ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం
ఈ చరణం చరిత్రకు సరిగమల గమనం || ఈ గీతం ||
పల్లవితో సాగే నవ జీవనమే మన ప్రావీణ్యం
గాత్రంతో పాడే రాగమే భవ జీవిత సోపానం
గమకాలతో పాడే సంగీతం సాగర నది తీరం
పదనిసలతో సాగే స్వర రాగం కెరటాల కీర్తం
స్వప్త స్వరాలతో సాగే రాగం మధుర స్వరాగం
నవ గానాలతో పాడే గీతం సుమధుర సుగంధం || ఈ గీతం ||
పాటకు ప్రాణం పల్లవిగా పాటలో పరిమళం
మాటకు చరితం చరణంతో కలిగే గౌరవం
ప్రతి పదాన్ని భావనతో పాడితే పాటే మధురం
ప్రతి పల్లవి భావనతో సాగితే గీతమే కమనీయం
రాగాలు నవ విధ భావాల సప్త స్వరాలుగా మన నేస్తం
గీతాలు దశ విధ గానాల దిశ దశాబ్దాలుగా మన కోసం || ఈ గీతం ||

No comments:
Post a Comment