నా హృదయం మరణించేనే నాలో భావన నిలిచిపోయేనే
నా ఆలోచన ఆగిపోయేనే నాలో ధ్యాస విశ్వమై కలిసిపోయేనే || నా హృదయం ||
మరణంతో మౌనమై మేధస్సులో భావాలే శూన్యమై
హృదయంతో లీనమై జగతిలో బంధాలే నిర్జీవమై
గగనాన్ని తాకే నా ఆలోచన ప్రకృతిలో ఒదిగిన నా భావన
నేలను తాకే నా దేహము విశ్వంలో ఆత్మగా సాగే ఆవేదన || నా హృదయం ||
జగమంతా ఓ జ్ఞాపకమై మేధస్సులో సు చరితగా నిలిచిపోయేనే
లోకమంతా ఓ మహా కార్యమై మనస్సులో గుర్తుగా ఉండిపోయేనే
వేదాంతపు విజ్ఞానం మేధస్సులో దాగిన మహా కావ్య గ్రంథమే
వేదనల అనుభవం హృదయంలో నిండిన మహా కార్య ధీక్షయే || నా హృదయం ||

No comments:
Post a Comment