Wednesday, December 21, 2016

నీలో నేనే ఉదయిస్తున్నా నీలో నేనే జీవిస్తున్నా

నీలో నేనే ఉదయిస్తున్నా నీలో నేనే జీవిస్తున్నా
నీలో నేనే ఆకాశమై నీలో నేనే ప్రకృతిగా ఉన్నా

నీకై నేనే విశ్వానికి తోడుగా జగతికి జతగా ఉన్నా
నీకై నేనే మనస్సుకు నీడగా వయస్సుకు జాడగా ఉన్నా  || నీలో నేనే ||

నీవు నేను కలసిన రూపం సువర్ణ వర్ణాల మహా సుందర తేజం
నీవు నేను చూసిన భావం సుగంధ పరిమళాల సువర్ణ పుష్పం

నీవు నేను ఒకటైన సమయం సువర్ణ భావాల సంబంధం
నీవు నేను ఒకటైతే సంతోషం సుమధుర గంధాల నేస్తం

నీవు నేను ఎక్కడ ఉన్నా అనువైన అనురాగాల అనుబంధం
నీవు నేను ఎలా ఉన్నా అపారమైన అనుభవాల ఆనందనం    || నీలో నేనే ||

నీవు నేను నిలిచిన స్థానం తేనీయ గంధాలు పూచే పర్వతం  
నీవు నేను తలచిన గమ్యం సుగంధ పుష్పాలు వెలిసే శిఖరం

నీవు నేను జన్మించిన ప్రదేశం పరమాత్ముని ప్రార్థించే ఆలయం
నీవు నేను వెలసిన ప్రాంగణం పరంధాముని పూజించే గోపురం

నీవు నేను మరచిన తరుణం మనస్సులు కలసిన అలనాటి మౌనపు గమనం
నీవు నేను తిలకించిన సమయం వయస్సులు తెలిపిన మోహన మంత్రణం   || నీలో నేనే || 

No comments:

Post a Comment