Monday, August 7, 2017

ఏ శ్వాసతో జీవించాలి ఏ ధ్యాసతో గమనించాలి

ఏ శ్వాసతో జీవించాలి ఏ ధ్యాసతో గమనించాలి
ఏ భాషతో పలికించాలి ఏ ఆశతో మెప్పించాలి

కాలమే భావాలను తెలిపినా తెలియని స్వభావాలు మనలోనే ఎన్నో  || ఏ శ్వాసతో ||

శ్వాసలోనే ఉందా ఉచ్చ్వాస ధ్యాసల నిచ్ఛ్వాసాల గమనం
భాషలోనే ఉందా పలికే ఆశల స్వర స్వభావాల గానామృతం

ధ్యానంతో శ్వాసించినా పర ధ్యాసతో గమనించినా తెలియని అభిరుచులు ఎన్నో
వేదాలతో తిలకించినా భావాలతో తపించినా తెలియని అనురాగ శృతులు ఎన్నో  || ఏ శ్వాసతో ||


మోహమే మౌనమై దేహమే లీనమై ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ధ్యాసలతోనే జీవన గమనం
రాగమే వేదమై స్వరమే భావమై భాషయే వరమై ఆశలతోనే శృతి జీవిత ప్రయాణం

కాలంతో సాగినా తపించే భావాలు మేధస్సులోనే మిగిలిపోయిన స్వర శృతులు ఎన్నో
వేదంతో సాగినా వేదాల స్వభావాలు ఆలోచనలలో కలిగే నవ ఊహల భావాలు ఎన్నో   || ఏ శ్వాసతో ||

No comments:

Post a Comment