Showing posts with label సరిగమ. Show all posts
Showing posts with label సరిగమ. Show all posts

Friday, July 1, 2016

ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం

ఈ గీతం సంగీతం ఈ రాగం సుస్వరాగం
ఈ చరణం చరిత్రకు సరిగమల గమనం  || ఈ గీతం ||

పల్లవితో సాగే నవ జీవనమే మన ప్రావీణ్యం
గాత్రంతో పాడే రాగమే భవ జీవిత సోపానం

గమకాలతో పాడే సంగీతం సాగర నది తీరం
పదనిసలతో సాగే స్వర రాగం కెరటాల కీర్తం

స్వప్త స్వరాలతో సాగే రాగం మధుర స్వరాగం 
నవ గానాలతో పాడే గీతం సుమధుర సుగంధం  || ఈ గీతం ||

పాటకు ప్రాణం పల్లవిగా పాటలో పరిమళం
మాటకు చరితం చరణంతో కలిగే గౌరవం

ప్రతి పదాన్ని భావనతో పాడితే పాటే మధురం
ప్రతి పల్లవి భావనతో సాగితే గీతమే కమనీయం

రాగాలు నవ విధ భావాల సప్త స్వరాలుగా మన నేస్తం
గీతాలు దశ విధ గానాల దిశ దశాబ్దాలుగా మన కోసం  || ఈ గీతం || 

Sunday, May 29, 2016

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస
ఆట పాటలతో మాటలు కలిపితే పదాలలోనే సద్భావం 
మాటలతోనే బంధాలన్నీ అనువైన ఆనందం
ఆనందంతోనే అనుబంధాలన్నీ సంబంధాలుగా కలిసేను  || సంగీతంలో ||

ఏనాటికైనా బంధాలన్నీ కలిసే వేళ వస్తుంది ఉత్సవంలా
బంధాలతో కొత్త సంభందాలు కలిసినప్పుడే మహోత్సవం
ఊరు వాడ అందరు కలిస్తేనే జరుపుకుంటారు రథోత్సవం
నగరాలన్నీ దేశాలుగా కలిసి జరిగేను మహా బ్రంహోత్సవం  || సంగీతంలో ||

మనస్సు మనస్సు కలిసినప్పుడే కల్యాణోత్సవం
దశాబ్దాలుగా కలిసి జీవిస్తేనే దశ దిక్కులా దశోత్సవం
శతాబ్దాలుగా కలిసి జీవించినప్పుడే మధురమైన శతోత్సవం
ఎన్నాళ్ళైనా ఎక్కడైనా ఎప్పుడైనా అందరు కలిసి చేసుకుంటే వజ్రోత్సవం  || సంగీతంలో ||

ఉత్సవాలను జరుపుకుంటూ పోతే ఎన్నైనా మనకు కలిగే సంగీతాల సంతోషం
అలా చెప్పుకుంటూ పొతే 25 ఏళ్ళ రజతోత్సవం 50 ఏళ్ళ మహోదయ సువర్ణోత్సవం
జరుపుకునే వార్షికోత్సవాలన్నీ ఆనందంగా ఎక్కువ కాలం అందరు జీవించాలనే
కొత్త పాత అందరు నవ భావాలతో నూరేళ్ళు జీవించాలనే ఈ మాటల ఉత్సవాలు  || సంగీతంలో ||

Friday, January 6, 2012

సరిగమ పాట విన్నావా

సరిగమ పాట విన్నావా
విన్నా వింటున్నా వింటూనే ఉంటా
సరిగమ సరిగమ సరికొత్త సంగీత భావాల సంస్కృతి .....!
పదనిస పదనిస మరో కొత్త సంగీత భావాల ఉన్నతి .....!
సంగీతం సంస్కృతిలా సరిగమలు సాగరంలా సంతోష భావాలు కలిగేనులే
సరిగమల సంగీతం సంధ్యా వేళ శుభోదయం
పదనిసల సంతోషం సూర్యోదయ శుభకరం
మనస్సులో జ్వలించే స్వరాల భావాలే సరిగమల సంగీతం