో స్వభావత్వం ప్రతీది పర రూప ఆకార తత్వం

జీవరాసుల జీవం ప్రకృతి సహజత్వం అణువుల పర జీవం పంచభూతాల భావాకార నైజత్వం  
జీవరాసుల జీవత్వం ప్రకృతిపై పరాధీనం రూపముల సహజత్వం పంచభూతాల నిశ్చలతత్వం  || జీవం ||

Friday, December 30, 2016

తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే

తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే
పడమర అస్తమించినా అన్ని దిక్కులలో ఆకాశమంతా అదృశ్య చీకటి తత్వమే
ఏనాటికైనా సూర్యోదయ సూర్యాస్తమయ భావాలు జగతికి నిత్య నియంతృత్వమే  || తూర్పున ||

ప్రతి ప్రదేశంలో వెలుగును ప్రసరించే సూర్య భావన ఏకాభిప్రాయత్వమే
ప్రతి స్థానంలో కిరణాలను తాకించే సూర్య గుణ తత్వము అద్విత్వయమే

వెలుగు చీకటిని సమ భాగాలుగా దర్శించే ఆకాశ రూప వర్ణం అనిర్వచనీయమే
వెలుగు చీకటిని శ్రమ విశ్రాంతి భావాలుగా ఆదర్శించే ఆకాశం గుణాంకుశత్వమే  || తూర్పున ||

ఏ దిక్కున ఏమున్నదో ఏ స్థానమున ఏమున్నదో ఏ కిరణ తేజము చూపునో
ఏ దేశమున ఏమున్నదో ఏ ప్రదేశమున ఏమి దాగున్నదో ఏ భావం తెలుపునో

వెలుగులో అన్వేషణ విజ్ఞాన పరిశోధన ప్రతి చోట ప్రయోజనాత్మక సహజత్వమే
చీకటిలో ఆలోచన ప్రజ్ఞాన పర్యవేక్షణ ప్రతి సహజత్వం ఉపయోగాత్మక సదృశ్యమే  || తూర్పున || 

Wednesday, October 5, 2016

జగతికే తెలపాలి నాలోని భావాలను

జగతికే తెలపాలి నాలోని భావాలను
లోకానికే తెలపాలి నాలోని స్వభావాలను
విశ్వానికే తెలపాలి నాలోని తత్వాలను
ఏనాటి భావ స్వభావ తత్వాలో నాలోనే కలుగుతున్నాయి  || జగతికే ||

ఆకాశ మేఘ వర్ణాలలో ప్రతి క్షణం ఎన్నెన్నో భావాలు
సూర్య కాంతి కిరణాల తేజస్సులో ఎన్నెన్నో స్వభావాలు
మహా జీవుల జీవన విధానాలలో ఎన్నెన్నో తత్వాలు       || జగతికే ||

ప్రతి భావన ఓ మహా స్వభావంతో కూడిన తత్వం
ప్రతి స్వభావం ఓ విజ్ఞాన విచక్షణ కలిగిన సహజత్వం
ప్రతి తత్వం ఓ శ్రద్ధ ధ్యాసతో కూడిన మహా గుణత్వం  || జగతికే ||