ఏమి భావమో ఎంతటి తత్వమే ఋషిగా ఎదగాలని
ఏమి రూపమో ఎంతటి జీవమో మహర్షిగా ఉండాలని
మహాత్మగా పరమాత్మమే తెలుసుకోవాలని ఆత్మగా ఒదగాలని
దేవర్షిగా బ్రహ్మత్వమే పొందాలని బ్రంహర్షిగా విజ్ఞానం కలగాలని
పరదైవం పరభావం పరతత్వం మనలోనే నిత్యం నిండుకోవాలని || ఏమి భావమో ||
ఎంతటి రూపమైనా మహా విజ్ఞానం మేధస్సులోనే ధరించుకోవాలని
ఎంతటి గుణమైనా మహా ప్రజ్ఞానం ఆలోచనలలోనే దాచుకోవాలని
ఎంతటి స్వభావమైనా మహా వేదాంతం భావాలలోనే అందుకోవాలని
ఎంతటి తత్వమైనా మహా పాండిత్యం హృదయంలోనే నింపుకోవాలని || ఏమి భావమో ||
ఏమని తలచిన పరదైవ రూపం పరమాత్మగా అవతరించేనే
ఏమని తపించిన పరభావ తత్వం పరంధామగా అధిరోహించేనే
ఏమని గమనించిన పరరూప వేదం పరంజ్యోతిగా ఆరోహించేనే
ఏమని ఊహించిన పరతత్వ భావం పరమానందగా అధిష్టించేనే || ఏమి భావమో ||

No comments:
Post a Comment