Wednesday, December 21, 2016

మరణమా మౌనమా అంతిమ తీర్పు ఏదో చెప్పగలవా

మరణమా మౌనమా అంతిమ తీర్పు ఏదో చెప్పగలవా
మరణమా బంధమా అసలైన తీర్పు ఏదో తెలుపగలవా

మరణంతో సత్యం మౌనమై నిలిచిపోయిందా
మరణంతో చట్టం బంధమై తల్లడిల్లిపోయిందా   || మరణమా ||

న్యాయంతో విచారించి అసలైన తీర్మాణం చేయగలవా
వివరాలను సేకరించి మహా సత్యాన్ని చర్చించగలవా

విచారణ జరిపించగా పరిష్కారాన్ని నిర్ణయించగలవా
పరిశోధనతో సరైన మార్పును శిక్షణగా విధించగలవా

సమావేశంలో అధ్యక్షత వహిస్తూ న్యాయంతో గెలిచి చూపగలవా
సమావేశంతో తప్పొప్పులను చర్చిస్తూ చట్టాన్ని గెలిపించగలవా

ఏ అక్రమాలతో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సత్యంతో పోరాడగలవా
ఏ ఆవేదనలతో ఎన్ని వివాదాలు ఎలా జరిగినా ధర్మంతో నిలువగలవా  || మరణమా ||

శాసనాలు సభలో తెలిపినట్లు అర్హులకు శిక్షను కల్పించగలవా
రాజ్యాంగములో ఉన్న న్యాయ నీతి శాస్త్రములతో శిక్షించగలవా

రాజ్య పాలన అధికారంతో న్యాయ శాస్త్రాన్ని మార్చకుండ ఉండగలవా
విమర్శనలు ఎన్నున్నా సరైన దానినే న్యాయాధిపతికి సూచించగలవా

ప్రశంసల ప్రస్తావన సంభాషణములు ఎన్నైనా న్యాయాన్నే నిలుపగలవా
సమాజంలో కలిగే అమానుషమైన పోరాటాలను శాంతంగా ముగించగలవా

న్యాయ స్థానాలు ఎన్నున్నా చట్టాల శాఖలు ఎన్నైనా సత్య ధర్మాన్ని కాపాడగలవా
ప్రమాణాలు ఎన్ని చేసినా శాసనాలు ఎన్నున్నా హితమైన విజ్ఞానాన్ని రక్షించగలవా  || మరణమా || 

No comments:

Post a Comment