Showing posts with label సూర్యుడు. Show all posts
Showing posts with label సూర్యుడు. Show all posts

Monday, August 7, 2017

ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా

ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా
అస్తమించే సూర్యుడు వెళ్ళేనమ్మా

ఆకాశమంతా సూర్య తేజమై సువర్ణాలతో వేద భావమై ప్రకృతినే పరిశోధించేనమ్మా
ఆకాశమంతా చంద్ర బింబమై నీలి వర్ణముతో విశ్రాంతమై ప్రకృతినే పరిశీలించేనమ్మా  || ఉదయించే ||

ప్రజ్వలమైన కాంతులతో సువర్ణాల కిరణాలతో జగతిని వెలిగించేనులే
నిశ్చలమైన అగ్ని కణాలతో సువర్ణాల బింబాలతో లోకాన్ని జ్వలించేనులే

రమణీయమైన భావాలతో రంగుల రూపులతో ఆకారాలనే చూపించేనులే
సుందరమైన స్వభావాలతో లేత సోయగాలతో రూపాలనే అందించేనులే  || ఉదయించే ||

వెలుగే ప్రతి జీవికి వేదమై జీవనమే ప్రతి జీవికి విజ్ఞానమై మేధస్సే ప్రకాశించేనులే
తేజమే ప్రతి జీవికి ఉత్తేజమై వర్ణమే ప్రతి జీవికి ఆనవాలై మేధస్సే ఉదయించేనులే

నేత్ర కాంతమే లోకమంతా విజ్ఞాన భవనమై జగమంతా అనుభవ మందిరమై సాగించేనులే
భావ చంద్రమే విశ్వమంతా విజ్ఞాన సోపానమై ప్రపంచమంతా భువన సాగరమై తపించేనులే  || ఉదయించే || 

Friday, February 3, 2017

సూర్యుడు నీవే చంద్రుడు నీవే

సూర్యుడు నీవే చంద్రుడు నీవే
విశ్వ జగతికి చీకటి వెలుగువు నీవే
లోకాలన్నింటికి భావాల తత్వం నీవే

ఏ దేహమైన ఏ జీవమైన ఉదయిస్తూ అస్తమించేది నీవే
ఏ రూపమైన ఏ ఆకారమైన ఎదుగుతూ ఒదుగుతున్నది నీవే || సూర్యుడు ||

అణువైనా నీ రూపమే పరమాణువైనా నీ ఆకారమే పరిశోధించే ఏ సూక్ష్మమైన నీ స్వభావత్వమే
తెలియని మర్మం తెలిసిన తంత్రం సృష్టించిన ఏ జీవ యంత్రమైనా నీలో దాగిన మంత్రమే

మేధస్సులో దాగిన విజ్ఞానం నీవే కలలతో సాగే ఊహల భావ స్వభావాలు నీవే
కాలంతో సాగే జనన మరణాలు నీవే సమయంతో సాగే అజ్ఞాన విజ్ఞానాలు నీవే  || సూర్యుడు ||

నీవు లేని భావం ఏదైనా శూన్యమే
భావం లేనిది ఏదైనా మహా శూన్యమే
ఏమి లేని భావం సంపూర్ణమైన శూన్యమే
ఏమి తోచని భావం పరిశుద్ధమైన శూన్యమే  || సూర్యుడు ||

Friday, September 23, 2016

మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము

మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము
కాలంతో కార్యాలనే సాగిస్తూ సమయంతో నడిచెదము

సూర్యుడు లేనిచోట విశ్వానికే సూర్యోదయం లేదంటు
సూర్యాస్తమయంతో జగతికి చీకటే పడుతుందంటా

జనులకు కావాలి విశ్వ జగతి ఇచ్చే ప్రేమే వెలిగేలా
జనులే చెప్పేరు సూర్యునికే జయహో జనతా జై జై మాతా  || మనిషిగా ||

మాటలతో సాగే స్నేహం ప్రేమగా మారే మన జీవం
మనస్సుతో కలిసే ప్రేమ జీవితాన్ని ఇచ్చే ప్రతి రూపం

మనస్సులు కలవక ముందు ఎవరికి ఎవరో తెలియము
మాటలు కలిసిన తరువాతే స్నేహ ప్రేమని తెలిసేను

జనులంతా ప్రేమతో చెప్పేరు జయహో జనతా జై జై మాత  || మనిషిగా ||

ప్రేమే లేదన్న చోట హృదయమే దుఃఖించెను
ప్రేమే కాదన్న చోట మనస్సే తడబడి పోయేను

ప్రేమే లేని నాడు ప్రేమించే తల్లి హృదయం ఆగేనా
ప్రేమే లేని రోజు మన విశ్వ జగతి తల్లడిల్లి పోయేనా

జనులంతా ప్రేమకై  చెప్పేరు జయహో జనతా జై జై మాత  || మనిషిగా ||

Monday, August 31, 2015

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!
ప్రతి రోజు ఉదయిస్తూ ప్రతి జీవికి మెలకువ కలిగిస్తూ
విశ్వానికే తేజమై మేధస్సులకే ఉత్తేజమై సాయంత్రపు సంధ్య వేళ అస్తమించేను ఓ... మేఘమా! ॥

జగతికే ఆది కేంద్రంలా ఉదయిస్తూ మేధస్సులకే ఆలోచన భావనను కలిగించేను
సూర్య కిరణాలతో వెలుగును ప్రసారిస్తూ మేధస్సులకే విజ్ఞానాన్ని అందించేను
తన వెలుగులోనే ప్రతి జీవి చలనం సాగిస్తూ జీవనాన్ని కార్యాలతో సాగించేను
చీకటి అయ్యేలోగా ఇంటిని చేరుతూ విశ్రాంతితో సేద తీరి జీవులు నిద్రించేను ఓ... మేఘమా! ॥

సూర్య దేశం ఓ విజ్ఞాన క్షేత్రమై ప్రతి జీవి సూర్య తేజస్సుతో విజ్ఞానంగా ఎదుగుతుంది
సూర్యుని కిరణాల తేజస్సు మేధస్సులో కలిగే ఉత్తేజమైన ఆలోచనలకు స్పూర్తినిస్తుంది
సూర్యుని శక్తితోనే మన సామర్థ్యం పట్టుదల ధృడమై వివిధ కార్యాలకు చేయూతనిస్తుంది
సూర్య ప్రపంచం ఓ విజ్ఞాన స్థావరమై విశ్వానికి పరిపూర్ణమైన సంపూర్ణ భావాన్ని కలిగిస్తుంది ఓ... మేఘమా! ॥