Showing posts with label నాభి. Show all posts
Showing posts with label నాభి. Show all posts

Wednesday, January 25, 2017

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నీ కరుణ దీవెనలు మాకు శుభదాయకం

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో నీ కరుణ దీవెనలు మాకు శుభదాయకం
ఎక్కడ ఉంటావో ఎలా ఉంటావో నీ ఆశీర్వాదములు మాకు ఆనందాయకం  || ఎక్కడ ||

ధామ పరులకు పరంధామవు నీవే
ఆత్మ జ్ఞానులకు పరమాత్మవు నీవే
హిత పరులకు పురోహితుడవు నీవే
ప్రజల పాలకులకు ప్రజాపతివి నీవే
శోధన పరులకు పరిశోధకుడవు నీవే
నాభి పద్మములకు పద్మనాభవు నీవే    || ఎక్కడ ||

భువన వాసులకు మహా ప్రభువు నీవే
జ్యోతి వెలుగులకు పరంజ్యోతివి నీవే
పుర నివాసులకు పురందరుడవు నీవే
ఆనంద పరులకు పరమానందవు నీవే
ప్రతిభ పరులకు ప్రతిభావంతుడవు నీవే
ఉత్తమ పురుషులకు పురుషోత్తమవు నీవే    || ఎక్కడ || 

Monday, July 11, 2016

నా నేత్రం తాకేను కమల కిరణం

నా నేత్రం తాకేను కమల కిరణం
నా భావం తెలిపేను సూర్య తేజం
నా ఆలోచన చూపించేను దివ్య పుష్పం
నా మేధస్సు తలిచేను మధుర సుగంధం  || నా నేత్రం ||

నాలోనే దాగిన కమల పుష్పం నీకై తలచిన సుగంధం
నాలో నిండిన సూర్య తేజం నీకై వెలసిన ఆశా కిరణం

నాలో నిలిచిన నవ భావం నిన్నే తాకిన గాలి గంధర్వం
నాలో పలికిన స్వర రాగం నీతోనే కలిసిన మౌన వేదం   || నా నేత్రం ||

నీకై నేను ఉదయించాను సూర్య కిరణమై
నీకై నేను వేచివున్నాను మధుర స్వప్నమై

నీ నాభిలో నిలయమై ఉన్నాను ఓ నక్షత్రపు బిందువులా
నీ రూపంలో నిమగ్నమై ఉంటాను ఆకాశ భావ వర్ణములా  || నా నేత్రం ||