అమ్మా అనే పిలుపులో కమ్మని రాగమే తేనీయం
అమ్మా అనే తొలి పలుకులో మధురమే సుగంధం || అమ్మా ||
నీ భావనతోనే నేను ఉదయించాను ఓ రూప వర్ణమై
నీ ఆలోచనతోనే నేను ఎదిగాను ఓ ఆకార స్వర జీవమై
నీవు పలికే పిలుపులలో నాలో కలిగేను ఓ ఉత్తేజం
నీవు తెలిపే పలుకులలో నాలో తెలిసేను ఓ కర్తవ్యం || అమ్మా ||
నీ మాటల తరంగాలు నన్ను పిలిచేను వేణు గానంలా
నీ బాటల మార్గాలే నన్ను నడిపించేను ఓ బాటసారిలా
నీవే నా ఆశయమై నీ కోసమే నేను జీవిస్తున్నా ఆయుస్సునై
నీవే నా జీవన జీవమై నీ కోసమే నేను ఉదయిస్తా మరో జన్మనై || అమ్మా ||

No comments:
Post a Comment