Sunday, May 29, 2016

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస

సంగీతంలో సరిగమ సంతోషంలో పదనిస
ఆట పాటలతో మాటలు కలిపితే పదాలలోనే సద్భావం 
మాటలతోనే బంధాలన్నీ అనువైన ఆనందం
ఆనందంతోనే అనుబంధాలన్నీ సంబంధాలుగా కలిసేను  || సంగీతంలో ||

ఏనాటికైనా బంధాలన్నీ కలిసే వేళ వస్తుంది ఉత్సవంలా
బంధాలతో కొత్త సంభందాలు కలిసినప్పుడే మహోత్సవం
ఊరు వాడ అందరు కలిస్తేనే జరుపుకుంటారు రథోత్సవం
నగరాలన్నీ దేశాలుగా కలిసి జరిగేను మహా బ్రంహోత్సవం  || సంగీతంలో ||

మనస్సు మనస్సు కలిసినప్పుడే కల్యాణోత్సవం
దశాబ్దాలుగా కలిసి జీవిస్తేనే దశ దిక్కులా దశోత్సవం
శతాబ్దాలుగా కలిసి జీవించినప్పుడే మధురమైన శతోత్సవం
ఎన్నాళ్ళైనా ఎక్కడైనా ఎప్పుడైనా అందరు కలిసి చేసుకుంటే వజ్రోత్సవం  || సంగీతంలో ||

ఉత్సవాలను జరుపుకుంటూ పోతే ఎన్నైనా మనకు కలిగే సంగీతాల సంతోషం
అలా చెప్పుకుంటూ పొతే 25 ఏళ్ళ రజతోత్సవం 50 ఏళ్ళ మహోదయ సువర్ణోత్సవం
జరుపుకునే వార్షికోత్సవాలన్నీ ఆనందంగా ఎక్కువ కాలం అందరు జీవించాలనే
కొత్త పాత అందరు నవ భావాలతో నూరేళ్ళు జీవించాలనే ఈ మాటల ఉత్సవాలు  || సంగీతంలో ||

No comments:

Post a Comment