బాబా నీవలె ఎవరు అవతరించెదరు
సాయి నీలాగే ఎవరు ఉదయించెదరు
నీ రూపాన్నే ఇంకెవరు ధరించెదరు
నీ ఆకారాన్నే మరల ఎవరు పొందగలరు
నీ భావ తత్వాలతో ఎవరు జీవించగలరు || బాబా ||
నీలోని ఆత్మ తత్వం మహాత్మగా నిలిచేను
నీలోని వేద భావం మాతృ తత్వమై సాగేను
నీలోని విజ్ఞానం విశ్వ విజ్ఞాన పాండిత్యం
నీలోని వేదాంతం దివ్య జ్ఞాన సాహిత్యం
నీలోని ఓర్పుకు మహా విశ్వమే నిలయమైనది
నీలోని సహనానికి ప్రకృతియే శాంతించినది || బాబా ||
నీలో దాగిన కరుణాదయామృతం ఓ మహా తత్వం
నీలో నిండిన మధురామృతం ఓ గొప్ప నిర్వచనం
నీవు సాగే కాలం అజ్ఞానాన్ని తొలగించే అనుభవం
నీవు నడిచే ప్రదేశం ప్రశాంతతను పొందే యోగం
నీవు లేని లోకం అల్లా కల్లోలమై పోతున్నది
నీవు లేక ఈ జగతి అదో రకమై సాగుతున్నది || బాబా ||

No comments:
Post a Comment