కవి మాటలలో ప్రతి పదానికి అనంతమైన అర్థం పరమార్థమై ఉంటుంది
కవి భాషలో ప్రతి వాక్యం శ్లోకమై గ్రంథంలో పరిశోధనమై నిలిచి పోతుంది || కవి మాటలలో ||
కవి హృదయంలో జగమంతా నిండి విశ్వ విజ్ఞానమే అన్వేషిస్తుంది
కవి మేధస్సులో అంతరిక్షమే పండి పాండిత్యమై పరవశిస్తుంది
కవి గానంలో గమకం రాగ గాత్రమై వేదాంతం పలుకుతుంది
కవి గీతంలో సంగీతం స్వర గానమై మాధుర్యం పండుతుంది
కవి జీవించే విధానంలోనే మహాత్మ తత్వాలు నిలయమై పోతాయి
కవి కొనసాగే మార్గంలోనే మహర్షి ఋషతత్వాలు ఆధారమవుతాయి || కవి మాటలలో ||
కవి తెలిపిన హితమే జగతిలో సత్యమై నిలుస్తుంది
కవి చూపించిన విజ్ఞానమే విశ్వంలో కాలమై వరిస్తుంది
కవి భావాలు ఆలోచలనలలో మిళితమై దివ్య స్వభావాలుగా జీవిస్తాయి
కవి తత్వాలు మేధస్సులలో పరిమళమై మహా వేదాలుగా సాగుతాయి
కవి కవితలోని జ్ఞానం సుజ్ఞానమై గుణ సద్గుణాలుగా విశేషింపబడుతాయి
కవి కవితలోని వేదం వేదాంతమై భావ స్వభావాలుగా విస్తరింపబడుతాయి || కవి మాటలలో ||

No comments:
Post a Comment