నా తల్లికి నేనే ఒక జీవం
నా తల్లికి నేనే ఒక రాగం
నా తల్లికి నేనే ఒక జీవన తరంగం || నా తల్లికి ||
నాలో దాగిన తన భావమే ఒక పుష్పం
నాలో కలిగే తన గానమే ఒక సంగీతం
నాతోనే తన హృదయం విరిసింది
నాతోనే తన బంధం వెలిసింది
నాలో తన మాతృత్వమే విశ్వమై నిలిచింది
నాలో తన మధురత్వమే జగమై సాగింది || నా తల్లికి ||
నాలో ఒక భావన తెలిపేను తన హృదయం
నాలో ఒక తత్వమే తలిచేను తన స్పందనం
నాతో తన జీవం సాగేను తరతరాలుగా
నాతో తన రాగమే సాగేను చిరకాలముగా
నేనే ఒక వేదమై ఎదిగాను తన లోకంలో
నేనే ఒక గాత్రమై ఒదిగాను తన ఒడిలో || నా తల్లికి ||
నా తల్లికి నేనే ఒక రాగం
నా తల్లికి నేనే ఒక జీవన తరంగం || నా తల్లికి ||
నాలో దాగిన తన భావమే ఒక పుష్పం
నాలో కలిగే తన గానమే ఒక సంగీతం
నాతోనే తన హృదయం విరిసింది
నాతోనే తన బంధం వెలిసింది
నాలో తన మాతృత్వమే విశ్వమై నిలిచింది
నాలో తన మధురత్వమే జగమై సాగింది || నా తల్లికి ||
నాలో ఒక భావన తెలిపేను తన హృదయం
నాలో ఒక తత్వమే తలిచేను తన స్పందనం
నాతో తన జీవం సాగేను తరతరాలుగా
నాతో తన రాగమే సాగేను చిరకాలముగా
నేనే ఒక వేదమై ఎదిగాను తన లోకంలో
నేనే ఒక గాత్రమై ఒదిగాను తన ఒడిలో || నా తల్లికి ||
No comments:
Post a Comment