ఆత్మగా వచ్చాను మహాత్మగా ఎదిగాను ఈ లోకానికి
మౌనమై ఉన్నాను తత్వమై ఒదిగాను ఈ విశ్వానికి || ఆత్మగా ||
భావంతో ఉదయించా స్వభావంతో సాగించా నా కాలాన్ని
తత్వంతో ప్రకాశించా మాతృత్వంతో ధ్యానించా నా సమయాన్ని
జగమంతా జీవమై శ్వాసతో ఒదిగిపోయా నాలోనే
విశ్వమంతా ఊపిరినై దేహంలో నిలిచిపోయా నాలోనే
ధ్యాసతో యోగమై సంయోగ ధ్యానమై ధరణిలో నిలయమయ్యాను
వేదంతో భావమై తత్వంతో మాతృత్వమై దివిలో పదిలమయ్యాను || ఆత్మగా ||
ఆకాశంతో రూపమై విజ్ఞానంతో మేఘ వర్ణమై తేజస్సుగా ప్రకాశించాను
ప్రకృతితో జీవమై భావంతో శ్వాస దేహమై ఉత్తేజముగా జ్వలించాను
దైవత్వంతో జీవిస్తూ అద్వైత్వమై అవతార మూర్తిగా సాగుతున్నాను
దైవంతో శాంతిస్తూ అపార మహా తత్వమై అవధూతగా వెళుతున్నాను
మేధస్సులో అన్వేషణతో ఆలోచనలో వివేకంతో ప్రయాణిస్తున్నా
కార్యములో పర్యవేక్షణతో విధానంలో సిద్ధాంతంతో గమనిస్తున్నా || ఆత్మగా ||

No comments:
Post a Comment