Showing posts with label దిక్కు. Show all posts
Showing posts with label దిక్కు. Show all posts

Friday, December 30, 2016

తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే

తూర్పున ఉదయించినా అన్ని దిక్కులలో సూర్య కిరణాల మహా సువర్ణ తేజమే
పడమర అస్తమించినా అన్ని దిక్కులలో ఆకాశమంతా అదృశ్య చీకటి తత్వమే
ఏనాటికైనా సూర్యోదయ సూర్యాస్తమయ భావాలు జగతికి నిత్య నియంతృత్వమే  || తూర్పున ||

ప్రతి ప్రదేశంలో వెలుగును ప్రసరించే సూర్య భావన ఏకాభిప్రాయత్వమే
ప్రతి స్థానంలో కిరణాలను తాకించే సూర్య గుణ తత్వము అద్విత్వయమే

వెలుగు చీకటిని సమ భాగాలుగా దర్శించే ఆకాశ రూప వర్ణం అనిర్వచనీయమే
వెలుగు చీకటిని శ్రమ విశ్రాంతి భావాలుగా ఆదర్శించే ఆకాశం గుణాంకుశత్వమే  || తూర్పున ||

ఏ దిక్కున ఏమున్నదో ఏ స్థానమున ఏమున్నదో ఏ కిరణ తేజము చూపునో
ఏ దేశమున ఏమున్నదో ఏ ప్రదేశమున ఏమి దాగున్నదో ఏ భావం తెలుపునో

వెలుగులో అన్వేషణ విజ్ఞాన పరిశోధన ప్రతి చోట ప్రయోజనాత్మక సహజత్వమే
చీకటిలో ఆలోచన ప్రజ్ఞాన పర్యవేక్షణ ప్రతి సహజత్వం ఉపయోగాత్మక సదృశ్యమే  || తూర్పున || 

Tuesday, August 2, 2016

దిక్కులతో చూపులే చెల్లా చెదురు చుక్కలతో చిక్కులే చిటపటలు

దిక్కులతో చూపులే చెల్లా చెదురు చుక్కలతో చిక్కులే చిటపటలు
ఎక్కడికి వెళ్ళినా చిత్రాలే విచిత్రాలు ఎక్కడ ఉన్నా చివాట్లే తప్పట్లు
ఏదేమైనా మదిలో మైమరిపించే కైపులే యదలో దాగిన ఓర ఇక్కట్లు  || దిక్కులతో ||

విషాదంతో సాగే దిక్కు ఎక్కడికి చేర్చునో చుక్కలుగా తెలియుటలేదే
అశాంతతో తోచే చిత్రం విచిత్రమై మైమరిపించే కైపుగా ఉంటుందేమో

చిక్కులెన్నో లెక్కలుగా దిక్కులకే తోచనట్లు చుక్కలన్నీ ఒకటిగా మారి కనిపించునే
చిత్రాలెన్నో రూపాలుగా నేత్రానికే కనబడనట్లు ఆకారాలన్నీ ఒకటై విచిత్రమయ్యేనే   || దిక్కులతో ||

అసత్యాన్ని చూపే దిక్కు రూపం లేని చిత్రంగా కలవరపడి పోయేనే
అధర్మాన్ని సూచించే కాలం చరిత్రకే లేని వేదంతంగా మారి పోయేనే

ఇబ్బందులతో సాగే జీవితం ఇక్కట్లుగా యదలోనే దుఃఖమైపోయెనే
ఒడిదుడుకులతో సాగే జీవనం చీవాట్లుగా మదిలోనే నిలిచిపోయేనే    || దిక్కులతో || 

Wednesday, May 25, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
నీటితో ప్రయాణమా నావతో చెలగాటమా
ఇది జీవిత పోరాటమా జీవన చదరంగమా || ఓ బాటసారి ..... ||

గాలి వానతో సుడిగుండమై ప్రయాణమే మారిపోయేను
ప్రయాణము సాగని నావ చిందర వందరమై పోయేను

మార్గం తెలియని నీటిలో నావ లేక మిగిలిపోయేవు
ఒడ్డుకు చేరుకోలేక నీటిలోనే మునిగి తేలి పోయేవు

ఏ దిక్కున ప్రయాణించాలో దిక్సూచి కూడా లేకపోయే
దిక్కులన్ని ఒకటై నీటి చుట్టూ తిరుగుతూ ఉండిపోయే || ఓ బాటసారి ..... ||

ఏ వైపు చూసిన ఒకటే దూరం ఎటూ వెళ్ళినా అన్ని వైపులా అంతంతే దూరం
ఏ వైపు వెళ్ళినా దూరం తగ్గని విధంగా దిక్కు తోచని దూరంతో దిక్కులదూరం

ఆగి పోవాలని లేదు ప్రయాణించాలని తెలియుట లేదు
ఆగినా ఉండలేను సాగినా ఎటు వెళ్ళాలో ఏదీ తోచట్లేదు

ఇది జీవన పోరాటమో జీవిత చదరంగమో తెలియని ప్రయాణం
ఏది తెలిసినా ఏది తెలియక పోయినా ప్రయాణంతో సాగి పోవాలి || ఓ బాటసారి ..... ||