Tuesday, December 20, 2016

ఇదే మన భూగోళం ఇదే మన మహా విశ్వం ఇదే మన మహా జగతి లోకం

ఇదే మన భూగోళం ఇదే మన మహా విశ్వం ఇదే మన మహా జగతి లోకం
ఇదే మన భావం ఇదే మన వేదం ఇదే మన తత్వం ఇదే మన జీవ కాలం  || ఇదే మన భూగోళం ||

పాతాళము నుండి ఆకాశ అంతరిక్షము దాక మన కోసమే ఉన్నది ప్రకృతి
ఏ రూపమైన ఏ వర్ణమైన ఏ ఆకారమైన ఏ సుగంధమైనా మన నేస్తానిదే

విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఏ ప్రకృతి ప్రతి రూపాన్నైనా తిలకించవచ్చు
లోకంలో దేనినైనా సందర్శించవచ్చు ఏ ప్రకృతి తత్వాన్నైనా గమనించవచ్చు

ఆకలికై ఆహారం దాహానికై నీరు ఊపిరికై గాలి స్థానానికి భూమి ఆకాశం మన ప్రాణం కోసమే
కావాలని తెలిపే భావం వద్దని సూచించే స్వభావం తెలియకుండా కలిగే తత్వం మనలోనే  || ఇదే మన భూగోళం ||

విశ్వ జగతిలో భూగోళం విశిష్టత బహు శాస్త్రీయమైన మర్మాంతర కక్ష్యల నిర్మాణ విధానం
భూగోళంలో నిర్మితమైన వివిధ రకాల రూపాలు బహు పరిశోధనల మాంత్రిక విజ్ఞాన వేదం

వివిధ కాలాల వాతావరణ ఋతు పవనాలు ప్రకృతికి జీవన ఉన్నతికి శరీరత్వానికి ప్రతిష్ఠతం
వివిధ భావాల వాతావరణ పరిస్థితుల ప్రకంపన ప్రభావాలు సృష్టిలో కలిగే మార్పుల సందిగ్ధం

ఈ అపూర్వ భూగోళం బ్రంహాండమైన మహా విజ్ఞాన కుటీర క్షేత్రపు లోకం
ఈ జగతి విశ్వ కళాశాలగా జీవించే మానవ ప్రయోగ నిర్మాణాత్మక కేంద్రం  || ఇదే మన భూగోళం || 

No comments:

Post a Comment