ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం
ఓ సూర్య దేవా! నిత్యం నీవే వైభోగం
ప్రతి జీవికి నీవే ఉత్తేజం
ప్రతి అణువుకు నీవే ఉత్కంఠం || ఓ సూర్య దేవా! ||
ఉదయించే భావాలకు సూర్యోదయమే సువర్ణ సుప్రభాతం
అస్తమించే భావాలకు సూర్యాస్తమయమే సుదీర్ఘ ప్రయాణం
ఎదిగే ప్రతి వారికి నీవే మహా ఆదరణం
ఒదిగే ప్రతి వారికి నీవే మహా ఆభరణం || ఓ సూర్య దేవా! ||
తేజముతోనే విజ్ఞానం ఉత్తేజముతోనే ప్రజ్ఞానం
భావంతోనే ప్రయాణం స్వభావంతోనే ప్రయాసం
ప్రజ్వలించుటలోనే అత్యంతమైన భావాలు ప్రకాశవంతమై వచ్చినదే సువర్ణ తేజం
ప్రజ్వలించుటలోనే ఆద్యంతమైన భావాలు ప్రభావంతమై మెచ్చినదే సువర్ణ కిరణం || ఓ సూర్య దేవా! ||

No comments:
Post a Comment