అమ్మా నీ జన్మకు ఏదీ సాటి రాదు నీ ప్రేమకు అంతం లేదు
అమ్మగా నీవు జన్మించే భావం మరో జన్మనే సృష్టించే తత్వం || అమ్మా ||
జన్మలనే ఇచ్చే దేవతగా అవతరించావు భూలోక భవ విశ్వంలో
జన్మించి జన్మనిస్తూ ఎన్నో జన్మలనే నీ జీవంతో సృష్టిస్తున్నావు
జగతికే మరో జన్మంటు ఉంటే నీవే మరో జగతిని నీవుగా సృష్టించెదవు
నీలోని స్వభావ తత్వాలే నవ జీవికి ఉదయించే భావాలను కలిపించెదవు
అమ్మగా నీవు పంచే మమకారం కాలంతో ఎదిగే నీ ప్రతి రూప జీవం
అమ్మగా నీవు ఇచ్చే బంధం అభినయమై జీవితాన్ని సాగించే ధర్మం || అమ్మా ||
జన్మించే జీవులకు కాలంతో విజ్ఞానాన్ని అందిస్తూ అనుభవాన్నే నేర్పుతున్నావు
జన్మతో మరో జీవికి జన్మను ప్రసాదిస్తూ సోదర తత్వాల స్నేహ బంధాన్ని ఇచ్చేవు
మానవులలోనే కాక ప్రతి జీవిలో నీవు అమ్మగా ఎన్నెన్నో జన్మలనే సృష్టిస్తున్నావు
ప్రతి జీవికి అమ్మగా ప్రతి రోజు ఎదుగుదలను ఇస్తూ విశ్వానికి పరిచయిస్తున్నావు
అమ్మంటేనే మహా తత్వం అపురూపమైన భావాలతో లోకాన్ని నడిపించే మహోత్తరం
అమ్మంటేనే మహా జీవం అద్భుతమైన వేద విజ్ఞానాన్ని పరిశోధించే కాల జ్ఞాన నవోత్తరం || అమ్మా ||

No comments:
Post a Comment