Showing posts with label ఉత్కంఠం. Show all posts
Showing posts with label ఉత్కంఠం. Show all posts

Monday, August 7, 2017

ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం

ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం
ఓ సూర్య దేవా! నిత్యం నీవే వైభోగం

ప్రతి జీవికి నీవే ఉత్తేజం
ప్రతి అణువుకు నీవే ఉత్కంఠం  || ఓ సూర్య దేవా! ||

ఉదయించే భావాలకు సూర్యోదయమే సువర్ణ సుప్రభాతం
అస్తమించే భావాలకు సూర్యాస్తమయమే సుదీర్ఘ ప్రయాణం

ఎదిగే ప్రతి వారికి నీవే మహా ఆదరణం
ఒదిగే ప్రతి వారికి నీవే మహా ఆభరణం   || ఓ సూర్య దేవా! ||

తేజముతోనే విజ్ఞానం ఉత్తేజముతోనే ప్రజ్ఞానం
భావంతోనే ప్రయాణం స్వభావంతోనే ప్రయాసం

ప్రజ్వలించుటలోనే అత్యంతమైన భావాలు ప్రకాశవంతమై వచ్చినదే సువర్ణ తేజం
ప్రజ్వలించుటలోనే ఆద్యంతమైన భావాలు ప్రభావంతమై మెచ్చినదే సువర్ణ కిరణం  || ఓ సూర్య దేవా! || 

Tuesday, August 9, 2016

కల్యాణంతో కలిసిపోయే బంధాలే మరువలేని మన జీవిత సంబంధాలు

కల్యాణంతో కలిసిపోయే బంధాలే మరువలేని మన జీవిత సంబంధాలు
పరిచయాలతో కలిసిపోయే సంబంధాలే సంతోషాన్ని పంచేటి బంధాలు  || కల్యాణంతో ||

నవ జీవితాన్ని సాగించే యువకుల మనో భావాల ప్రయాణమే కళ్యాణం
జంటగా ఆలుమగలై నూతన జీవనాన్ని కొత్తదనంతో సాగించేదే జీవితం

వధూవరులు దంపతులు భార్యాభర్తలు ఈడు జోడుగా కలిసే తరుణం కళ్యాణం
పెళ్లి కుమారుడు కుమార్తె మొగుడు పెళ్ళాంగా తపించే శుభవేళ కళ్యాణ శోభనం

ఒకరికి ఒకరు స్వీకారం చుట్టుకొని పరిణయంతో కలిసి మెలిసి పోయే బంధం కళ్యాణం
ఒకరికి ఒకరై శృంగారం పంచుకొని మధురంతో అలసి సొలసి పోయే కార్యం కమనీయం  || కల్యాణంతో ||

కొత్త తరహా మాటలు చేష్టలు అరిషడ్వార్గాల మనో భావాలు వెల్లు విరిసే సమయం పెళ్లితో ప్రారంభం
పొరపాట్లు తప్పు ఒప్పులు ఇబ్బందులు దుఃఖాలు నష్టాల కష్టాలుగా సాగే తరుణం వివాహంతో ఆరంభం

అర్థం చేసుకుంటే ఇద్దరిలో పరమార్థం తెలుస్తుంది పరివర్తన చెందుతుంది
సంతోషం ఇచ్చుకుంటే ఆనందం కలుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది

మధురమైన జీవితం మహోత్సవమైన ఉత్తేజం మరొకరి జంటకు పెళ్లితో ఆదర్శం
శుభమైన ముహూర్తం బ్రంహోత్సవమైన ఉత్కంఠం ఎందరికో జీవితాంతం సోపానం  || కల్యాణంతో ||