అమ్మా అని పిలిచే పలుకులలోనే ఒక తియ్యని రాగం
తల్లీ అని పలికే మాటల పదాలలోనే ఒక తేనీయ స్వరం || అమ్మా ||
అమ్మా అని పిలిచినా హృదయములో ఒక జీవన నాదం
అమ్మా అని పలికినా మనస్సులో ఒక మమకారపు గీతం
అమ్మగా లాలించే అలనాటి పాటలలో ఒక కమ్మని సంగీతం
అమ్మగా నడిపించే ఆనాటి నడకలలో ఒక నూతన కుసుమం || అమ్మా ||
అమ్మగా ఎదిగినా అమ్మమ్మగా చూసే ప్రేమలో అనురాగం
అమ్మగా ఒదిగినా అమ్మమ్మతో కలిసే తీరులో అనుబంధం
అమ్మవై అమృతాన్ని పంచే అలనాటి జ్ఞాపకం తెలియని దైవం
అమ్మవై విజ్ఞానాన్ని పంచే ఆనాటి విద్యా గీతమే వేదాంత సత్యం || అమ్మా ||

No comments:
Post a Comment