Saturday, September 30, 2017

ఎవరికి తెలియాలి విశ్వ వేదం

ఎవరికి తెలియాలి విశ్వ వేదం
ఎందరికి తోచాలి జగతి తత్వం
ఎప్పుడు కలగాలి ప్రకృతి భావం
ఏనాడు కరుణించాలి దేహతి రూపం 

ఏ రూప వేద భావ తత్వమైన మానవ మేధస్సుకే మహా విజ్ఞానం  || ఎవరికి ||

ఎంతైనా విశ్వమే వేదాన్ని తెలిపేను
ఏదైనా జగమే తత్వాన్ని తపించేను 
ఏమైనా లోకమే భావాన్ని కలిగించేను
ఎప్పుడైనా జీవమే రూపాన్ని కదిలించేను

ప్రతి క్షణం ప్రకృతిలోనే జీవ భావాల స్వభావాలు ఉదయిస్తూ అస్తమించేను  || ఎవరికి ||

ఎవరో విశ్వాన్ని పరిచయాలతో బంధంగా మార్చారు
ఎవరో జగతిని స్వభావాలతో సువర్ణంగా వివరించారు 
ఎవరో ప్రకృతిని తత్వాలతో సూక్ష్మంగా పరిశోధించారు
ఎవరో లోకాన్ని వేద రూపాలతో ప్రజ్ఞానంగా భోదించారు

ప్రతి భావన మేధస్సును మహా విజ్ఞానంగా పరిశోధిస్తూ పరిశుద్ధం చేసేను  || ఎవరికి || 

ఏదైనా వేదం నీలో ఉందా

ఏదైనా వేదం నీలో ఉందా
ఏదైనా భావం నీలో ఉందా
ఏదైనా జ్ఞానం నీలో ఉందా 
ఏదైనా తత్వం నీలో ఉందా  || ఏదైనా ||

విశ్వతిలో ఉన్నది వేదమే
జగతిలో నిండినది భావమే
ప్రకృతిలో పరిచినది జ్ఞానమే
దేహతిలో దాగినది తత్వమే 

ప్రకృతి స్వరూపమే విశ్వ జగతి దేహ భావాల వేద విజ్ఞాన తత్వం  || ఏదైనా ||

విశ్వతి రూపం వేదాల క్షేత్రం
జగతి నిర్మాణం భావాల శిఖరం
ప్రకృతి పరిణామం జ్ఞానుల ఆలయం
దేహతి ఆకారం తత్వాల మందిరం

ప్రకృతి నిర్మాణ స్వభావాలే విశ్వ జగతి తత్వాల వేదాంత దేహ విజ్ఞానం  || ఏదైనా ||

Tuesday, September 19, 2017

ఏ భావంతో ఉదయిస్తున్నావో

ఏ భావంతో ఉదయిస్తున్నావో
ఏ తత్వంతో జీవిస్తున్నావో
ఏ వేదంతో పూజిస్తున్నావో
ఏ జ్ఞానంతో ఆరాధిస్తున్నావో   || ఏ భావంతో ||

భావంతో సూర్యునిలా ఉదయించు
తత్వంతో ప్రకృతిలా జీవించు
వేదంతో విశ్వతిలా పూజించు
జ్ఞానంతో దైవంలా ఆరాధించు

దేహాలన్నీ జీవిలో కలిగిన బంధములే   || ఏ భావంతో ||

భావమే నీ మేధస్సుకు స్వరూపం
తత్వమే నీ ఆలోచనకు ప్రతిరూపం
వేదమే నీ మనస్సుకు అవతారం
జ్ఞానమే నీ విచక్షణకు విశ్వరూపం

రూపాలన్నీ జగతిలో వెలసిన ఆకారములే   || ఏ భావంతో ||

Monday, September 18, 2017

ప్రకృతిలోనే పరమాత్మగా జీవిస్తున్నా

ప్రకృతిలోనే పరమాత్మగా జీవిస్తున్నా
విశ్వతిలోనే పరంధామగా ఉదయిస్తున్నా
జగతిలోనే పరంజ్యోతిగా అధిరోహిస్తున్నా   || ప్రకృతిలోనే ||

ప్రకృతిగా పంచ భూతాలచే నిరాకారంవలె నిర్మితమై ఉన్నా
విశ్వతిగా పంచ తత్వాలచే నిర్వికారంవలె నిశ్చితమై ఉన్నా
జగతిగా పంచ భావాలచే నిర్విఘ్నమువలె నిశ్శబ్దమై ఉన్నా   || ప్రకృతిలోనే ||

ప్రకృతికే ప్రకాశమై సమస్తం నిస్వార్థత్వమై ఉన్నా
విశ్వతికే ప్రతేజమై నిత్యం నిరంకుశత్వమై ఉన్నా
జగతికే ప్రజ్వలమై సర్వం నియంతృత్వమై ఉన్నా   || ప్రకృతిలోనే || 

జీవించలేను మరణించలేను

జీవించలేను మరణించలేను
అవధూతగా జన్మించిన జీవించలేను
అవధానిగా ఉదయించిన మరణించలేను

జన్మించిన ఆకార రూపాన్ని మరణంతో తొలచెదరు
ఉదయించిన భావాన్ని అస్తమించుటచే మరచెదరు   || జీవించలేను ||

సమాధి నుండే మాట్లాడెదనా సమాధి నుండే పలికించెదనా
సమాధి నుండే తిలకించెదనా సమాధి నుండే వినిపించెదనా

సమాధియే నిత్యం సమాధియే సర్వం సమాధియే శాంతం
సమాధియే సత్యం సమాధియే స్వర్గం సమాధియే ప్రశాంతం   || జీవించలేను ||

సమాధి నుండే తపించెదనా సమాధి నుండే భావించెదనా
సమాధి నుండే కనిపించెదనా సమాధి నుండే రక్షించెదనా

సమాధియే సుఖం సమాధియే మోక్షం సమాధియే క్షేత్రం
సమాధియే దైవం సమాధియే దేహం సమాధియే వైకుంఠం   || జీవించలేను || 

Thursday, September 14, 2017

ఆత్మగా నిత్యం నేనే పరమాత్మగా సత్యం నేనే

ఆత్మగా నిత్యం నేనే పరమాత్మగా సత్యం నేనే
శ్వాసగా నిత్యం నేనే పర ధ్యాసగా సత్యం నేనే

జీవంగా ఎదిగిన ఆత్మను నేనే రూపంగా ఒదిగిన పరమాత్మను నేనే
దైవంగా ఎదిగిన ఆత్మను నేనే దేహంగా ఒదిగిన పరమాత్మను నేనే   || ఆత్మగా ||

ప్రకృతియే నిత్యం ప్రకృతియే సత్యం
ప్రకృతియే జీవం ప్రకృతియే రూపం

ప్రకృతిగా జీవించే పరమాత్మను నేనే
ప్రకృతిగా ధ్యానించే పర ఆత్మను నేనే

ప్రకృతిగా ఉదయించే దైవం నేనే
ప్రకృతిగా అస్తమించే దేహం నేనే   || ఆత్మగా ||

ప్రకృతియే దైవం ప్రకృతియే నిత్యం
ప్రకృతియే ధర్మం ప్రకృతియే సత్యం

ప్రకృతిగా కనిపించే ప్రతి రూపం నేనే
ప్రకృతిగా సాగించే ప్రతి స్వరూపం నేనే

ప్రకృతిగా తలిచే భావం తపించే తత్వం నేనే
ప్రకృతిగా కొలిచే వేదం కలిగే పర జ్ఞానం నేనే    || ఆత్మగా || 

జీవించలేను నేను మరణించలేను నేను

జీవించలేను నేను మరణించలేను నేను
ఏనాటిదో ఈ ప్రయాణం నే సాగించలేను

సమస్యగా సాగిపోలేను సమస్యతో ఓడిపోలేను
సాధనగా సాగేదను సాధ్యమైతే శ్రమించగలను   || జీవించలేను ||

అఖండమైన రూపాలనే జగతిలో సృష్టించగలను
అమోఘమైన భావాలనే విశ్వతిలో తిలకించగలను

అసంఖ్యాక భావాల స్వభావాలతో కార్యాలనే గమనించగలను
అనంతమైన బంధాల తత్వాలతో స్వరాలనే శృతించగలను   || జీవించలేను ||

నిలిచిపోయే మహా భావాలకు స్వభావాలను తెలుసుకోగలను
కలిసిపోయే మహా సంబంధాలకు తత్వాలను తెలుపుకోగలను

యుగాలుగా జీవిస్తున్నా అనంత స్వభావాలతో జీవించలేను
తరాలుగా సాగుతున్నా అనేక సంబంధాలతో మరణించలేను   || జీవించలేను || 

Friday, September 8, 2017

ఎంతగా నీవు ఎదిగావో అంతగా నీవు ఒదిగావో

ఎంతగా నీవు ఎదిగావో అంతగా నీవు ఒదిగావో
ఎంతగా నీవు నేర్చావో అంతగా నీవు ఓర్చావో

ఎంతగా నీవు ప్రయాణించావో అంతగా నీవు అన్వేషించావో
ఎంతగా నీవు ప్రయత్నించావో అంతగా నీవు అనుభవించావో   || ఎంతగా ||

సూర్యునిచే ఎంత ఎదిగినా ప్రకృతిచే అంతే ఒదిగిపో
ప్రకృతిచే ఎంత ఎదిగినా సూర్యునిచే అంతే ఒదిగిపో

విజ్ఞానంచే ఎంత ఎదిగినా వేదాంతంచే అంతే ఒదిగిపో
వేదాంతంచే ఎంత ఎదిగినా విజ్ఞానంచే అంతే ఒదిగిపో    || ఎంతగా ||

భావాలతో ఎంత ఎదిగినా తత్వాలతో అంతే ఒదిగిపో
తత్వాలతో ఎంత ఎదిగినా భావాలతో అంతే ఒదిగిపో

సత్యంతో ఎంత ఎదిగినా ధర్మంతో అంతే ఒదిగిపో
ధర్మంతో ఎంత ఎదిగినా సత్యంతో అంతే ఒదిగిపో    || ఎంతగా ||