Wednesday, December 14, 2016

ఓ జీవా మహా జీవా చిరంజీవా నీవే జై చిరంజీవా

ఓ జీవా మహా జీవా చిరంజీవా నీవే జై చిరంజీవా
ఓ దేవా మహా దేవా మహదేశ్వరా నీవే మహేశ్వరా

ఈ జగతిలో ఎక్కడ ఏ జీవి జన్మించినా నీ రూప తత్వమే చిరంజీవా
ఈ విశ్వంలో ఎక్కడ ఏ రూపం ధ్యానించినా నీ జీవత్వమే పరమేశ్వరా  || ఓ జీవా ||

ఏ లోకాన్ని దర్శించినా నీ రూపమే వెలిసింది
ఏ ప్రదేశాన్ని చూసినా నీ ధ్యానమే తెలిసింది

ఏ శబ్దం వింటున్నా నీ ఓంకారమే పిలిచింది
ఏ స్వరం వస్తున్నా నీ లయకారమే పలికింది

ఏ రాగం పలుకుతున్నా నీ బంధమే తెలుపుతుంది
ఏ గానం తలచుకున్నా నీ స్వరమే వినిపిస్తుటుంది   || ఓ జీవా ||

ప్రతి జీవి దేహంలో ఓంకారమై ఆలయంగా కొలువై ఉన్నావు
ప్రతి జీవి శ్వాసలో లయకారమై దేవాలయంగా వెలిసున్నావు

ప్రతి రూపంలో ప్రత్యక్షమై ప్రతి స్వరూపంతో దర్శనమిస్తావు
ప్రతి ఆకారంలో ప్రవేశమై ప్రతి శ్వాసతో ఆత్మవై జీవిస్తున్నావు

ప్రతి భావంలో స్వభావమై నీవే వేదాన్ని తెలుపుతున్నావు
ప్రతి తత్వంలో పరతత్వమై నీవే జ్ఞానాన్ని భోదిస్తున్నావు   || ఓ జీవా ||

No comments:

Post a Comment