Showing posts with label పుష్పం. Show all posts
Showing posts with label పుష్పం. Show all posts

Friday, June 30, 2017

ఎవరు మీరు ఎవరు ఎంతటివారు భావాలకే తోచినవారు

ఎవరు మీరు ఎవరు ఎంతటివారు భావాలకే తోచినవారు
ఎవరు మీరు ఎవరు ఏనాటివారు తత్వాలకే తెలిసినవారు

ఎక్కడున్నా మీరు మహోదయ ప్రజ్వలమే
ఎలావున్నా మీరు మహోన్నత ప్రదర్శనమే   || ఎవరు ||

ప్రకృతిలో పరవశించిపోయే పరిశోధనమా
జగతిలో జలమైపోయే జలధార జీవత్వమా

ఉదయించే పుష్పంలో సుగంధాల పూర్ణోదయమా
జన్మించే స్వర జీవంలో సంకీర్తనల జీర్ణోదయమా   || ఎవరు ||

ప్రకృతిలో సాగే అన్వేషణ మహా పరిశోధనమా
జగతిలో కొనసాగే ఆలోచన మహా ప్రభంజనమా

ఉదయత్వంలో దాగిన మహా ప్రకృతి స్వరూపమా
జీవత్వంలో ఒదిగిన మహా ఆకృతి మీ ప్రతిబింబమా  || ఎవరు || 

Wednesday, December 21, 2016

నీలో నేనే ఉదయిస్తున్నా నీలో నేనే జీవిస్తున్నా

నీలో నేనే ఉదయిస్తున్నా నీలో నేనే జీవిస్తున్నా
నీలో నేనే ఆకాశమై నీలో నేనే ప్రకృతిగా ఉన్నా

నీకై నేనే విశ్వానికి తోడుగా జగతికి జతగా ఉన్నా
నీకై నేనే మనస్సుకు నీడగా వయస్సుకు జాడగా ఉన్నా  || నీలో నేనే ||

నీవు నేను కలసిన రూపం సువర్ణ వర్ణాల మహా సుందర తేజం
నీవు నేను చూసిన భావం సుగంధ పరిమళాల సువర్ణ పుష్పం

నీవు నేను ఒకటైన సమయం సువర్ణ భావాల సంబంధం
నీవు నేను ఒకటైతే సంతోషం సుమధుర గంధాల నేస్తం

నీవు నేను ఎక్కడ ఉన్నా అనువైన అనురాగాల అనుబంధం
నీవు నేను ఎలా ఉన్నా అపారమైన అనుభవాల ఆనందనం    || నీలో నేనే ||

నీవు నేను నిలిచిన స్థానం తేనీయ గంధాలు పూచే పర్వతం  
నీవు నేను తలచిన గమ్యం సుగంధ పుష్పాలు వెలిసే శిఖరం

నీవు నేను జన్మించిన ప్రదేశం పరమాత్ముని ప్రార్థించే ఆలయం
నీవు నేను వెలసిన ప్రాంగణం పరంధాముని పూజించే గోపురం

నీవు నేను మరచిన తరుణం మనస్సులు కలసిన అలనాటి మౌనపు గమనం
నీవు నేను తిలకించిన సమయం వయస్సులు తెలిపిన మోహన మంత్రణం   || నీలో నేనే || 

Monday, December 12, 2016

ఏ దివిలో విరిసిన నవ పారిజాతమో ఈ భువిపై వెలిసిన దివ్య సుందరివి నీవే

ఏ దివిలో విరిసిన నవ పారిజాతమో ఈ భువిపై వెలిసిన దివ్య సుందరివి నీవే
నీ దేహంలో వెదజల్లిన సుందరమే నాలో సువర్ణమై సిరి కాంతులే విరజిమ్మేను  || ఏ దివిలో ||

సుగంధ పుష్పంలో మకరందమై తేనీయమే పంచుకోనా
సువర్ణ శిల్పంలో సుందరమై సంతోషాన్నే తిలకించుకోనా

అమృత వర్షిణిలో లీనమై హృదయాన్నే ఇచ్చుకోనా
అదర దరహాసంతో అఖిలమై చందనమే తెలుపుకోనా  || ఏ దివిలో ||

తారల తీరములలో నవరత్నమై నిన్ను దాచుకోనా
అలల తీరములలో అడుగులనై నీతో నడుచుకోనా

మువ్వల సందడిలో ముత్యమునై మురిపించుకోనా
భావాల స్వభావాలతో దేహ బంధానై నిన్నే హత్తుకోనా  || ఏ దివిలో || 

Wednesday, December 7, 2016

ఆత్మవు నీవు పరమాత్మవు నీవు

ఆత్మవు నీవు పరమాత్మవు నీవు
మహాత్ములకు మహా తత్వానివి నీవు
మహా ఋషులకు మహర్షివి నీవు
పరంధామగా కరుణించే పరతత్వానివి నీవు  || ఆత్మవు ||

ఆత్మగా వెలిసిన రూపం మహా ఆత్మగా దాల్చిన ఆకారం పరమాత్మగా ఒదిగేనా
మహాత్మగా జీవించే భావం మహర్షిగా ధ్యానించే తత్వం పరంధామగా నిలిచేనా
దేవర్షిగా దైవత్వం బ్రంహర్షిగా బృహత్వం పరతత్వాలతో పరంజ్యోతిగా సాగేనా  || ఆత్మవు ||

వేదాల భావం వేదాంత తత్వం గ్రంధాలలో లిఖించే దైవం ఏనాటి వేదానిదో
కాలం గమనం దేహం ధ్యానం శ్వాసగా ఒదిగే నిత్య రూపం ఏనాటి బంధానిదో
ప్రాణం నేస్తం పత్రం పుష్పం ఒకటిగా సాగే ప్రయాణ దూరం ఏనాటి కాలానిదో  || ఆత్మవు ||

Wednesday, November 9, 2016

ఏనాటిదో సుగంధం ఎందుకో అతి మధురం

ఏనాటిదో సుగంధం ఎందుకో అతి మధురం
ఎవరిదో సువర్ణం ఏమిటో మహా మనోహరం         || ఏనాటిదో  ||

విరిసే కమలం మధురాతి మధురం సుమధురాల సుగంధం
వెలిసే పద్మం మనోహర వర్ణం మహనీయమైన సువర్ణ తేజం

లలిత కళా సృష్టికి మహా మధుర కమలం
విశ్వ కళా జగతికి మహా మనోహర కుసుమం       || ఏనాటిదో  ||

కలువ కొలనులో వెలసిన దివ్యమైన పారిజాత పద్మం
సరస్సు సెలయేరులో విరిసిన నవనీయ పావన పుష్పం

ఉద్యానవనములో విరబూసే మకరంద మందారం మహా మహనీయమే
ఉపవనములో రమణీయమైన శృంగార అలంకార కమలం కమనీయమే  || ఏనాటిదో  || 

Friday, September 23, 2016

సిరిమల్లె పువ్వా సింధూర పువ్వా సిరి వెన్నెలలో నవ్వవా

సిరిమల్లె పువ్వా సింధూర పువ్వా సిరి వెన్నెలలో నవ్వవా
చామంతి పువ్వా చిన్నారి పువ్వా చిరు గాలితో సిగ్గు పడవా

విరబూసే పువ్వులా విల విలమంటూ నవ్వుతూ పూయవా
కల కలమంటూ గల గలమంటూ సుగంధంతో పూయవా  || సిరిమల్లె ||

పువ్వులా విరబూసే నీ నవ్వులో సుగంధాల సుమధురమే దాగున్నదా
పుష్పంలా వికసించే నీ రంగులో సువర్ణాల మేలిమి వర్ణం దాగున్నదా

మొక్కలలోనే మొగ్గవై ప్రతి రోజూ పూల తోటలో పదిలంగా పూసెదవా
మొక్కలలోనే మక్కువై ప్రేమికులకు నీవే ప్రశాంతతను పంచెదవా   || సిరిమల్లె ||

ప్రతి గాలి శ్వాసలో నీవే పుష్పాల సుగంధమై మనస్సునే దాచెయ్యవా
ప్రతి చోట గాలితో నీవే మధురమైన సుగంధాన్ని శ్వాసకు అందించవా

సిరి జల్లుల తోటి  కురిసే వేళ పూచే నీ లేత సువాసనతో మైమరిపించావా
ప్రాణ వాయువును నీవే సువాసనలతో స్వచ్ఛంగా ప్రతి జీవికి అందించవా  || సిరిమల్లె ||

Thursday, July 14, 2016

నా తల్లికి నేనే ఒక జీవం

నా తల్లికి నేనే ఒక జీవం
నా తల్లికి నేనే ఒక రాగం
నా తల్లికి నేనే ఒక జీవన తరంగం  || నా తల్లికి ||

నాలో దాగిన తన భావమే ఒక పుష్పం
నాలో కలిగే తన గానమే ఒక సంగీతం 

నాతోనే తన హృదయం విరిసింది
నాతోనే తన బంధం వెలిసింది

నాలో తన మాతృత్వమే విశ్వమై నిలిచింది
నాలో తన మధురత్వమే జగమై సాగింది       || నా తల్లికి ||

నాలో ఒక భావన తెలిపేను తన హృదయం
నాలో ఒక తత్వమే తలిచేను తన స్పందనం

నాతో తన జీవం సాగేను తరతరాలుగా
నాతో తన రాగమే సాగేను చిరకాలముగా

నేనే ఒక వేదమై ఎదిగాను తన లోకంలో
నేనే ఒక గాత్రమై ఒదిగాను తన ఒడిలో    || నా తల్లికి ||

Monday, July 11, 2016

నా నేత్రం తాకేను కమల కిరణం

నా నేత్రం తాకేను కమల కిరణం
నా భావం తెలిపేను సూర్య తేజం
నా ఆలోచన చూపించేను దివ్య పుష్పం
నా మేధస్సు తలిచేను మధుర సుగంధం  || నా నేత్రం ||

నాలోనే దాగిన కమల పుష్పం నీకై తలచిన సుగంధం
నాలో నిండిన సూర్య తేజం నీకై వెలసిన ఆశా కిరణం

నాలో నిలిచిన నవ భావం నిన్నే తాకిన గాలి గంధర్వం
నాలో పలికిన స్వర రాగం నీతోనే కలిసిన మౌన వేదం   || నా నేత్రం ||

నీకై నేను ఉదయించాను సూర్య కిరణమై
నీకై నేను వేచివున్నాను మధుర స్వప్నమై

నీ నాభిలో నిలయమై ఉన్నాను ఓ నక్షత్రపు బిందువులా
నీ రూపంలో నిమగ్నమై ఉంటాను ఆకాశ భావ వర్ణములా  || నా నేత్రం || 

Tuesday, May 31, 2016

నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు

నీలోనే నేనున్నాను నాలోనే నీవున్నావు
నీతోనే నేనున్నాను నాతోనే నీవున్నావు

నీవు నేను ఒకరికి ఒకరు కలిసే జీవిస్తాము
నీవు నేను ఒకరికి ఒకరై కలిసే ప్రయాణిస్తాము  || నీలోనే ||

ఏనాటికైనా అనుబంధంతోనే ముందుకు సాగాలి
ఎప్పటికైనా అనురాగంతోనే ముందడుగు వేయాలి

ఎవరికి ఎవరు తెలియకున్నా పరిచయంతోనే కలవాలి
ఎవరికి ఎవరు లేకున్నా సంబంధంతోనే కలిసి పోవాలి  

ఎవరితో ఎవరు జీవిస్తారో జగతికే తెలియాలి
ఎవరితో ఎవరు ఉంటారో లోకమే తెలపాలి  || నీలోనే ||

నీవు లేనిదే నాలో కలిగెనే మౌనం
నీవు లేకనే నాలో సాగెనే శోకం

నీవు లేని క్షణం మనస్సులో కలహం
నీవు లేని నిమిషం యదలో విషాదం

నీవే నాలో జీవించే మధుర స్వప్నం
నీవే నాలో స్మరించే సుగంధ పుష్పం    || నీలోనే ||