Wednesday, August 16, 2017

ఏ మంత్రం వేశానో విశ్వానికి

ఏ మంత్రం వేశానో విశ్వానికి
ఏ తంత్రం పంచానో జగతికి
ఏ యంత్రం ఇచ్చానో దేహానికి
తెలియని మర్మమై మేధస్సులోనే వరించినది ఓ కాలమా!   || ఏ మంత్రం ||

శూన్య భావముతో విశ్వాన్ని మహా మంత్రంచే తలచాను
పూర్ణ స్వభావముతో జగతిని మహా తంత్రంచే తపించాను
మంగళ తత్వముచే దేహాన్ని మహా యంత్రంచే కొలిచాను  || ఏ మంత్రం ||

మంత్రమన్నది మేధస్సుకు కార్యాచరణగా సాగే పరిశీలన
తంత్రమన్నది ఆలోచనకు కార్యాదరణగా సాగే పరిశోధన
యంత్రమన్నది భావనకు కార్యావరణగా సాగే ప్రతిస్పందన  || ఏ మంత్రం || 

No comments:

Post a Comment