Friday, July 22, 2016

అమ్మగా జగతిలో ఉదయించావు తల్లిగా లోకంలో ఎదిగావు

అమ్మగా జగతిలో ఉదయించావు తల్లిగా లోకంలో ఎదిగావు
మహాత్మగా విశ్వంలో నిలిచావు పరమాత్మగా అవతరించావు  || అమ్మగా ||

జన్మతో జయంతివై జగతికే సర్వాంతరమైనావు 
జన్మకే ప్రేమామృతమై జాగృతిగా నిలిచివున్నావు
జన్మకు అన్నపూర్ణవై అమరావతిగా అధిరోహించావు
జన్మతో జగన్మాతవై ఎన్నో యుగాలుగా సాగుతున్నావు

అమ్మగా నీవే ప్రతి హృదయంలో మొలిచావు
అమ్మగా నీవే ప్రతి జీవికి తోడై నీడై నిలిచావు

అమ్మగా తల్లిగా మేమే ప్రతి రోజు దైవంలా నిన్నే కొలిచాము
అమ్మగా తల్లి వేరులా మేమే నీతో వృక్షంలా బంధమై జన్మించాము  || అమ్మగా ||

జన్మతోనే ఆత్మ భావాన్ని హృదయంలో జీవింపజేశావు
జన్మతోనే విశ్వ తత్వాన్ని మేధస్సులో ఆలోచింపజేశావు
జన్మతోనే వేద దైవత్వాన్ని దేహంలో ధరింపజేశావు
జన్మతోనే స్నేహ బంధాన్ని మనస్సులో సృష్టించావు

అమ్మగా అమరమై జగతికే స్త్రీ వై జన్మనిచ్చావు
అమ్మగా శ్వాస ధ్యాసవై జీవితాలనే జయించావు  || అమ్మగా ||

No comments:

Post a Comment