భావానికే బంధమై తత్వానికే రూపమై
విశ్వానికే జీవమై జగతికే ధ్యానమై
సూర్యుని తేజముతో దేహమై ఆకాశ వర్ణముతో జీవిస్తున్నానులే || భావానికే ||
నా ప్రతి రూపము ప్రతి బింభము సముద్రమై కనిపిస్తున్నదే
నా ప్రతి భావము ప్రతి తత్వము సరస్సుగా ప్రవహిస్తున్నదే
నా ప్రతి జీవము ప్రతి దేహము సెలయేరులా ధ్వనిస్తున్నదే
నా ప్రతి తేజము ప్రతి వర్ణము సెలధారజలగా జ్వలిస్తున్నదే || భావానికే ||
నాలోని భావానికే నాలోని తత్వానికే ప్రతి అణువు జీవిస్తున్నదే
నాలోని జీవానికే నాలోని శ్వాసకే ప్రతి అణువు స్పందిస్తున్నదే
నాలోని దేహానికే నాలోని తేజానికే ప్రతి అణువు కనిపిస్తున్నదే
నాలోని సుగంధానికే నాలోని సువర్ణానికే ప్రతి అణువు మెరుస్తున్నదే || భావానికే ||

No comments:
Post a Comment