Showing posts with label పరతత్వం. Show all posts
Showing posts with label పరతత్వం. Show all posts

Friday, December 9, 2016

ఏమి భావమో ఎంతటి తత్వమే ఋషిగా ఎదగాలని

ఏమి భావమో ఎంతటి తత్వమే ఋషిగా ఎదగాలని
ఏమి రూపమో ఎంతటి జీవమో మహర్షిగా ఉండాలని
మహాత్మగా పరమాత్మమే తెలుసుకోవాలని ఆత్మగా ఒదగాలని
దేవర్షిగా బ్రహ్మత్వమే పొందాలని బ్రంహర్షిగా విజ్ఞానం కలగాలని
పరదైవం పరభావం పరతత్వం మనలోనే నిత్యం నిండుకోవాలని  || ఏమి భావమో ||

ఎంతటి రూపమైనా మహా విజ్ఞానం మేధస్సులోనే ధరించుకోవాలని
ఎంతటి గుణమైనా మహా ప్రజ్ఞానం ఆలోచనలలోనే దాచుకోవాలని
ఎంతటి స్వభావమైనా మహా వేదాంతం భావాలలోనే అందుకోవాలని
ఎంతటి తత్వమైనా మహా పాండిత్యం హృదయంలోనే నింపుకోవాలని  || ఏమి భావమో ||

ఏమని తలచిన పరదైవ రూపం పరమాత్మగా అవతరించేనే
ఏమని తపించిన పరభావ తత్వం పరంధామగా అధిరోహించేనే
ఏమని గమనించిన పరరూప వేదం పరంజ్యోతిగా ఆరోహించేనే
ఏమని ఊహించిన పరతత్వ భావం పరమానందగా అధిష్టించేనే  || ఏమి భావమో ||