ఏ దివిలో విరిసిన నవ పారిజాతమో ఈ భువిపై వెలిసిన దివ్య సుందరివి నీవే
నీ దేహంలో వెదజల్లిన సుందరమే నాలో సువర్ణమై సిరి కాంతులే విరజిమ్మేను || ఏ దివిలో ||
సుగంధ పుష్పంలో మకరందమై తేనీయమే పంచుకోనా
సువర్ణ శిల్పంలో సుందరమై సంతోషాన్నే తిలకించుకోనా
అమృత వర్షిణిలో లీనమై హృదయాన్నే ఇచ్చుకోనా
అదర దరహాసంతో అఖిలమై చందనమే తెలుపుకోనా || ఏ దివిలో ||
తారల తీరములలో నవరత్నమై నిన్ను దాచుకోనా
అలల తీరములలో అడుగులనై నీతో నడుచుకోనా
మువ్వల సందడిలో ముత్యమునై మురిపించుకోనా
భావాల స్వభావాలతో దేహ బంధానై నిన్నే హత్తుకోనా || ఏ దివిలో ||

No comments:
Post a Comment