ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా
అస్తమించే సూర్యుడు వెళ్ళేనమ్మా
ఆకాశమంతా సూర్య తేజమై సువర్ణాలతో వేద భావమై ప్రకృతినే పరిశోధించేనమ్మా
ఆకాశమంతా చంద్ర బింబమై నీలి వర్ణముతో విశ్రాంతమై ప్రకృతినే పరిశీలించేనమ్మా || ఉదయించే ||
ప్రజ్వలమైన కాంతులతో సువర్ణాల కిరణాలతో జగతిని వెలిగించేనులే
నిశ్చలమైన అగ్ని కణాలతో సువర్ణాల బింబాలతో లోకాన్ని జ్వలించేనులే
రమణీయమైన భావాలతో రంగుల రూపులతో ఆకారాలనే చూపించేనులే
సుందరమైన స్వభావాలతో లేత సోయగాలతో రూపాలనే అందించేనులే || ఉదయించే ||
వెలుగే ప్రతి జీవికి వేదమై జీవనమే ప్రతి జీవికి విజ్ఞానమై మేధస్సే ప్రకాశించేనులే
తేజమే ప్రతి జీవికి ఉత్తేజమై వర్ణమే ప్రతి జీవికి ఆనవాలై మేధస్సే ఉదయించేనులే
నేత్ర కాంతమే లోకమంతా విజ్ఞాన భవనమై జగమంతా అనుభవ మందిరమై సాగించేనులే
భావ చంద్రమే విశ్వమంతా విజ్ఞాన సోపానమై ప్రపంచమంతా భువన సాగరమై తపించేనులే || ఉదయించే ||

No comments:
Post a Comment