Tuesday, December 6, 2016

హృదయం మధురం కిరణం అరుణం

హృదయం మధురం కిరణం అరుణం
సమయం తరుణం తపనం చరితం
ప్రేమం ప్రాణం ప్రియం నేస్తం
మౌనం భావం మోహం వేదం
గానం గీతం రాగం గాత్రం                         || హృదయం ||

యుగమే తరమై లయమే లీనమై పోయేనా
నిత్యం సత్యం అనుకున్నా ధర్మం దైవం తలచేనా
దేహం జీవం ఒకటైనా శరీరం ఆకారం ఒకటైపోవునా

సంగీతం సంతోషం ఆనందం అదృష్టం వరించేనా
రూపం భావం దేహం జీవం ఒకటిగా కలిసిపోయేనా   || హృదయం ||

తేజం వర్ణం పత్రం గంధం సుందరమై మెరిసిపోయేనా
స్వరమే వరమై నేత్రమే చిత్రమై కనిపించి వినిపించేనా
మార్గం గమ్యం కాలం క్షణమై కరిగిపోతూ ప్రయాణించేనా

మేఘం వర్షం కదిలిపోయి తరిగిపోతూ ప్రవహించేనా
బంధం భాష్పం ముడిపడిపోయి సంబంధమయ్యేనా  || హృదయం || 

No comments:

Post a Comment