Showing posts with label గాత్రం. Show all posts
Showing posts with label గాత్రం. Show all posts

Monday, August 14, 2017

గమనించవా నా శృతి భావాలను

గమనించవా నా శృతి భావాలను
వినిపించవా నా ధృతి స్వరాలను
ధ్వనించవా నా కృతి తత్వాలను ... హరా హరా!  || గమనించవా ||

స్వరం శృతిస్తున్న గానమే గాత్రం
గళం స్మరిస్తున్న గంధర్వమే ఘనం
శుభం పలుకుతున్న శోభనమే శరణం

దేహం జీవిస్తున్న విధానమే దైవం
దైవం వరిస్తున్న స్వభావమే జీవం
జీవం విహరిస్తున్న తత్వమే గానం  || గమనించవా ||

మోహం తపిస్తున్న కాలమే తపనం
సూక్ష్మం జీవిస్తున్న క్షణమే వినయం
దాహం పలికిస్తున్న గానమే గమకం

వేదం తరిస్తున్న విజ్ఞానమే కమలం
భావం ఫలిస్తున్న మేధస్సే మధురం
తత్వం తిలకిస్తున్న దేహమే తన్మయం  || గమనించవా || 

Monday, August 8, 2016

పలికించవా నా భావన వినిపించవా నా కీర్తన

పలికించవా నా భావన వినిపించవా నా కీర్తన
సంగీతాల సరిగమలతో పదనిసలనే మెప్పించవా
నా జీవన వేదాన్ని స్వర రాగాల లోకాలకు పంపించవా  || పలికించవా ||

నాలోని విజ్ఞానం వినయమా నా అనుభవం అభినయమా
సర్వాంతరం సంగీత యోగమా నిరంతరం నిజతత్వమా

నా నవ జీవితం నవీనత్వమా నా నూతన జీవనం నందనమా
స్వర భాషలో భావం సంయోగమా శృతి ధ్యాసలో సర్వాంతరమా

అమృతాల పలుకులతో మాతృ భావాల సుగంధాలనే మెప్పించనా
మకరందాల పిలుపులతో మాతృ తత్వాల సవ్వడినే ఒడి చేర్చుకోనా  || పలికించవా ||

శృతిలయలో దాగే స్వర రాగ సంగీతాన్ని స్మరించగా తేనీయమే తెలిసిందిలే
ఒడిలయలో దాగే శ్వాస భావ సంతోషాన్ని స్పందించగా మాతృత్వమే తెలిసేనులే

వేదాల సరిగమలు పదనిసలుగా గజ్జెల మువ్వల సవ్వడితో మృదంగమా
సుస్వరాల పలుకుల చరణములు మాటల రాగాలతో వేదాంత స్వరగానమా

సంగీత జ్ఞానం స్వరాల విజ్ఞానం అనుభవానికి గమనమా
సంపూర్ణ గీతం సందేశ గాత్రం అనుబంధానికి తపనమా  || పలికించవా || 

Friday, July 1, 2016

ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం

ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం
ఈ చరణం చరిత్రకు సరిగమల గమనం  || ఈ గీతం ||

పల్లవితో సాగే నవ జీవనమే మన ప్రావీణ్యం
గాత్రంతో పాడే రాగమే భవ జీవిత సోపానం

గమకాలతో పాడే సంగీతం సాగర నది తీరం
పదనిసలతో సాగే స్వర రాగం కెరటాల కీర్తం

స్వప్త స్వరాలతో సాగే రాగం మధుర స్వరాగం 
నవ గానాలతో పాడే గీతం సుమధుర సుగంధం  || ఈ గీతం ||

పాటకు ప్రాణం పల్లవిగా పాటలో పరిమళం
మాటకు చరితం చరణంతో కలిగే గౌరవం

ప్రతి పదాన్ని భావనతో పాడితే పాటే మధురం
ప్రతి పల్లవి భావనతో సాగితే గీతమే కమనీయం

రాగాలు నవ విధ భావాల సప్త స్వరాలుగా మన నేస్తం
గీతాలు దశ విధ గానాల దిశ దశాబ్దాలుగా మన కోసం  || ఈ గీతం ||