Showing posts with label శివ. Show all posts
Showing posts with label శివ. Show all posts

Monday, August 21, 2017

ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...

ఓ శివ .. శివ శంకరా .. నీ లయ పరమేశ్వరా ...
ఓ శివ .. శివ శంకరా .. నీ స్వర మహదేశ్వరా ...
శివ శివ .. శివ శంకరా .. నీవే లోకానికి జీవేశ్వరా ..   || ఓ శివ .. ||

నీ శ్వాసలో ఏకమై నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే గమనిస్తున్నా
నీ ధ్యాసలో లీనమై నీ పర ధ్యాన స్వభావాలనే తిలకిస్తున్నా

నీ లయలో గానమై నీ స్వర శృతులనే తపిస్తున్నా
నీ స్వరలో గాత్రమై నీ శృతి స్వరాలనే జపిస్తున్నా   || ఓ శివ .. ||

నీ జీవమే విశ్వానికి భావమై నీ స్వరానికే ధ్యానమై వినిపిస్తున్నా
నీ ప్రాణమే జగతికి స్వభావమై నీ లయకే వేదమై ఆలపిస్తున్నా

నీ రూపమే మౌనమై లోకానికే శాంతమై నీ రాగమే వహిస్తున్నా
నీ దేహమే వర్ణమై దైవానికే ప్రశాంతమై నీ వరమే ధరిస్తున్నా   || ఓ శివ .. || 

Tuesday, February 16, 2016

ఈ జగమంతా శివ రూపం ఈ జగమంతా శివ నామం

ఈ జగమంతా శివ రూపం ఈ జగమంతా శివ నామం
ఈ జగమంతా శివ ధ్యానం ఈ జగమంతా శివ భావం
అంతా శివ ఆకారమే అంతా శివ స్వరూపమే
సర్వం శివ ప్రమేయమే సమస్తం శివ సన్నిధియే ॥ ॥

శివుడే అర్ధనారీశ్వరీయ జగన్నాటక సూత్రధారి
శివుడే పురుషస్త్రీయ పర లోక జీవ మోక్షకారి

శివాయే సర్వ పూజిత నిత్య మంగళ ఆది శేషగిరి
శివాయే విశ్వ త్రి నేత్రిత దివ్య జ్యోతియ కరుణాకరి

శివ శంకరుడే శంఖు పూరిత సూర్యోదయ ధారి
శివ శంకరుడే కపాల పూర్ణిత అన్నపూర్ణ దేహి ॥ ॥

శివ నాధుడే శ్రీ కైలాస హిమాలయ నివాసి
శివ నాధుడే శ్రీ క్షేత్ర శ్రీశైల అరణ్య నివాసి

శివుడే త్రీలోక విజ్ఞాన వేద పాండిత్య సంపన్నుడు
శివుడే ముక్కోటి దేవతల సర్వ భూత సర్వజ్ఞుడు

శివ శంకరుడే విశ్వ ప్రాణుల మార్కండేయుడు
శివ శంకరుడే అల్ప జీవుల యోగ క్షేమంధరుడు ॥ ॥ 

Wednesday, October 5, 2011

ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

శివానంద యోగ శివ కైలాసవాస
విశ్వానంద యోగ విశ్వ వేదవ్యాస
భావా చరణ బహురూప విశ్వ విధాత
భవ్యా కరణ స్వరూప బ్రంహానంద ధాత
మేధస్సులో ఇంద్రధనస్సునే ధరించినా సూర్య తేజస్సువు నీవే
శిరస్సుపై గంగా ధరిణినే ధరించినా జటానంద భూపతివి నీవే
పంచ భూతాల విశ్వ స్థితిలో ధ్యానించే జగాధిపతివి నీవే
విశ్వ భూతాల ఆత్మ స్థితిలో జీవించే హరి చంద్రుడు నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ

దయానంద యోగ దివ్య దైవేశ్వరా
కరుణానంద యోగ కార్య కరుణేశ్వరా
అనంత ముఖ వర్ణాయ అవతార మూర్తి శివాయ
ప్రత్యక్ష రూప తేజాయ ప్రమోదూత హరి ద్వారాయ
జగతినే త్రినేత్రంతో దర్శించే అభ్యుదయ రూప కారుడవు నీవే
విశ్వ కార్యాలనే కర్త కర్మ క్రియలుగా నడిపించే కాల రుద్రుడు నీవే
యుగాలనే ప్రళయాలుగా సృష్టించే అరవీర భయంకరుడు నీవే
లోకాలనే దిక్కులుగా మార్చే ద్వీపాలకు కాల యుక్తివి నీవే

ఓం నమో శివ రుద్రాయ - ఓం నమో శివ రౌద్రాయ - ఓం నమో హర నాగాభరణాయ
ఓం నమో శివ దేవాయ - ఓం నమో శివ కంఠాయ - ఓం నమో హర వీరభద్రాయ