ఏనాడు లిఖించెదరో నా భావాలను అనేక భాషలలో
ఏనాడు వర్ణించెదరో నా తత్వాలను అనేక వాక్యాలలో
ఎవరు లిఖించెదరో నా వేదములను అనేక ప్రాంతాలలో
ఎవరు వర్ణించెదరో నా జ్ఞానములను అనేక పాఠములలో || ఏనాడు ||
భావనయే తెలియని నాడు తెలియును భాష ప్రభావ తేజము
తత్వనయే తోచని నాడు తెలియును భాష ప్రబోధ కాంతము
వేదమే తెలియని నేడు తెలిపేను భాషే ఖ్యాతి ప్రాధాన్యము
జ్ఞానమే తెలియని నేడు తెలిపేను భాషే కీర్తి ప్రాముఖ్యము || ఏనాడు ||
జీవమే తెలియని నాడు తెలిపేను భాష బంధాల ప్రయోజనము
రూపమే తెలియని నాడు తెలిపేను భాష స్వరాల ప్రతియత్నము
సర్వమే తెలియని నాడు తెలిపేను భాషే విశ్వ అనంతము
నిత్యమే తెలియని నాడు తెలిపేను భాషే లోక ఆద్యంతము || ఏనాడు ||

No comments:
Post a Comment