మరణించే మహాత్ముల మేధస్సు నాలో ఆలోచనలై సాగునులే
అస్తమించే మహర్షుల విజ్ఞానం నా భావాలలో కొనసాగిపోవునులే || మరణించే ||
మహానుభావుల మహా విజ్ఞానం జగతికే తెలిసిన తన్మయం
మేధావుల మహా జ్ఞానం లోకానికే తెలియని వేదాల తపనం
మానవుడే మాధవుడై జీవించే లోకమే ఈ జగతి
మాధవుడే మహాత్మగా వీక్షించే విశ్వమే ఈ సృష్టి
ప్రతి క్షణం ఒక నిరీక్షణగా తపించే జీవన కాలమే ఋషి వర్యం
ప్రతి సమయం ఒక ధ్యాసగా తలిచే జీవిత కాలమే ఆత్మ స్థైర్యం || మరణించే ||
ఉదయించే జీవుల విజ్ఞానం అస్తమించుటలో వృధాగా మారే కాలంతరం
విజ్ఞానమే లేకున్నా అజ్ఞానిగా జీవించే సమయం అనర్థమయ్యే తరుణం
అనుభవమే ఓర్చుకునే తత్వాన్ని కలిగిస్తూ జీవిత ప్రయాణాన్ని సాగిస్తున్నది
అనుబంధమే నేర్చుకునే తత్వమై నవ భావ జీవన విధానాన్ని వెంబడిస్తున్నది
మరణంతో రూపం వెళ్ళినా జ్ఞానంతో భవిష్య జీవులలో స్థిరంగా ఉండగలను
అస్తమించుటతో సమస్తం నిలిచిపోయినా నా విజ్ఞానం కాలంతో ఉండిపోవును || మరణించే ||

No comments:
Post a Comment