Tuesday, August 15, 2017

మెళకువ కలిగిన క్షణమే సూర్యోదయమా

మెళకువ కలిగిన క్షణమే సూర్యోదయమా
నిద్రించిన సమయ కాలమే సూర్యాస్తమా

జీవన విధానములో కలిగే మార్పులే ప్రకృతి విరుద్ధమా
సమయం కాని సమయంలో నిద్రించడం ప్రచండమా
సకాలం కాని కాలంలో మెళకువ రావడం ప్రమాదమా     || మెళకువ ||

జీవన విధాన కార్యాల మార్పులలో లోపమా
జీవన విధాన పరిస్థితి ప్రభావాలలో భేదమా  

యాంత్రిక తత్వాలతో సాగే జీవన శైలిలో విభేదమా
సాంకేతిక ప్రజ్ఞానంతో సాగే జీవన శైలిలో విచారమా  || మెళకువ ||

జీవించుటలో మార్పులు ఎన్నో కలుగుట భారమా
జీవించుటలో మార్పులు ఎన్నో చేయుట మోసమా
 
విజ్ఞాన సాధనలో కలిగే ఆటంకాలే జీవన విఫలమా
ప్రజ్ఞాన గమనలో కలిగే అడ్డంకులే జీవిత పరిణామమా  || మెళకువ || 

No comments:

Post a Comment