ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...
ఓ శివ .. శివ శంకరా .. నీ స్వర మహదేశ్వరా ...
శివ శివ .. శివ శంకరా .. నీవే లోకానికి జీవేశ్వరా .. || ఓ శివ .. ||
నీ శ్వాసలో ఏకమై నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే గమనిస్తున్నా
నీ ధ్యాసలో లీనమై నీ పర ధ్యాన స్వభావాలనే తిలకిస్తున్నా
నీ లయలో గానమై నీ స్వర శృతులనే తపిస్తున్నా
నీ స్వరలో గాత్రమై నీ శృతి స్వరాలనే జపిస్తున్నా || ఓ శివ .. ||
నీ జీవమే విశ్వానికి భావమై నీ స్వరానికే ధ్యానమై వినిపిస్తున్నా
నీ ప్రాణమే జగతికి స్వభావమై నీ లయకే వేదమై ఆలపిస్తున్నా
నీ రూపమే మౌనమై లోకానికే శాంతమై నీ రాగమే వహిస్తున్నా
నీ దేహమే వర్ణమై దైవానికే ప్రశాంతమై నీ వరమే ధరిస్తున్నా || ఓ శివ .. ||

No comments:
Post a Comment